ETV Bharat / offbeat

ఈవెనింగ్ స్నాక్స్​గా "ఉల్లి వడలు" - ​ఇలా ప్రిపేర్ చేశారంటే పకోడిని మించిన టేస్ట్!

- సాయంత్రం వేళ చాయ్​తో సూపర్ కాంబినేషన్ - పిల్లల నుంచి పెద్దల దాకా ఎంతో ఇష్టంగా లాగిస్తారు!

author img

By ETV Bharat Telugu Team

Published : 8 hours ago

Ulli Vada Recipe
How to Make Ulli Vada Recipe (ETV Bharat)

How to Make Ulli Vada Recipe : చాలా మంది ఈవెనింగ్​ టీ టైమ్​లో.. సమోసా, పకోడి, మిక్చర్​ తినడానికి ఎంతో ఇష్టపడతారు. కాస్త కారంగా ఏదైనా స్నాక్​ ఐటమ్​ తిని.. వేడివేడి టీ/కాఫీ తాగితే ఆ ఫీల్​ ఎంతో బాగుంటుంది. అయితే, ఇంట్లో పకోడి, మిర్చి బజ్జీ చేయాలంటే కాస్త టైమ్ ఎక్కువగానే పడుతుంది. అలాంటప్పుడు ఒక్కసారి ఇలా ఉల్లి వడలు ప్రిపేర్​ చేయండి. నిమిషాల్లోనే వేడివేడి వడలు తయారైపోతాయి. ఈ ఉల్లి వడలు ఎంతో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. స్కూల్​ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకి ఉల్లి వడలు పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా ఈ సాయంత్రం ఉల్లి వడలు ట్రై చేయాలనుకుంటున్నారా ? అయితే, స్టోరీ పూర్తిగా చదివి ఇంట్లో రెడీ చేయండి.

కావాల్సిన పదార్థాలు..

  • ఉల్లిపాయలు-5
  • శనగపిండి- అరకప్పు
  • బియ్యం పిండి-పావుకప్పు
  • రుచికి సరిపడా ఉప్పు
  • అల్లం తురుము-టేబుల్​స్పూన్​
  • పచ్చిమిర్చి-4 (సన్నగా కట్​ చేసుకోవాలి)
  • కరివేపాకు-5
  • పసుపు-అరటీస్పూన్​
  • కారం- అర టేబుల్​స్పూన్​
  • నూనె- వేయించడానికి సరిపడా

తయారీ విధానం..

  • ముందుగా ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని కాస్త ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.
  • గిన్నెపై మూత పెట్టి 15 నిమిషాలు అలా వదిలేయాలి. ఇలా చేస్తే ఉల్లిపాయల నుంచి వాటర్​ బయటకు వస్తుంది. (ఉల్లి వడలు చేయడానికి మనం వాటర్​ యూజ్​ చేయకూడదు. వాటర్​ లేకుండా చేసుకుంటే వడలు చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా వస్తాయి.)
  • తర్వాత ఇందులో పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, కరివేపాకు తురుము వేసుకుని కలుపుకోవాలి.
  • అలాగే కారం, పసుపు వేసుకుని బాగా మిక్స్​ చేయాలి. ఇందులో శనగపిండి, బియ్యం పిండి వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. పిండి వడలు వచ్చేలా మిక్స్ చేయండి.
  • ఇప్పుడు స్టౌ పైన కడాయి పెట్టి ఆయిల్​ పోయండి.
  • నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుని వడలు రెడీ చేసి ఆయిల్లో వేయండి.
  • ఒక నిమిషం తర్వాత మెల్లిగా వడలను గరిటెతో కలుపుతూ రెండు వైపులా ఫ్రై చేసుకోండి.
  • ఉల్లి వడలు క్రిస్పీగా, గోల్డెన్​ కలర్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి.
  • మిగిలిన పిండితో ఇలానే వడలను ఫ్రై చేసుకోండి. అంతే ఇలా చేసుకుంటే ఉల్లి వడలు ఎంతో క్రిస్పీగా​ సూపర్ టేస్టీగా వస్తాయి.
  • నచ్చితే మీరు కూడా సాయంత్రం టైమ్​లో ఈ ఉల్లి వడ రెసిపీ ట్రై చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

ఇవి కూడా చదవండి :

కేవలం బియ్యం పిండితో "కరకరలాడే కారం చిప్స్" - నిమిషాల్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండిలా!

ఈ స్నాక్స్​ వెరీ 'గుడ్డు' - ఇలా చేస్తే "సూపర్​ మమ్మీ" అంటూ లొట్టలేసుకుంటూ తింటారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.