ETV Bharat / offbeat

ఇది బ్యాచిలర్స్ స్పెషల్ - కేవలం ఉల్లిపాయలతో సూపర్ కర్రీ! - అన్నం, చపాతీలోకి అదుర్స్​! - How to Make Onion Curry at Home - HOW TO MAKE ONION CURRY AT HOME

Onion Curry: ఇంట్లో కూరగాయలు కావాల్సినన్ని లేకపోతే వంట చేయడం పెద్ద సవాల్. ఇక, బ్యాచిలర్స్ కష్టాలు చెప్పాల్సిన పనేలేదు. అయితే.. ఇలాంటి సమయంలో ఆ పూట గట్టెక్కించే మార్గం ఉంది. అదే ఉల్లిపాయ కర్రీ. కేవలం ఆనియన్స్​తో సూపర్ రెసిపీ చేసుకోవచ్చు. ఆ వివరాలు చూద్దాం.

Onion Curry
Onion Curry (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2024, 2:49 PM IST

How to Make Onion Curry at Home : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకుండా కేవలం ఆనియన్స్​ మాత్రమే ఉన్నప్పుడు.. వాటితో కూడా అద్దిరిపోయే కర్రీ చేసుకోవచ్చు. దీని టేస్ట్ కూడా​ చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్​కు అయితే ఇది చాలా బెస్ట్​ రెసిపీ. ఈ కర్రీని అన్నంతోపాటు చపాతీ, పూరీ, పరోటా ఇలా ఎందులోకైనా అద్దిరిపోతుంది. మరి ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

  • ఉల్లిపాయలు - 4 (మీడియం సైజ్​)
  • నూనె - మూడు టేబుల్​ స్పూన్లు
  • ఆవాలు - అర టీ స్పూన్​
  • జీలకర్ర - అర టీ స్పూన్​
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - 1 టేబుల్​ స్పూన్​
  • పసుపు - పావు టీ స్పూన్​
  • కారం - తగినంత
  • ఉప్పు - తగినంత
  • ధనియాల పొడి - 1 టేబుల్​ స్పూన్​
  • జీలకర్ర పొడి - పావు టీ స్పూన్​
  • గరం మసాలా - పావు టీ స్పూన్​
  • వేయించిన మెంతుల పొడి- చిటికెడు

తయారీ విధానం:

  • ముందుగా ఉల్లిపాయలను పొట్టు తీసి సన్నగా, పొడుగ్గా కట్​ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • నూనె హీట్​ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.
  • ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి మంటను లో ఫ్లేమ్​లో పెట్టి ఓ రెండు నిమిషాలు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత కరివేపాకు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మరో నాలుగు నిమిషాలు ఉల్లిపాయలు మెత్తగా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి.
  • ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసి కలిపి మరికొన్ని నిమిషాలు వేయించుకోవాలి.
  • ఉల్లిపాయలు మెత్తగా మగ్గించుకున్న తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, వేయించుకున్న మెంతుల పొడి వేసి కలుపుకోవాలి. ఈ పొడులన్నీ మార్కెట్లో దొరుకుతాయి. ఒకవేళ మీ దగ్గర మెంతుల పొడి లేకపోతే స్కిప్​ చేయవచ్చు.
  • ఈ మసాలా పొడులన్నీ మాడిపోకుండా ఓ మూడు నిమిషాలు వేయించుకుని దించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ కర్రీ రెడీ.
  • అయితే కూర మొత్తాన్ని కూడా స్టౌ లో-ఫ్లేమ్​లో ఉంచుకునే ప్రిపేర్​ చేసుకోవాలి.
  • దీన్ని వేడి వేడి అన్నంలోకి కలుపుకుని తింటే చాలా బాగుంటుంది.
  • మీ ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేకపోతే ఓ సారి ఇది ట్రై చేయండి..

ఇవీ చదవండి:

సూపర్​ టేస్టీ అండ్​ హెల్దీ "పెసల పులావ్​" - ఇంట్లో ఇలా చేసి పిల్లలకు పెట్టండి- బలంగా ఉంటారు!

నోరూరించే 'దొండకాయ 65' - నిమిషాల్లోనే రెడీ అవుతుంది - టేస్ట్ వేరే లెవల్! - How to Make Dondakaya 65 Easily

వర్షాకాలంలో "పచ్చి పులుసు" ఇలా చేస్తే - టేస్ట్​ గురించి చెప్పడం కాదు, ఆస్వాదించాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.