ETV Bharat / offbeat

నిమిషాల్లో ఘుమఘుమలాడే "మైసూర్​ రసం" - ఇలా చేశారంటే సూపర్​ టేస్ట్​ పక్కా! తినడమే కాదు తాగేస్తారు కూడా! - Mysore Tomato Rasam

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2024, 7:28 PM IST

Mysore Tomato Rasam Recipe: చాలా మంది కూరలతో పాటు ఎప్పుడూ ఏదో ఒక రసాన్ని చేస్తుంటారు. ముఖ్యంగా టమాట రసం, మిరియాల రసం, వెల్లుల్లి రసం అంటూ చేస్తూనే ఉంటారు. అయితే, ఎప్పుడూ అవే కాకుండా ఈసారి కాస్త కొత్తగా మైసూర్​ రసం చేసేయండి. ఇంట్లో వాళ్లందరూ కాస్త అన్నం ఎక్కువే తింటారు. మరి దీనిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

Mysore Tomato Rasam
Mysore Tomato Rasam Recipe (ETV Bharat)

How To Make Mysore Tomato Rasam: చాలా మంది భోజనంలోకి ఎన్ని కూరలు, వేపుళ్లు ఉన్నా.. కాస్త రసంతో తింటేనే తృప్తిగా ఉంటుందని అంటుంటారు. అందుకే వీలైప్పుడల్లా నిమిషాల్లో తయారయ్యే రసాలను ప్రిపేర్​ చేస్తుంటారు. ఇక రసాల్లో టమాట రసం, మిరియాల రసం కచ్చితంగా ఉంటాయి. అయితే, టమాట రసంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఒక్కో చోట ఒక్కో రుచితో ప్రిపేర్​ చేస్తుంటారు. కాబట్టి ఈసారి మీ ఇంట్లో టమాట రసం చేయాలనుకుంటే.. మేము చెప్పే ఈ మైసూర్​ స్టైల్లో చేసేయండి. పేరు వినగానే ఏదో అనుకోవద్దు. ఎందుకంటే ఇది చేయడానికి ఎక్కువ టైమ్​ పట్టదు. త్వరగానే ప్రిపేర్​ అయిపోతుంది. పైగా టేస్ట్​ అద్దిరిపోతుంది. ఒక్క ముద్ద తినే దగ్గర మరో రెండు ముద్దలు అదనంగా లాగిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం మైసూర్​ స్టైల్​ రసం​ ఎలా చేయాలో ఓ సారి చూసేయండి!

కావాల్సిన పదార్థాలు :

  • కందిపప్పు- నాలుగు టేబుల్​ స్పూన్లు
  • టమాటలు - 3
  • బెల్లం- టేబుల్​స్పూన్​
  • పసుపు - చిటికెడు
  • కరివేపాకు-1
  • చింతపండు- నిమ్మకాయసైజంత
  • పచ్చిమిర్చి - నాలుగు
  • నూనె - రెండు చెంచాలు
  • ఉప్పు- రుచికి సరిపడా
  • కొద్దిగా కొత్తిమీర తరుగు

రసం పొడి కోసం..

  • నూనె - 2 టేబుల్​ స్పూన్లు
  • బ్యాడిగి మిర్చి-3
  • పచ్చి శనగపప్పు- టేబుల్​స్పూన్​
  • పచ్చికొబ్బరి- పావుకప్పు
  • మిరియాలు- టీస్పూన్​
  • ధనియాలు- టేబుల్​స్పూన్
  • జీలకర్ర- అర టీస్పూన్​

తాళింపు కోసం..

  • నెయ్యి-టేబుల్​స్పూన్​
  • ఎండుమిర్చి-2
  • జీలకర్ర-టీస్పూన్​
  • ఆవాలు-టీస్పూన్
  • ఇంగువ- అరటీస్పూన్​

టమాటా రసం తయారీ విధానం :

  • ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత కందిపప్పును కుక్కర్లో వేసుకుని ముప్పావు కప్పు నీళ్లు యాడ్​ చేసి మంటను మీడియం ఫ్లేమ్​లో పెట్టి రెండు విజిల్స్​ వచ్చే వరకు ఉడికించుకోండి.
  • తర్వాత మరో స్టవ్​ మీద పాన్​ పెట్టి ఆయిల్​ పోసి బ్యాడిగి మిర్చి, పచ్చి శనగపప్పు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత పచ్చికొబ్బరి వేసి సన్నని మంట మీద మంచి అరోమా వచ్చేవరకు వేపుకోండి. మీకు మైసూర్​ స్టైల్​ రసం టేస్ట్​ రావాలంటే కచ్చితంగా బ్యాడిగి మిర్చి వాడాలి. ఇవి లేకపోతే ఎండు మిర్చిలను వాడుకోవచ్చు.
  • ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • తర్వాత ఓ బౌల్​ తీసుకుని అందులోకి కట్​ చేసిన టమాట ముక్కలు, కొద్దిగా ఉప్పు, బెల్లం, పసుపు వేసుకుని.. మెత్తగా చిదుముకోవాలి. అంటే టమాటలలోని సారం వచ్చేంత వరకు చేతితోనే మెదుపుకోవాలి.
  • అలాగే ఇందులోకి కరివేపాకు, చింత పండు వేసుకుని మరొక సారి మెదుపుకోవాలి.
  • ఇప్పుడు ఆ టమాట సారాన్ని ఓ పెద్ద గిన్నెలోకి తీసుకోండి. ఇందులో లీటర్​ నీళ్లు పోయండి. అలాగే పచ్చిమిర్చిలు వేసి సన్నని మంట మీద రసం పొంగు వచ్చేంత వరకు మరిగించండి.
  • తర్వాత ఉడికించుకున్న పప్పును మూత తీసి మెత్తగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత మరుగుతున్న రసంలో ఉడికించిన పప్పు, గ్రైండ్​ చేసుకున్న మసాలా పొడి వేసి, కొత్తిమీర తరుగు వేసి హై ఫ్లేమ్​ మీద మరో నాలుగు నిమిషాలు మరిగించాలి. తర్వాత మంట సిమ్​లో పెట్టి రసాన్ని మరిగించుకోవాలి.
  • మరోపక్క తాళింపు కోసం స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నెయ్యి వేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
  • ఆ తర్వాత తాళింపును మరుగుతున్న రసంలో వేసి మరో పొంగు వచ్చే వరకు మరిగించుకుంటే.. ఘుమఘములాడే మైసూర్​ రసం రెడీ.
  • ఒక్కసారి ఈ రసంతో తిన్నారంటే.. రెండు ముద్దలు ఎక్కువే తింటారు. నచ్చితే మీరు కూడా ఈ రసం ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

అద్దిరిపోయే టమాటా రసం నిమిషాల్లో సిద్ధం - అన్నంలోకే కాదు సూప్​లా తాగేయొచ్చు!

చిటికెలో ఘుమఘుమలాడే "వెల్లుల్లి చారు" - సింపుల్​గా ఇలా ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ నెక్స్ట్ లెవల్ అంతే! -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.