ETV Bharat / offbeat

చిన్నతనంలో ఇష్టంగా తినే "చందమామ బిస్కెట్లు" - ఇలా చేస్తే స్వీట్​ షాప్​ టేస్ట్​ ఇంట్లోనే! - HOW TO MAKE CHANDAMAMA BISCUITS

-బిస్కెట్లంటే పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు -మైదా లేకుండా గోధుమ పిండితో ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు

How to Make Chandamama Biscuits
How to Make Chandamama Biscuits (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2024, 4:07 PM IST

How to Make Chandamama Biscuits: "చందమామ బిస్కెట్లు".. ఆఫ్​ మూన్​ ఆకారంలో ఉండి కారంగా, ఉప్పగా ఉండే వీటికి ఫ్యాన్స్​ అధికంగానే ఉంటారు. ఇప్పటికి కూడా వీటిని తినే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. ముఖ్యంగా 90's కిడ్స్​ ఫేవరెట్​ స్నాక్​ ఐటమ్​ కూడా. అయితే బయట మార్కెట్లో లభించే చందమామ బిస్కెట్లలో రసాయనాలు కలిసే అవకాశం ఉంటుంది. అందుకని ఇంట్లో ఎంతో శుచిగా, రుచిగా ప్రిపేర్​ చేసుకోండి. ఇవి తయారు చేయడానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు. కేవలం నిమిషాల్లో ప్రిపేర్​ చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో చేస్తే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. మరి, లేట్​ చేయకుండా ఈ చందమామ బిస్కెట్లు ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

  • గోధుమ పిండి - 1 కప్పు
  • వాము - 1 టీస్పూన్​
  • పంచదార - 2 టీస్పూన్లు
  • వంట సోడా - చిటికెడు
  • ఉప్పు - అర టీ స్పూన్​
  • నెయ్యి - 1 టేబుల్​ స్పూన్​
  • నూనె - డీప్​ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం:

  • ముందుగా ఓ బౌల్​లోకి గోధుమ పిండి తీసుకోవాలి. ఇక్కడ గోధుమ పిండి ప్లేస్​లో మైదా కూడా ఉపయోగించవచ్చు.
  • ఆ తర్వాత అందులోకి వాము, పంచదార, వంట సోడా, ఉప్పు, నెయ్యి వేసి బాగా కలిపి ముద్దలాగా చేసుకోవాలి.
  • ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కలుపుకునే విధంగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి ఓ 15 నిమిషాలు పక్కన పెట్టాలి.
  • 15 నిమిషాల తర్వాత పిండి ముద్దను మరోసారి కలిపి ఉండలుగా చేసుకోవాలి.
  • ఆ తర్వాత పొడి పిండి చల్లుకుంటూ చపాతీలుగా చేసుకోవాలి. అయితే ఇక్కడ పిండిని పల్చగా కాకుండా కొద్దిగా మందంగానే రుద్దుకోవాలి.
  • ఆ తర్వాత ఆఫ్​ మూన్​ షేప్​ను తీసుకుని చందమామ బిస్కెట్లుగా కట్​ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే.. వాటర్​ బాటిల్​ క్యాప్​ సాయంతో ఆఫ్​ మూన్​ షేప్​ వచ్చే విధంగా కట్​ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్ పెట్టి​ డీప్​ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి బిస్కెట్లను నూనెలో వేసుకోవాలి. ఓ నిమిషం తర్వాత అవి నూనె పైకి తేలుతాయి. అప్పుడు స్టవ్​ ఆన్​ చేసి మంటను సిమ్​లో పెట్టి గరిటెతో కలుపుతూ గోల్డెన్​ బ్రౌన్​ కలర్​ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే చందమామ బిస్కెట్లు రెడీ.
  • ఒకవేళ ఈ బిస్కెట్లు స్పైసీగా కావాలనుకుంటే వేడి ఉండగానే కొద్దిగా కారం, ఉప్పు, చాట్​ మసాలా చల్లి బాగా కలపాలి. అయితే వీటిని వెంటనే స్టోర్​ చేయకుండా.. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఎయిర్​ టైట్​ కంటైనర్​లో భద్రపరిస్తే నెల రోజుల వరకు క్రిస్పీగా ఉంటాయి.

ఎప్పుడూ ఆనియన్​ సమోసా ఏం బాగుంటుంది - ఓసారి "ఎగ్​ సమోసా" ట్రై చేయండి - టేస్ట్​ అద్దిరిపోతుంది!

పార్టీ స్పెషల్ : ఫుల్ టేస్టీ వెల్లుల్లి కోడి వేపుడు - తిని తీరాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.