ETV Bharat / offbeat

పాతకాలం నాటి "స్వీట్ సజ్జు" - చిటికెలో చేసుకోండిలా! - ఒక్కసారి తింటే వదిలిపెట్టరంతే! - SIMPLE HOMEMADE SWEET

నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే సూపర్ స్వీట్ రెసిపీ - ఒక్కసారి తిన్నారంటే టేస్ట్​కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

SIMPLE HOMEMADE SWEET
Rice Rava Sweet Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 29, 2024, 6:12 PM IST

Easy Rice Rava Sweet Recipe : పిల్లలు ఇంట్లో ఉంటే ఎన్ని రకాల పిండివంటలు చేసినా ఎప్పుడూ ఇవేనా అంటుంటారు. అలాగని డైలీ బయట నుంచి రకరకాలు తీసుకొచ్చి పెట్టలేం కదా. అందుకే ఈ వీకెండ్ ఇంట్లోనే తేలికగా నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునేలా ఒక వెరైటీ స్వీట్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. "పాతకాలం నాటి సూపర్ స్వీట్ సజ్జు". ఈ స్వీట్ కోసం ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. టేస్ట్​ కూడా అద్భుతంగా ఉంటుంది! మరి, ఈ సూపర్ స్వీట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • పెసరపప్పు - 2 టేబుల్​స్పూన్లు
  • బియ్యం రవ్వ - 1 కప్పు
  • ఉప్పు - కొంచం
  • కొబ్బరి తురుము - 3 చెంచాలు
  • నెయ్యి - 2 టేబుల్​స్పూన్లు
  • జీడిపప్పు పలుకులు - కొన్ని
  • కిస్మిస్ - కొన్ని
  • బెల్లం - 1 కప్పున్నర
  • యాలకుల పొడి - 1 టీస్పూన్

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా స్టౌపై పాన్ పెట్టుకొని పెసరపప్పు వేసుకొని రెండు నిమిషాల పాటు దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం అదే పాన్​లో బియ్యం రవ్వ వేసుకొని మీడియం ఫ్లేమ్​ మీద కాస్త రంగు మారేంత వేయించుకోవాలి. అందుకోసం 3 నుంచి 4 నిమిషాల సమయం పట్టొచ్చు. ఆవిధంగా వేయించుకున్నాక దాన్ని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై మళ్లీ అదే పాన్ పెట్టుకొని రెండు కప్పుల కంటే కాస్త ఎక్కువగా వాటర్ పోసుకోవాలి. ఆపై అందులో ఉప్పు, కొబ్బరి తురుము వేసుకొని బాగా కలిపి మరిగించుకోవాలి.
  • ఆ తర్వాత మిశ్రమం వేడెక్కి మరుగుతున్నప్పుడు అందులో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పెసరపప్పు, బియ్యం రవ్వ వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆపై పాన్​పై మూతపెట్టుకొని నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి.
  • ఈలోపు ఇంకో బర్నర్ మీద చిన్న కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగి కాస్త వేడయ్యాక జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై ఇంకో గిన్నెలో పావు కప్పు వాటర్ పోసుకొని బెల్లం వేసుకొని అది పూర్తిగా కరిగే వరకు మరిగించుకోవాలి.
  • ఆ తర్వాత కరిగించుకున్న బెల్లం పాకాన్ని వడకట్టుకొని మరో బర్నర్ మీద మగ్గించుకుంటున్న బియ్యం రవ్వ మిశ్రమంలో పోసుకొని మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి.
  • ఆపై స్టౌను మీడియం ఫ్లేమ్​లో ఉంచి మిశ్రమం దగ్గరపడేంత వరకు గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక ఆఖరున కొద్దిగా యాలకుల పొడి, వేయించుకున్న జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా కలుపుకొని దింపేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే పాతకాలపు "సజ్జు స్వీట్" రెడీ!

ఇవీ చదవండి :

అన్నం మిగిలిపోయిందా? - ఓసారి ఇలా "జిలేబీలు" చేయండి - స్వీట్​ షాప్​ స్టైల్​ పక్కా!

సేమియాతో ఉప్మా, పాయసమే కాదు - ఇలా "లడ్డూలు" ప్రిపేర్ చేసుకోండి! - టేస్ట్ అదుర్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.