ETV Bharat / offbeat

ఇకపై చిటికెలో బర్త్, డెత్ సర్టిఫికేట్స్- అదెలాగంటే? ఈ లింక్‌తో ఈజీగా రిజిస్టర్ చేసుకోండిలా..!

సరికొత్త CRS మొబైల్​ యాప్​ను తీసుకొచ్చిన కేంద్రం- ఈజీగా జనన మరణాలను రిజిస్టర్ చేసుకోండిలా..!

CRS Mobile App
CRS Mobile App (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 1, 2024, 10:22 AM IST

Updated : Nov 1, 2024, 10:45 AM IST

Govt Launches CRS Mobile App: జనన మరణాలను రిజిస్టేషన్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ సరికొత్త మొబైల్​ యాప్​ను తీసుకొచ్చింది. ఈ యాప్​తో తక్కువ సమయంలో ఈజీగా రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు. అంతేకాక దీని ద్వారా జనన, మరణ సర్టిఫికేట్స్​ రెండింటినీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదేలాగంటే? ఈ అధికారిక లింక్‌ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి: https://dc.crsorgi.gov.in/crs/mobile-app-policy

కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఈ CRS (సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్) మొబైల్​ యాప్​ను లాంచ్ చేసింది. ఇది జనన మరణాలన రిజిస్ట్రేషన్స్ (స్మూత్ అండ్ హసల్ ఫ్రీ) చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ కొత్త యాప్​తో సిటిజన్స్ ఏ సమయంలోనైనా ఎక్కడి నుంచైనా తమ రాష్ట్రంలోని అధికారిక భాషలో బర్త్ అండ్ డెత్​ను రిజిస్టర్ చేసుకోవచ్చు.

ఈ మేరకు CRS మొబైల్ యాప్​ను ప్రారంభించినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా సోషల్ మీడియా ప్లాట్​ఫారమ్ X లో పోస్ట్​ చేశారు. ఈ యాప్​లో చాలా ఈజీగా తక్కువ సమయంలో రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చని తెలిపారు. డిజిటల్ ఇండియా విజన్​లో భాగంగా ప్రధాని మోదీ దీన్ని రూపొందించారని వివరించారు.

ఈ పోస్ట్​లో రిజిస్ట్రార్ జనరల్​ ఆఫ్ ఇండియా నుంచి ఓ చిన్న వీడియోను కూడా యాడ్ చేశారు. ఇది యాప్ ఇంటర్​ఫేస్​ వివరాలను క్లియర్​గా వివరిస్తుంది. CRS మొబైల్ యాప్​ డిజిటల్ సర్టిఫికెట్ల ఎలక్ట్రానిక్ డెలివరీని, హెరిటేజ్ రికాటర్డ్స్​ను ఆన్​లైన్​లో డిజిటలైజేషన్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ మొబైల్ యాప్ ఆపరేటింగ్, మెయింటెనెన్స్​కు రాష్ట్రాలపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదు.

ఈ అధికారిక లింక్‌ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి: https://dc.crsorgi.gov.in/crs/mobile-app-policy

దీన్ని ఉపయోగించడం ఎలా:

  • ఈ యాప్​లో జనన మరణాలను రిజిస్ట్రేషన్ చేయాలంటే మొదట గూగుల్​ ప్లే స్టోర్​ నుంచి CRS యాప్​ను డౌన్​లోడ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత యూజర్ ఐడీ, పాస్​వర్డ్​తో లాగిన్ అవ్వాలి.
  • ఇప్పుడు యాప్ క్యాప్చా ఫిల్​ చేయమని అడుగుతుంది.
  • ఆ తర్వాత అది రిజిస్టర్డ్ మొబైల్​ నంబర్​కు OTPతో SMS పంపుతుంది.
  • ఈ OTPని ఎంటర్​ చేసిన వెంటనే లాగిన్ పూర్తవుతుంది.
  • CRS యాప్ జనన మరణాలను హోమ్​ స్క్రీన్​లో చూపిస్తుంది.
  • టాప్ లెఫ్ట్ కార్నర్​లో హాంబర్గర్​ ఐకాన్​పై ట్యాప్ చేస్తే మెను ఓపెను అవుతుంది.
  • ఇది వినియోగదారుల బర్త్, డెత్, స్టిల్ విత్, అడాప్షన్, ప్రొఫైల్ అండ్ యాడ్/ వ్యూ పేమెంట్ వివరాలను నావిగేట్ చేసేందుకు ఉపయోగపడుతుంది.

బర్త్​ రిజిస్ట్రేషన్:

  • జననాన్ని రిజిస్ట్రర్ చేసేందుకు 'Birth' అనే ఆప్షన్​లోకి వెళ్లి అందులో కన్పించే 'Register Birth'పై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత వారు పుట్టిన తేదీ, అడ్రస్, ఫ్యామిలీ వివరాలు వంటి అవసరమైన వివరాలను ఫిల్ చేయాలి.

డెత్ రిజిస్ట్రేషన్:

  • మరణాన్ని రిజిస్ట్రేట్ చేసుకునేందుకు 'Death' ఆప్షన్​లోకి వెళ్లి 'Register Death'పై క్లిక్ చేయండి.
  • యూజర్స్ పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేసిన వెంటనే అవసరమైన సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. ఈ యాప్​తో జనన, మరణ సర్టిఫికేట్స్​ రెండింటినీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ అధికారిక లింక్‌ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి : https://dc.crsorgi.gov.in/crs/mobile-app-policy

Last Updated : Nov 1, 2024, 10:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.