ETV Bharat / offbeat

చెవిలో కోరికలు చెబితే తీర్చే వినాయకుడు - ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా! - Vinayaka Chavithi utsavalu

Bikkavolu Sri Lakshmi Ganapathi Temple East Godavari : కోరిన కోర్కెలు భగవంతుడు నెరవేరుస్తాడనేది భక్తుల నమ్మకం. అయితే ఆ దేవాలయంలోని వినాయకుడు మాత్రం చెవిలో కోర్కెలు చెబితే తీర్చేస్తాడని అక్కడి భక్తులు నమ్ముతారు. ఇలాంటి ప్రసిద్ధిగాంచిన ఆలయం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలో ఉంది.

BIKKAVOLU SRI LAKSHMI GANAPATHI
BIKKAVOLU SRI LAKSHMI GANAPATHI (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2024, 2:57 PM IST

Bikkavolu Sri Lakshmi Ganapathi Temple East Godavari : భక్తులు ఆలయాలకు వెళ్లడం, తమ బాధలను తీర్చి కోరికలను నెరవేర్చమని ప్రార్థించడం, పూజలు చేయడం మామూలే. కానీ ఆ దేవాలయంలో మాత్రం తమ వినతులను స్వయంగా స్వామి చెవిలోనే చెప్పుకుంటారు. కోరిన కోరికలు నెరవేరిన తర్వాత పునః దర్శనానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

విఘ్నాలను తొలగించి శుభాలను ప్రసాదించే స్వామి వినాయకుడు. అందుకే గణనాథుడ్ని దేవతలు సైతం ఆరాధిస్తారు. వినాయకుడు అన్ని చోట్ల కొలువై భక్తులకు అండగా ఉంటాడు. గణేశుడి ఆలయాల్లో ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీలక్ష్మీ గణపతి దేవాలయం ఒకటి. 10 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పుతో ఉన్న గణనాథుడి తొండం కుడివైపునకు తిరిగి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ కొలువుదీరిన గణనాథుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయంలోని వినాయకుడికి చెవిలో కోరికలు చెబితే కచ్ఛితంగా నెరవేరుస్తారని భక్తుల నమ్మకం.

చెవిలో కోరికలు చెబితే తీర్చే ఆలయం - ఎక్కడుందో తెలుసా! (ETV Bharat)

లిమ్కా బుక్​ ఆఫ్​ రికార్డులో వెండి వినాయకుడు - పురవీధుల్లో ఘనంగా ఊరేగింపు - Silver Ganesha Procession

అందుకే ఈ ఆలయానికి భక్తులు దూరప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి ముడుపులు కడతారు. కోరిన కోర్కెలు నెరవేరుతాయన్న నమ్మకంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక్కడి వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలిగి శుభం కలుగుతుందని స్థానికులు చెబుతున్నారు.

ఘనంగా ప్రారంభమైన కాణిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు - Kanipaka Vinayaka Brahmotsavams

బిక్కవోలులో స్వయంభుగా వెలసిన విఘ్నాధిపతి ఆలయంలో ఘనంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా స్వామివారికి తీర్థపు బిందె సేవతో వేడుకలు వైభవంగా నిర్వహించారు. గణనాథుని ఉత్సవాలు 9 రోజులు నిర్విరామంగా జరగనున్నాయి. వివిధ ప్రాంతాలు నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి పూజలు అభిషేకాలు చేస్తున్నారు. ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ తెలిపింది.

అయినవిల్లి గణపయ్య గుడికి వెళ్లారా? ఒక్క కొబ్బరికాయ కొడితే మీ సమస్యలన్నీ క్లియర్! - Ainavilli Vinayaka Temple

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.