ETV Bharat / offbeat

సూపర్​ టేస్ట్​తో బిహారీ స్టైల్​ "స్పైసీ చికెన్​ మసాలా కర్రీ" - ఇలా చేశారంటే ఒక్క ముక్క మిగలదు!

- కొత్త వంటకాలను ఇష్టపడేవారికి సూపర్ అప్షన్ -తక్కువ టైమ్​లోనే ఎంతో టేస్టీగా ప్రిపేర్​ చేసుకోవచ్చు

Chicken Masala Curry
Bihar Style Spicy Chicken Masala Curry (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Bihar Style Spicy Chicken Masala Curry: నాన్​వెజ్​ ప్రియులు ఎక్కువగా ఇష్టపడే వాటిలో చికెన్​ ఫస్ట్​ ప్లేస్​లో ఉంటుంది. అయితే చికెన్ అంటే ఎంత ఇష్టమైనా సరే.. ఎప్పుడూ ఒకటే తరహాలో తినాలంటే బోర్ కొడుతుంది. అందుకే.. కొందరు వెరైటీ రెసిపీస్ ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారి కోసం ఒక సూపర్ చికెన్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. "బిహార్​ స్టైల్​ స్పైసీ చికెన్​ మసాలా కర్రీ". చాలా తక్కువ పదార్థాలతో ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఒకసారి ఈ రెసీపీని ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ ఆస్వాదించండి. మరి, ఇంతకీ దీని తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అన్న వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

మారినేట్​ కోసం:

  • చికెన్​ - అర కిలో
  • కారం - అర టేబుల్​ స్పూన్​
  • పసుపు - అర టీ స్పూన్​
  • ఉప్పు - కొద్దిగా
  • ఆవాల నూనె - 2 టేబుల్​ స్పూన్లు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - 1 టేబుల్​ స్పూన్​

మసాలా పొడి కోసం:

  • లవంగాలు - 6
  • జాపత్రి - కొద్దిగా
  • నల్ల యాలక -1
  • ధనియాలు - టేబుల్​ స్పూన్​
  • దాల్చిన చెక్క - కొద్దిగా
  • మిరియాలు - అర టీస్పూన్​
  • జీలకర్ర - 1 టీ స్పూన్​
  • యాలకులు -4
  • ఆవాలు- అర టీ స్పూన్​

కర్రీ కోసం:

  • ఆవ నూనె - 7 టేబుల్​ స్పూన్లు
  • ఎండు మిర్చి - 2
  • బిర్యానీ ఆకు - 1
  • యాలకులు - 2
  • నల్ల యాలకులు - 2
  • దాల్చిన చెక్క - కొద్దిగా
  • లవంగాలు -4
  • ఉల్లిపాయ తరుగు - అర కప్పు
  • పచ్చిమిర్చి - 3
  • వెల్లుల్లి రెబ్బలు -8
  • అల్లం- కొద్దిగా
  • వెల్లుల్లి - 2
  • వేయించిన జీలకర్ర పొడి - 1 టీస్పూన్​
  • ధనియాల పొడి - 1 టీ స్పూన్​
  • కారం- టేబుల్​ స్పూన్​
  • పసుపు - పావు టీ స్పూన్​
  • రుచికి సరిపడా - ఉప్పు
  • నీరు - సరిపడా
  • వేడినీరు - ఒకటిన్నర కప్పు
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం:

  • ముందుగా ఓ బౌల్​లోకి చికెన్​ తీసుకుని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్​, నూనె పోసి ముక్కలకు మసాలా బాగా పట్టేలా కలిపి ఓ గంట పాటు ఫ్రిజ్​లో పెట్టాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి లవంగాలు, నల్ల యాలక, ధనియాలు, జాపత్రి, దాల్చిన చెక్క, మిరియాలు, జీలకర్ర, యాలకులు, ఆవాలు వేసి సన్నని సెగ మీద మసాలాలు దోరగా అయ్యి మంచి వాసన వచ్చే వరకు వేయించుకుని స్టవ్​ ఆఫ్​ చేసుకోవాలి. ఆ మసాలాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్​లోకి వేసుకుని మెత్తని పొడి చేసి పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ మీద మరో గిన్నె పెట్టి 3 టేబుల్​ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్​ హీట్​ ఎక్కిన తర్వాత మారినేట్​ చేసుకున్న చికెన్​ వేసుకుని బాగా కలుపుకోవాలి. స్టవ్​ను హై ఫ్లేమ్​లో పెట్టి చికెన్​లోని నీరు ఇంకిపోయి నూనె పైకి తేలి ముక్క రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ముక్క కలర్​ మారిన తర్వాత తీసి ప్లేట్​లో పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అదే గిన్నెలో మిగిలిన నూనె వేసుకుని ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, యాలకులు, నల్ల యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి.
  • ఈలోపు రోట్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క వేసుకుని కచ్చాపచ్చగా దంచుకోవాలి.
  • ఇప్పుడు ఈ పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి. అలాగే అందులోకి 2 వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా కలిపి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడి రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత పావు కప్పు నీరు పోసి మసాలాలు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి.
  • మసాలాల నుంచి నూనె పైకి తేలినప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్​ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు గ్రైండ్​ చేసుకున్న మసాలా పొడిని ఒకటింపావు వేసుకుని ఓ నిమిషం పాటు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత కప్పున్నర వేడి నీళ్లు పోసి బాగా కలిపి స్టవ్​ను మీడియం ఫ్లేమ్​లో పెట్టి మూత పెట్టి నూనె పైకి తేలి కూర దగ్గరపడేంతవరకు ఉడికించాలి. అంటే సుమారు 20 నుంచి 25 నిమిషాల టైమ్​ పడుతుంది.
  • అంతే అందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి దింపుకుని సర్వ్​ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బిహారీ స్టైల్​ స్పైసీ చికెన్​ కర్రీ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

అసలు సిసలైన ఆంధ్రా స్టైల్​ "నాటుకోడి వేపుడు" - ఈ పద్ధతిలో చేశారంటే తినేకొద్దీ తినాలనిపిస్తుంది!

దసరా పార్టీకి సూపర్ పార్ట్​నర్ - పంజాబీ స్టైల్ "పటియాలా చికెన్ కర్రీ" - అద్దిరిపోవాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.