ETV Bharat / offbeat

అతని వయసు పెరగడం ఆగిపోయింది! - పదేళ్లుగా అక్కడే ఉన్నాడు!! - 23Year Person Looks 13year Old Boy

23 Year Old Person Looks Like 13year Old Boy : అతని వయసు 23 ఏళ్లు.. కానీ చూడ్డానికి మాత్రం 13ఏళ్ల బాలుడిలా కనిపిస్తాడు. దీనికి కారణం ఏమంటే.. అతనిలో ఎదుగుదల ఆగిపోయింది. సంవత్సరాలు దొర్లిపోతున్నాయి తప్ప, అతను అక్కడే ఆగిపోయాడు! మరి.. అతని విషయంలో ఏం జరిగింది? అనేది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

23 Year Old Person Looks Like 13year Old Boy
23 Year Old Person Looks Like 13year Old Boy (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 8, 2024, 2:49 PM IST

23 Year Old Person Looks Like 13year Old Boy : బ్రెజిల్‌లోని పాస్సో ఫుండో నగరానికి చెందిన లూయిజ్‌ అగస్టో మార్సియో మార్వెస్‌ అనే బాలుడు... ఏడేళ్ల వరకు అందరి పిల్లల్లాగే నార్మల్​గానే ఉండేవాడు. ఆ తరువాత నుంచి ఏమైందో.. లూయిజ్‌కు అప్పుడప్పుడూ విపరీతమైన తలనొప్పి వస్తుండేది. అందువల్ల సరిగ్గా చదువలేకపోయేవాడు.. రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోయేవాడు. దీంతో ఆస్పత్రికి వెళ్లగా.. డాక్టర్లు కూడా కారణం ఏంటో తేల్చలేకపోయారు. ఈ క్రమంలోనే కొందరు అతడికి వైరస్‌ సోకిందని.. మానసిక స్థితి సరిగా లేదని మరికొందరు చెప్పడం ప్రారంభించారు. అందుకే సోమరిగా మారి ఇలా ప్రవర్తిస్తున్నాడని ఇంకొంత మంది అనేవారు. ఇలా అనేక అవమానాలు అనుభవించిన బాలుడు.. చివరికి ఓ ఆస్పత్రి వైద్యులను సంప్రదించగా అసలు విషయం బయటపడింది. అదేంటో తెలుసా?

పది లక్షల మందిలో ఒకరికి వస్తుందట..
లూయిజ్‌ ఇలా మారడానికి కారణం ఓ అరుదైన వ్యాధని తేల్చారు వైద్యులు. 'క్రానియోఫారింగియోమా' అనే అరుదైన వ్యాధి బారినపడి ఇలా చేసినట్లు డాక్టర్లు చెప్పారు. ఈ బ్రెయిన్‌ ట్యూమర్‌ వ్యాధి దాదాపు పది లక్షల మందిలో ఒకరికి వస్తుందని... వెంటనే మెదడులోని కణతిని తొలగించకపోతే మరికొన్ని రోజుల్లో లూయిజ్​ చనిపోతాడని కుటుంబసభ్యులకు చెప్పారు వైద్యులు. ఒక వేళ ఆపరేషన్‌ చేసినా కూడా బాలుడు మాట్లాడటం, నడవడం, కళ్లను తిప్పడం, పెరుగుదల ఆగిపోవడం వీటిలో ఏదైనా ఒకటి జరగొచ్చని మరో బాంబు లాంటి వార్తను చెప్పారు. వైద్యుల మాటలతో కంగుతిన్న కుటుంబసభ్యులు.. లూయిజ్‌ తమ కళ్ల ముందు ఉంటే అదే చాలని ఆపరేషన్‌కే ఓకే చెప్పారు.

ఆపరేషన్​కు అంతా సెట్​ అయ్యింది. వైద్యులు చెప్పినట్లుగానే ఆపరేషన్‌ను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇప్పుడే అందరిలోనూ ఏం జరుగుతుందో అన్న టెన్షన్​ మొదలైంది. లూయిజ్​ పరిస్థితిని గమనించడానికి కొన్ని రోజులు పరిశీలనలో పెట్టగా.. తొందరగానే కోలుకున్నాడు. ఇలా కొద్ది రోజుల బాగానే ఉన్న తర్వాత ఓ సారి చేసిన వైద్య పరీక్షల్లో ఒక కంగుతినే విషయం బయటపడింది. ఆపరేషన్‌ చేయడం వల్ల పిట్యూటరీ అనే గ్రంథి దెబ్బతిన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఫలితంగా లూయిజ్‌ పెరుగుదల ఏ క్షణమైనా ఆగిపోవచ్చని వైద్యులు స్పష్టం చేశారు. అలా వైద్యులు చెప్పినట్లుగానే.. 12 ఏళ్లు నిండగానే లూయిజ్‌ ఎదుగుదల పూర్తిగా ఆగిపోయింది. ప్రస్తుతం లూయిజ్​కు 23 ఏళ్లు వచ్చినా.. ఇప్పటికీ బాలుడిగానే ఉండిపోయాడు.

12 సార్లు ఆపరేషన్​..
అయితే, మెదడుకు ఎలాంటి నష్టం జరగకుండా చాలా జాగ్రత్తగా ఆపరేషన్ చేసిన వైద్యులు.. క్రానియోఫారింగియోమా కణతిని తొలుత కేవలం 20 శాతం మాత్రమే తొలగించగలిగారు. ఇంకా మిగతా కణతిని తొలగించడానికి లూయిజ్​కు సుమారు 12 ఆపరేషన్లు చేశారు. ఈ నేపథ్యంలోనే బాలుడికి దెబ్బతిన్న పిట్యూటరీ గ్రంథిని.. గ్రోత్‌ హార్మోన్‌ ఎక్కించి మళ్లీ పని చేయించేలా చేయాలనుకున్నారు. కానీ ఇలా చేయడం వల్ల అది మళ్లీ ట్యూమర్‌ను కూడా పెంచే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. దీంతో భయపడిపోయిన బాలుడి కుటుంబ సభ్యులు.. అందుకు అంగీకారం చెప్పలేదు.

వాళ్లతోనే ఫ్రెండ్​షిప్​..
అంతా బాగానే ఉన్నా.. తోటి స్నేహితుల్లా తన ఎదుగుదల లేకపోవడం తట్టుకోలేకపోయాడు లూయిజ్‌. పాఠశాలకు వెళ్లినా.. టీచర్లు, కనీసం తోటి పిల్లలతో కూడా మాట్లాడటం మానేశాడు. కేవలం తన పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్న కుటుంబసభ్యుల ఎదుట మాత్రమే మాట్లాడేవాడు. ‘కుటుంబసభ్యుల సహకారమే లేకుంటే తాను ఆ బాధ నుంచి బయటకు రాలేకపోయేవాడినని ఓ సమయంలో మీడియాతో లూయిజ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. తర్వాత తన పరిస్థితిని పెద్దలు మాత్రమే అర్థం చేసుకుంటారని భావించిన లూయిజ్​.. వారితోనే స్నేహం చేయడం ప్రారంభించాడు. ప్రస్తుతం అతడి ఎత్తు 1.62 మీటర్లు కాగా.. బరువు 50 కేజీలు.

ఇంట్రస్టింగ్ : ఈ కాకులు మాట్లాడతాయి! - పాటలూ పాడతాయట!! - Interesting Facts About Crow

ఇంట్రస్టింగ్ ​: వయసు ప్రకారం - ఎవరు ఎన్ని గంటలు నిద్రపోవాలో మీకు తెలుసా? - Sleep Requirements By Age

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.