ETV Bharat / international

మోదీకి అభినందనల వెల్లువ- ఇటలీ ప్రధాని మెలోనీ అలా- మాల్దీవుల అధ్యక్షుడు ఇలా! - Lok Sabha Election results 2024

World Leaders Wishes to PM Modi : సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ దేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అనేక దేశాల అధినేతలు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. అతిపెద్ద ప్రజాస్వామ్యం భారత్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.

World Leaders Wishes to PM Modi
World Leaders Wishes to PM Modi (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 5, 2024, 8:18 AM IST

Updated : Jun 5, 2024, 5:21 PM IST

World Leaders Wishes to PM Modi : లోక్​సభ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రపంచ దేశాల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మోదీకి అభినందనలు తెలిపారు. ఇటలీ, భారత్‌ బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు. భారత్‌తో బంధం మరింత బలోపేతం కోసం ఎదురు చూస్తున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే తెలిపారు. నేపాల్ ప్రధాని ప్రచండ మరోసారి విజయం సాధించిన మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య కసరత్తు విజయవంతంగా పూర్తైనందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. భారత్‌తో కలిసి పనిచేసేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పారు.

మారిషస్‌ ప్రధానమంత్రి ప్రవింద్ కుమార్ జుగ్నౌత్ కూడా చరిత్రాత్మక విజయం సాధించారంటూ మోదీకి అభినందనలు తెలియజేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ మరింత ఉన్నతి సాధిస్తూనే ఉంటుందన్నారు. ప్రధానికి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జు శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని వివరించారు. భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ‌్గే కూడా మోదీకి అభినందనలు తెలియజేశారు. ఉన్నత శిఖరాలకు ఎదుగుతున్న భారత్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.

అమెరికా, చైనా శుభాకాంక్షలు
భారత్ ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసిందని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ వ్యాఖ్యానించారు. ఇరుదేశాల సన్నిహిత సంబంధాలు ఇకపైనా కొనసాగుతాయని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. జమైకా ప్రధానమంత్రి ఆండ్రూ హోల్‌నెస్, బార్బొడోస్‌ ప్రధానమంత్రి మియా అమోర్ మోట్లీ కూడా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ కూటమి మరోసారి విజయం సాధించినందుకు ప్రధాని మోదీకి చైనా అభినందనలు తెలియజేసింది. ఇరుదేశాల ప్రయోజనాల కోసం కలిసి పనిచేసేందుకు సిద్ధమని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ పేర్కొన్నారు. శాంతి, సుస్థిరతల కోసం పరస్పర సహకారం అవసరమని ఆమె వివరించారు. తనకు అభినందనలు తెలిపిన నాయకులు, దేశాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఆయా దేశాలతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.

జెలెన్​ స్కీ, నెతన్యాహు విషెస్​
మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ కూడా ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రాధాన్యాన్ని ప్రపంచం గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరు దేశాల సంబంధాలు కొత్త శిఖరాలకు చేరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మహారాష్ట్రలో NDAకి షాక్- 'ఇండియా' కూటమికి జై- ఉద్ధవ్​, శరద్​ పక్షానే ప్రజలు! - Lok Sabha Election 2024 Result

'మూడో విడతలో భారీ నిర్ణయాలు'- ఫలితాలు చారిత్రక ఘట్టమన్న మోదీ - Lok Sabha Election Result 2024

Last Updated : Jun 5, 2024, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.