ETV Bharat / international

నాడు టిమ్​ వాల్జ్​ను మెచ్చుకుంటూ - ఇప్పుడు కాదంటూ - ట్రంప్ భిన్న స్వరాలు! - Trump About Tim Walz

Trump Praised Tim Walz : జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతి అమెరికాను కుదిపేసిన విషయం తెలిసిందే. నాడు చెలరేగిన అల్లర్ల నియంత్రణ అంశం ఇప్పుడు ఎన్నికల్లో ఇరుపక్షాలకు ప్రచారాస్త్రంగా మారింది. ట్రంప్‌ దీనిపై భిన్నమైన వాదనలు చేస్తుండడం గమనార్హం.

Trump
Trump (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 9, 2024, 8:42 AM IST

Trump Praised Tim Walz : అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి బలైన జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఉదంతం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఎన్నికల సందర్భంగా నాటి ఘటనను గుర్తుచేస్తూ అధికార, విపక్షాలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఫ్లాయిడ్‌ మృతికి వ్యతిరేకంగా చెలరేగిన హింసాత్మక ఘటనలను నియంత్రించడంలో అప్పటి మిన్నెసోటా గవర్నర్‌ టిమ్‌ వాల్జ్​ విఫలమయ్యారని డొనాల్డ్‌ ట్రంప్‌ సహా ఆయన రన్నింగ్‌ మేట్‌ జేడీ వాన్స్‌ ఆరోపిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఆడియో మాత్రం అందుకు భిన్నంగా ఉండడం గమనార్హం. ఈ ఆడియోలో ట్రంప్ స్వయంగా టిమ్ వాల్జ్​ను ప్రశసిస్తున్నట్లుగా ఉంది. టిమ్‌ వాల్జ్​ను డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ నాటి ఘటనలను ఉద్దేశిస్తూ, అల్లర్లను నియంత్రించేందుకు అధ్యక్ష హోదాలో ఉన్న తాను అప్పట్లో కేంద్ర బలగాలను పంపినట్లు తెలిపారు. లేదంటే ఈ రోజు మినియాపోలీస్‌ ఉనికిలోనే ఉండేది కాదన్నారు. గవర్నర్‌గా ఉన్న వాల్జ్​ అలసత్వం వహించారని, అందువల్లే నగరం అట్టుడికిపోయిందని ఆరోపించారు. ఆ సమయంలో తాను గనక అధ్యక్షుడిగా ఉండి ఉండకపోతే పరిస్థితులు మరోలా ఉండేవని పేర్కొన్నారు. నగర మేయర్‌ విజ్ఞప్తి చేసినప్పటికీ వాల్జ్​ స్పందించలేదని ఆరోపించారు. ఫలితంగా చాలా పోలీసు స్టేషన్లు మంటల్లో దగ్ధమయ్యాయని, అనేక మంది పోలీసులు దాడులకు గురయ్యారని చెప్పారు. వాన్స్‌ సైతం తన వంతుగా ట్రంప్‌ వాదనను ఎన్నికల ప్రచారాల్లో ఉటంకిస్తున్నారు.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఆడియోలో మాత్రం ట్రంప్‌ ఆరోపణలకు భిన్నమైన వాదన ఉంది. నాటి అల్లర్లను నియంత్రించేందుకు వాల్జ్​ స్వయంగా ముందస్తు చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది. కేంద్ర బలగాలను పంపాలని స్వయంగా తానే కోరినట్లు వాల్జ్​ తాజాగా వెల్లడించారు. ఫలితంగానే హింసాత్మక ఘటనలు నియంత్రణలోకి వచ్చినట్లు ఆయన చెబుతున్నారు. టిమ్​ వాల్జ్​ తీసుకున్న నాటి చర్యలను ట్రంప్‌ ప్రశంసిస్తున్నట్లు ఆడియోలో స్పష్టంగా ఉండడం గమనార్హం. కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలన్న నిర్ణయం సరైనదని ఆయన కొనియాడారు. అల్లర్లను నియంత్రించడంలో సఫలమయ్యారని వాల్జ్​ను మెచ్చుకున్నారు కూడా. పైగా తప్పంతా మేయర్‌దేనని అంటున్నట్లుగా కూడా ఆడియోలో ఉంది. వాల్జ్​ సైతం కేంద్రం తరఫున సహాయ సహకారాలు అందించినందుకు ట్రంప్‌ సహా ఆయన బృందానికి కృతజ్ఞతలు తెలిపినట్లు ఆ ఆడియోలో ఉంది.

2025 ఫిబ్రవరి వరకు అంతరిక్షంలోనే సునీత విలియమ్స్ - కారణం ఏమిటంటే? - Sunita Williams To Stay In Space

ఆగస్టు 26న స్పేస్‌ఎక్స్‌ 'పోలారిస్‌ డాన్‌' ప్రయోగం - చరిత్ర సృష్టిస్తుందా? - SpaceX Polaris Dawn

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.