ETV Bharat / international

బైడెన్, ట్రంప్​ మాటల యుద్ధం- లైవ్​​ డిబేట్​లో వాడివేడిగా అధ్యక్ష అభ్యర్థుల చర్చ - Trump Biden Presidential Debate

Trump Biden Presidential Debate : మరికొద్ది నెలల్లో అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ కీలక పరిణామం జరిగింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లైవ్ డిబేట్​లో పాల్గొన్నారు. వలస విధానం, ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ కల్పనపై ప్రశ్నలు సంధించుకుని పరస్పరం విమర్శించుకున్నారు. ఒకరినొకరు అబద్దాలుకోరుగా అభివర్ణించుకున్నారు. 90 నిమిషాల పాటు జరిగిన ఈ డిబేట్​లో నువ్వా -నేనా అన్నట్లు వాదించుకున్నారు.

Trump Biden Presidential Debate
Trump Biden Presidential Debate (ANI / Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 28, 2024, 11:28 AM IST

Trump Biden Presidential Debate : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య ముఖాముఖి వాడీ వేడిగా జరిగింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఒకరినొకరు అబద్దాలకోరుగా విమర్శించుకున్నారు. అట్లాంటాలో గురువారం లైవ్ డిబేట్​లో ఇరు పార్టీల అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ లైవ్ డిబేట్ 90 నిమిషాల పాటు హోరాహోరీగా సాగింది.

'ద్రవ్యోల్బణం, ఉద్యోగాల కల్పనలో బైడెన్ ఫెయిల్'
అమెరికాలో ద్రవ్యోల్బణం, ఉద్యోగాల కల్పన విషయంలో బైడెన్‌ ప్రభుత్వంపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ విరుచుకుపడ్డారు. ఈ విషయంలో బైడెన్‌ విఫలమయ్యారని ఆరోపించారు. అందుకు బైడెన్ సైతం ధీటుగా బదులిచ్చారు. ట్రంప్, తన హయాంలో సంపన్నులకు ప్రాధాన్యం ఇచ్చారని, ఫ్రీఫాల్​లో ఉన్న ఆర్థిక వ్యవస్థను తనకు అందించారని బైడెన్ ఆరోపించారు. కొవిడ్ మహమ్మారి తర్వాత తన హయాంలో ఉద్యోగాలు బాగా పెరిగాయని అధ్యక్షుడు జో బిడెన్ తెలిపారు. అబార్షన్ల విషయంలో రో వర్సెస్ వేడ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మద్దతిస్తున్నామని పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యం గురించి వైద్యులు నిర్ణయాలు తీసుకోవాలని, రాజకీయ నాయకులు కాదని అభిప్రాయపడ్డారు.

'ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టా'
అమెరికా అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ వైదొలిగినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ప్రస్తుతం తాము దాన్ని గాడిలో పెట్టామని జో బైడెన్ డిబెట్​లో తెలిపారు. ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఇన్సులిన్ ధర 35 డాలర్లు ఉండగా తమ హయాంలో 15డాలర్లకు తగ్గించామని చెప్పుకొచ్చారు. కాగా బైడెన్​ను డొనాల్డ్ ట్రంప్ ఫిర్యాదుదారుడిగా అభివర్ణించారు. దేశం మొత్తం ఆయన వల్ల ఇబ్బంది పడుతోందని ఆరోపించారు. దేశ ప్రజలు, విదేశీ నాయకులు కూడా బైడెన్​ను గౌరవించరని విమర్శించారు.

అలా జరిగితే ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తా : ట్రంప్
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తారా? అన్న ప్రశ్నకు డొనాల్డ్ ట్రంప్ నేరుగా స్పందించలేదు. న్యాయపరంగా, చట్టపరంగా ఎన్నికలు జరిగితే అంగీకరిస్తానని పేర్కొన్నారు. ఈ ప్రశ్నకు బైడెన్ స్పందిస్తూ 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఓడిపోయారని అన్నారు. అనంతరం దేశవ్యాప్తంగా కోర్టుల్లో అప్పీలు చేసుకున్నారని, ఆ పిటిషన్లకు ఎలాంటి అర్హత లేదనే, ఏ న్యాయస్థానాలు గుర్తించలేదని ఎద్దేవా చేశారు. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మళ్లీ ఓడిపోయినా ఆయన దాన్ని అంగీకరిస్తారని తాను అనుకోవడం లేదని చెప్పారు.

వలసదారులపై బైడెన్ వ్యాఖ్యలు
వలసదారుల ఉద్యోగాలను బైడెన్ సర్కార్ తొలగిస్తోందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అమెరికా నిలవడంలో విదేశీయులు కీలక పాత్ర పోషించారని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు వలసదారులకు బైడెన్ గ్రహాంతరవాసులుగా అభివర్ణించారు.

'నా కంటే ట్రంప్ మూడేళ్లు చిన్న'
డిబేట్​లో మోడరేటర్లు ట్రంప్, బైడెన్​ను వారి వయసు గురించి ప్రశ్నంచారు. తన కంటే డొనాల్డ్ ట్రంప్(78) వయసులో 3ఏళ్లు మాత్రమే చిన్నవాడని బైడెన్ అన్నారు. మరోవైపు, బైడెన్‌ కొడుకు విషయంలో ట్రంప్‌ మాటల దాడి చేశారు. గన్స్‌, డ్రగ్స్‌ విషయంలో బైడెన్‌ తన కుమారుడిని కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. చివరికి అతడిని అరెస్ట్‌ కాకుండా కాపాడుకున్నారని ఆరోపించారు. ఆఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ దేశ చరిత్రలో చీకటి రోజుగా డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు.

డొనాల్డ్ ట్రంప్​నకు అమెరికా ప్రజాస్వామ్యంపై అవగాహన లేదని జో బైడెన్ విమర్శించారు. ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనికే తెలియట్లేదని ఆరోపించారు. నాటో నుంచి అమెరికా వైదొలగాలని ఆయన కోరుకుంటున్నారని అన్నారు. మరోవైపు, తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో విదేశాల్లో ఉన్న అల్ బాగ్దాదీ, సులేమానీ వంటి టెర్రరిస్టులను ఉగ్రవాదులను హతమార్చామని డొనాల్డ్​ ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఆపడంలో బైడెన్ ఫెయిల్ అయ్యారని ఆరోపించారు.

'నాటో' సెక్రెటరీ జనరల్‌గా మార్క్‌ రుట్టే- కీలక సమయంలో బాధ్యతలు

నిరసనలకు కారణమైన బిల్లుపై ప్రెసిడెంట్ కీలక నిర్ణయం- గ్రీన్ సిగ్నల్​కు నో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.