ETV Bharat / international

దేశం విడిచి పారిపోయిన అసద్!- రెబల్స్ చేతికి సిరియా - SYRIAN CIVIL WAR

రాజధాని నగరాన్ని ఆక్రమించిన రెబల్స్ - విమానంలో దేశాన్ని వీడిన అధ్యక్షుడు- ఇకపై సిరియా తిరుగుబాటుదారులదే?

Syrian Civil War
Syrian Civil War (Source : Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2024, 10:35 AM IST

Syrian Civil War :సిరియాలో అధ్యక్షుడు అసద్‌ శకం ముగిసినట్లే కనిపిస్తోంది. రాజధాని డెమాస్కస్‌ సైతం తిరుగుబాటుదారు వశమైంది. ఆదివారం తెల్లవారుజామున అసద్‌ దేశాన్ని విడిచి పారిపోయారు. మరోవైపు ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని మహమ్మద్ ఘాజీ జలాలీ పేర్కొన్నారు. దీంతో సిరియాలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని రెబల్స్‌ చెబుతున్నారు.

'అప్పగించేందుకు సిద్ధం'
కాగా, సిరియా సంక్షోభంపై ఆ దేశ ప్రధాని మహమ్మద్ ఘాజీ జలాలీ స్పందించారు. ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని వీడియో సందేశంలో చెప్పారు. ప్రతిపక్షాలకు విధులను బదిలీ చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. 'నేను నా ఇంట్లో ఉన్నాను. దేశం విడిచిపెట్టలేదు. సిరియాకు చెందినవాడిని నేను. అందుకే ఈ దేశం విడిచిపెట్టను. దయచేసి తిరుగుబాటుదారులు ప్రజా ఆస్తులను ధ్వంసం చేయొద్దు' అని ఘాజీ జలాలీ వ్యాఖ్యానించారు.

54 ఏళ్ల కుటుంబ పాలనకు తెర!
సిరియా రాజధాని డమాస్కస్​ను తిరుగుబాటుదారులు అధీనంలోకి తీసుకోవడం వల్ల అధ్యక్షుడు అసద్ తన కుటుంబంతో కలిసి దేశాన్ని విడిచివెళ్లారని వార్తలు వస్తున్నాయి. దీంతో అసద్ నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలినట్లు కనిపిస్తోంది. అసద్ నిష్క్రమణతో సిరియాలో 54 ఏళ్ల ఆయన కుటుంబ పాలనకు తెరపడినట్లవుతుంది.

తండ్రి మరణానంతరం
అసద్ తండ్రి హఫీజ్ 1970లో సిరియాలో ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసి అధికారంలోకి వచ్చారు. ఆయన మరణించేంతవరకు (2000) సిరియాను పాలించారు. ఆ తర్వాత అసద్ సిరియా పగ్గాలు అందుకున్నారు. తాజాగా తిరుగుబాటుదారులు దేశ రాజధానిని అధీనంలోకి తీసుకోవడం వల్ల సిరియాను వీడినట్లు తెలుస్తోంది.

కీలక వ్యాఖ్యలు
డమాస్కస్​లో కాల్పుల జరపొద్దని తిరుగుబాటు దళం హయాత్‌ తహరీర్‌ అల్‌- షామ్‌ (హెచ్‌టీఎస్‌) నేత అబూ మహమ్మద్ అల్ గోలానీ తెలిపారు. ప్రభుత్వ సంస్థలను తమకు అధికారికంగా అప్పగించేవరకు ప్రధానమంత్రి పర్యవేక్షణలోనే ఉంటాయని పేర్కొన్నారు. సిరియా ప్రధాన మంత్రి మహమ్మద్ ఘాజీ జలాలీ ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని అప్పగించేందుకు సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో తిరుగుబాటు నేత ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

'దేశం విముక్తి పొందింది'
అసద్ పాలన నుంచి డమాస్కస్ విముక్తి పొందిందని సిరియా ప్రతిపక్ష నాయకుడొకరు తెలిపారు. చీకటి కాలంపోయి సిరియాలో కొత్త శకం ప్రారంభమైందని పేర్కొన్నారు.

సంబరాలు చేసుకుంటున్న తిరుగుబాటుదారులు
మరోవైపు, డమాస్కస్​లో తిరుగుబాటుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. గాల్లోకి తుపాకులు కాల్చి వేడుకలు చేసుకున్నారు. సెంట్రల్ స్క్వేర్స్‌ వద్ద అసద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కారు హారన్లు మోగిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. అసద్ నేరస్థుడని, నిరంకుశత్వం కలిగి వ్యక్తి అని నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

డమాస్కస్‌ శివార్లలో తిరుగుబాటు దళాలు- సిరియా అధ్యక్షుడి కథ ముగిసినట్లేనా!

రెబల్స్‌పై సిరియా కౌంటర్ ఎటాక్‌ - అసద్‌కు అండగా నిలిచిన రష్యా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.