ETV Bharat / international

గాజాపై మరోసారి విరుచుకుపడ్డ ఇజ్రాయెల్​- 164మంది మృతి- నివాస భవనం, శరణార్థి శిబిరంపై దాడి

అట్టుడుకుతున్న పశ్చిమాసియా- గాజాపై ఇజ్రాయెల్ దాడిలో 164 మంది మృతి

Israel Gaza War
Israel Gaza War (AP (Associated Press))
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Israel Gaza War : ఇజ్రాయెల్‌- హమాస్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం ఇజ్రాయెల్‌ దళాలు గాజాపై మరోసారి విరుచుకుపడ్డాయి. ఉత్తర గాజాలోని బీట్‌ లాహియాలో ఓ నివాస భవనంపై ఇజ్రాయెల్‌ దాడి చేయడం వల్ల 55 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు పాలస్తీనా సివిల్ ఎమర్జెన్సీ సర్వీసెస్‌ వెల్లడించింది. శిథిలాల కింద చిక్కుకుని చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని పేర్కొంది.

ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే!
చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులేనని పాలస్తీనా న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. కాగా ఈ దాడిపై ఇంతవరకు ఇజ్రాయెల్ స్పందించలేదు. ఇజ్రాయెల్ దాడులతో సుమారు లక్షమంది పాలస్తీనియన్లు సరైన ఆహారం, వైద్య సదుపాయాలు లేక అలమటిస్తున్నారని పాలస్తీనియన్ సివిల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ పేర్కొంది. గాజాలోని ఆసుపత్రులో వైద్య సామగ్రి, మానవ వనరుల కొరత అధికంగా ఉందని అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది.

109 మంది మృతి, నలుగురు సైనికులు కూడా!
మరోవైపు, గాజా ఉత్తర ప్రాంతంలో శరణార్థులు ఆశ్రయం పొందుతున్న ఐదు అంతస్తుల భవనంపై మంగళవారం ఇజ్రాయెల్‌ దాడులు జరిపింది. ఈ ఘటనలో 109 మంది మరణించారు. ఉత్తర గాజాలో మంగళవారం నలుగురు ఇజ్రాయెలీ సైనికులు మరణించారు. ఈ దాడులపై కౌన్సిల్‌ ఆన్‌ అమెరికన్ ఇస్లామిక్‌ రిలేషన్స్‌ (సీఏఐఆర్‌) స్పందించింది. గాజాపై దాడులను విరమించి, సాధారణ పౌరుల ప్రాణాలు కాపాడాలని అమెరికాను కోరింది.

దాడులు మాత్రం ఆగడం లేదు!
ఎటువైపు నుంచి ముప్పు ముంచుకొస్తుందో తెలియక ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు గాజా పౌరులు. అమెరికా విదేశాంగశాఖ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్‌ చొరవతో ఇరువర్గాలు సంధి ఒప్పందానికి వస్తున్నాయి. గాజాలో కాల్పుల విరమణ ఒప్పంద చర్చల్లో తమ నిఘా అధిపతి పాల్గొంటున్నారని ఇటీవల ఇజ్రాయెల్‌ పేర్కొంది. ఒప్పందం కుదిరితే పోరాటం ఆపేస్తామని హమాస్‌ వర్గాలు సైతం వెల్లడించాయి. ఓ వైపు ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నా దాడులు మాత్రం తగ్గకపోవడం ఆందోళనకరంగా మారింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.