ETV Bharat / international

బాంబు పేలుళ్లు, కాల్పుల మధ్య పాక్​లో ఎన్నికలు​- నలుగురు మృతి- షరీఫ్​కు పీఠం!

Pakistan Elections 2024 : ఉగ్రవాదం, హింస, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్​లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తైంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య గురువారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు ఓటింగ్ జరిగింది. మరోవైపు, పోలింగ్ జరుగుతున్న సమయంలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో నలుగురు పోలీసులు చనిపోయారు.

pakistan elections 2024
pakistan elections 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2024, 5:00 PM IST

Pakistan Elections 2024 : బలమైన మిలిటరీ మద్దతు ఉన్న మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ రికార్డు స్థాయిలో నాలుగోసారి అధికారంలో వస్తారన్న ప్రచారం మధ్య పాకిస్థాన్​లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య గురువారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన పోలింగ్‌ సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు.

pakistan elections 2024
ఓటేసిన మహిళలు

పోస్టల్ బ్యాలెట్​ ద్వారా ఓటేసిన ఇమ్రాన్​
ప్రస్తుతం జైలులో ఉన్న పీటీఐ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారు. అయితే ఆయన సతీమణి బుస్రాబీబీ ఓటు వేయలేకపోయారు. ఆమెకు జైలుశిక్ష పడేనాటికి పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ ముగియటమే అందుకు కారణమని తెలుస్తోంది. పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ పార్టీ అధినేత నవాజ్‌ షరీఫ్‌ తన కుమార్తె మరియమ్ నవాజ్​తో కలిసి లాహోర్​లోని ఓ పోలింగ్ బూత్​లో ఓటు వేశారు.

pakistan elections 2024
మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్​, ఆయన కుమార్తె మరియమ్ నవాజ్

దేశంలో అనేక నియోజకవర్గాల్లో ఉదయం పోలింగ్ శాతం తక్కువే నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. క్రమక్రమంగా పుంజుకున్నట్లు చెప్పారు. చాలా చోట్ల పోలింగ్‌ సిబ్బంది విధులకు రాకపోవడం వల్ల కొందరు ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వెలుపలే వేచి ఉన్నట్లు పేర్కొన్నారు. పలు పోలింగ్‌ కేంద్రాల్లో బ్యాలెట్‌ పత్రాల కొరత వల్ల ఓటింగ్‌ ప్రక్రియలో జాప్యం జరిగినట్లు ఓటర్లు ఫిర్యాదు చేశారని వెల్లడించారు. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతుండడం వల్ల ఓటర్లు పోలింగ్​కు దూరంగా ఉన్నారన్నారు.

pakistan elections 2024
పాకిస్థాన్​లో​ పోలింగ్

మొబైల్ సేవలు బంద్!
బలూచిస్థాన్‌లో బుధవారం ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా మొబైల్‌ సేవలను తాత్కాలికంగా నిలిపేశారు. అయితే దేశంలోని పలువురు రాజకీయ నాయకులు తక్షణమే మొబైల్, ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పోలింగ్ రోజున మొబైల్ నెట్‌వర్క్‌లను నిలిపివేయడం అనుమానంగా ఉందని, రిగ్గింగ్ జరిగే అవకాశముందని కొందరు నాయకులు ఆరోపించారు.

pakistan elections 2024
క్యూలో పాక్ ప్రజలు

నలుగురు పోలీసులు మృతి
పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరుగుతుండగా సాయుధ దుండగులు చెలరేగిపోయారు. అఫ్గానిస్థాన్‌ సరిహద్దులోని ఖైబర్‌-పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఎన్నికల విధుల్లో ఉన్న భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. సాయుధులు పోలీసు వాహనంపై బాంబులతో దాడి చేసి, తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరపగా, ముష్కరులు అక్కడి నుంచి పరారయ్యారు. వారి కోసం పోలీసులు ఆ ప్రాంతంలో కార్డన్‌ సెర్చ్‌ చేపట్టారు.

pakistan elections 2024
ఓటు వేసిన పాక్ యువతి

'ఇమ్రాన్ ఖాన్​ ఓ సైకో​.. అతడికి భారత్ నచ్చితే అక్కడికే వెళ్లాలి'

ఎన్నికల ముందు నవాజ్​ షరీఫ్​కు భారీ ఊరట- అవినీతి కేసులో నిర్దోషిగా ప్రకటించిన కోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.