ETV Bharat / international

ఒకేచోట 1000 టన్నుల గోల్డ్- విలువ రూ.7లక్షల కోట్లు- చైనా ఇక అన్​స్టాపబుల్! - LARGEST GOLD MINE IN THE WORLD

ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వలు కనుగొన్న చైనా - దాదాపు రూ.7లక్షల కోట్లు విలువైన 1100 టన్నుల బంగారం ఉండే అవకాశం - ఇక చైనా దిశ తిరిగినట్టే!

Largest Gold Mine In The World
Largest Gold Mine In The World (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2024, 11:44 AM IST

Largest Gold Mine In The World : "ఒకే చోట 1100 టన్నుల బంగారం. రూ.7 లక్షల కోట్లు విలువ. దీంతో చైనా దిశ తిరిగిపోతుంది. నెమ్మదించిన చైనా ఆర్థిక పరిస్థితి ఇక పరుగులు పెడుతుంది!. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది."-- గత కొద్ది రోజులుగా సర్వత్రా నడుస్తున్న చర్చ ఇది. అసలు అంత మొత్తంలో బంగారం ఎక్కడ ఉంది? దానికీ చైనాకు సంబంధం ఏమిటి? చైనా ఆర్థిక వ్యవస్థకు అది ఎలా సహాయపడుతుంది? బంగారం ధరపై ఎందుకు ప్రభావం పడుతుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అంత బంగారం ఎక్కడ ఉంది?
ప్రపంచలోకెల్లా అతిపెద్ద గోల్డ్​ సరఫరాదారుగా ఉన్న చైనాకు మరో జాక్​పాట్​ తగిలినట్లైంది. ఇటీవల మధ్య చైనాలోని పింగ్​జియాంగ్​ ప్రాంతంలోని ఈశాన్య హునన్ కౌంటీ 'వాంగ్​జు గోల్డ్​ ఫీల్డ్'​లో- దాదాపు 2 కీలోమీటర్ల లోతులో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం నిల్వలను గుర్తించారు. అందులో దాదాపు 1000 మెట్రిక్ టన్నులు లభ్యం అవుతుందని, దాని విలువ 83 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.7 లక్షల కోట్లు) ఉంటుందని అంచనా. ఈ మేరకు జియాలాజికల్ బ్యూరో ఆఫ్ హునన్ ప్రావిన్స్​ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, 3 కిలోమీటర్ల లోపల అదనపు బంగారు నిల్వలు ఉండే అవకాశం ఉన్నట్లు త్రీడీ మోడలింగ్​ ద్వారా వెల్లడైనట్లు చెప్పింది.

ఇప్పటివరకు అతిపెద్ద బంగారు గని రికార్డు సౌత్​ ఆఫ్రికాలోని 'సౌత్​ డీప్​ మైన్'​ పేరు మీద ఉంది. ఈ గనిలో 930 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. ఇటీవల చైనాలో గుర్తించిన మైన్​ ఈ రికార్డును బద్దలుగొట్టింది.

డ్రిల్​ చేసిన అనేక రాళ్లను పరిశీలిస్తే బంగారం ఆనవాళ్లు కనిపించాయని హునన్ జియాలాజికల్ బ్యూరో అధికారి ఒకరు తెలిపారు. 2000 మీటర్ల రేంజ్​లో ఉన్న ప్రతి మెట్రిక్ టన్ను ధాతువులో దాదాపు 138 గ్రాములు (5 ఔన్సులు) బంగారం ఉంటుందని శాంపిళ్ల ద్వారా వెల్లడైందని చెప్పారు. ఈ నిల్వలను కనుగొనడం కోసం 3డీ జియోలాజికల్ మోడలింగ్ వంటి అధునాతన సాంకేతికత ఉపయోగించామని వెల్లడించారు.

చైనా ఆర్థిక వ్యవస్థ ఎలా ప్రభావితం అవుతుంది?

చైనా- ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం సరఫరాదారు. 2023లో ప్రపంచం మొత్తంలో దాదాపు 10శాతం ఈ దేశం నుంచే వచ్చింది. అయినా అది చైనా అవసరాలకు సరిపోవడం లేదు. దాదాపు మూడింట్లో రెండొంతులకు పైగా గోల్డ్​ను చైనా దిగుమతి చేసుకుంటోంది. అయితే ఇటీవల కొనుగొన్న బంగారం నిల్వలు చైనాకు ఆశలు చిగురించేలా చేశాయి. ఇక చిప్​ల తయారీలో కూడా కీలకంగా ఉపయోగించే ఈ లోహం సరిపడా ఉంటే చైనాకు ఇబ్బంది లేనట్లే అని చెప్పవచ్చు. అత్యాధునిక చిప్​లను తయారు చేయడానికి అమెరికాతో చైనా పోటీ పడుతుంది. అలాంటి సమయంలో ఈ గోల్డ్​ రిజర్వ్​లు మంచి సపోర్ట్​ ఇచ్చినట్లు అవుతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.