ETV Bharat / international

ట్రంప్​నకు మరో ఎదురుదెబ్బ- పరువు నష్టం కేసులో రూ.692కోట్లు ఫైన్​ - డొనాల్డ్​ ట్రంప్​కు జరిమానా

Donald Trump Fine : అమెరికా అధ్యక్ష పీఠంపై రెండోసారి కూర్చోవాలని కలలు కంటున్న అమె మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు కోర్టు కేసుల్లో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అమెరికన్‌ మాజీ కాలమిస్ట్‌ జీన్‌ కరోల్‌ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో న్యూయార్క్‌లోని మన్‌హటన్‌ ఫెడరల్‌ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ట్రంప్‌ ఆమెకు 83.3 మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.692 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది.

donald trump fine
donald trump fine
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 2:29 PM IST

Donald Trump Fine : పరువునష్టం కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌నకు మన్‌హటన్‌ ఫెడరల్‌ కోర్టు 83.3 మిలియన్‌ డాలర్ల ( భారత కరెన్సీ ప్రకారం దాదాపు 692 కోట్ల రూపాయలు) భారీ జరిమానా విధించింది. ట్రంప్‌ తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ అమెరికాకు చెందిన మాజీ కాలమిస్ట్‌ జీన్‌ కరోల్‌ దాఖలు చేసిన కేసులో న్యూయార్క్‌లోని మన్‌హటన్‌ ఫెడరల్‌ కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. నష్ట పరిహారం కింద దాదాపు 152 కోట్ల రూపాయలు, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా మరో 540 కోట్ల రూపాయలు చెల్లించాలని ట్రంప్‌ను ఆదేశించింది.

కాగా, ఫెడరల్ కోర్టు తీర్పు హాస్యాస్పదమన్న ట్రంప్ అమెరికా న్యాయవ్యవస్థ నియంత్రణ కోల్పోయిందని మండిపడ్డారు. బైడెన్‌ ప్రభుత్వం న్యాయవ్యవస్థను రాజకీయ ఆయుధంగా వాడుతోందని ఆరోపించారు. ఫెడరల్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేయనున్నట్లు ట్రంప్‌ పేర్కొన్నారు.

కేసు ఏంటంటే?
1996లో మన్‌హటన్‌లోని ఓ డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌లో కరోల్‌కు ట్రంప్‌ పరిచయమయ్యారు. అప్పుడు వేరే మహిళకు లోదుస్తులను బహుమతిగా ఇవ్వాలంటూ ట్రంప్‌ తనతో మాట కలిపారని ఆమె చెప్పారు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. దాంతో తాను షాక్‌కు గురయ్యానని అత్యాచార బాధితురాలిగా తనను తాను చూసుకోలేకపోవడం వల్లే అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. అయితే, ఈ ఘటన జరిగిన కొన్నేళ్ల తర్వాత ఓ పుస్తకంలో ఆమె వెల్లడించిన వివరాలను న్యూయార్క్‌ మ్యాగజైన్‌ 2019లో ప్రచురించింది. వాటిపై ట్రంప్‌ స్పందిస్తూ ఆమెనుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Donald Trump Republican Primary : రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న ప్రైమరీ ఎన్నికల్లో అమెరికా మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే అయోవాలో గెలిచిన ట్రంప్ ఇటీవల న్యూ హ్యాంప్​షైర్ ప్రైమరీలోనూ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ 52.5 శాతం ఓట్లతో విజయం సాధించారు. ట్రంప్ తర్వాత స్థానంలో ఉన్న నిక్కీ హేలీకి 46.6 శాతం ఓట్లు వచ్చాయి. ఊహించిన దానికంటే హేలీకి అధిక ఓట్లు రావడం విశేషం. అధ్యక్ష పదవికి నామినేషన్‌ కోసం పోటీపడిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల్లో ముగ్గురు ఇప్పటికే తప్పుకున్నారు. దీంతో ప్రస్తుతం పోటీ అంతా ట్రంప్‌, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ మధ్యే ఉంది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

పశ్చిమాసిలో టెన్షన్- మరోసారి రెచ్చిపోయిన హౌతీ రెబల్స్ - బ్రిటన్ నౌకపై దాడి

అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇజ్రాయెల్​కు ఊరట- కాల్పుల విరమణ ఆదేశం నిలిపివేసిన కోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.