ETV Bharat / international

వ్యాన్​, కంటైనర్​ ఢీ- 9మంది మృతి- హెలికాప్టర్​ కూలి మరో ముగ్గురు - us car crash today

America Car Crash Today : అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9మంది మరణించారు. ఈ ఘటన పశ్చిమ విస్కాన్సిన్​ జాతీయ రహదారి కూడలిలో శుక్రవారం జరిగింది. కూడలిలోకి ప్రవేశించిన వ్యాన్, ముందున్న కంటైనర్ ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది.

America Car Crash Today
America Car Crash Today
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 9, 2024, 9:48 AM IST

Updated : Mar 9, 2024, 10:21 AM IST

America Car Crash Today : అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9మంది మరణించారు. ఈ ఘటన పశ్చిమ విస్కాన్సిన్​ జాతీయ రహదారి కూడలిలో శుక్రవారం జరిగింది. కూడలిలోకి ప్రవేశించిన వ్యాన్, ముందున్న కంటైనర్​ను ఢీ కొట్టడం వల్ల 9మంది మృతిచెందారు. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు, ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు గవర్నర్ టోనీ ఎవర్స్​. అయితే రెండు వాహనాల్లో ఎంత మంది ప్రయాణిస్తున్నారనే విషయంపై స్పష్టత లేదు.

America Car Crash Today
ప్రమాద దృశ్యాలు
America Car Crash Today
ప్రమాద దృశ్యాలు

సైనిక హెలికాప్టర్​ కూలి ముగ్గురు మృతి
మరోవైపు అమెరికా- మెక్సికో సరిహద్దులో ఓ సైనిక హెలికాప్టర్​ కూలి ముగ్గురు మరణించారు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం టెక్సాస్​ సమీపంలోని రియె గ్రాండ్​ వ్యాలీలో జరిగింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్​లో ఓ మహిళ సహా నలుగురు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో ఇద్దరు సైనికులతో పాటు ఓ సరిహద్దు పెట్రోలింగ్​ ఏజెంట్​ మరణించినట్లు వెల్లడించారు. మరో సైనికుడు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. సాధారణ కార్యకలాపాల్లో భాగంగా హెలికాప్టర్​ను నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వివరించారు.

America Car Crash Today
సహాయక చర్యలు చేపట్టిన అధికారులు

జపాన్​లో సైనిక హెలికాఫ్టర్‌ కూలి 10మంది గల్లంతు
కొన్ని రోజుల క్రితం జపాన్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. దక్షిణ దీవుల్లో నిఘా ఆపరేషన్ కోసం వెళ్లిన సైనిక హెలికాఫ్టర్‌ సముద్రంలో కుప్పకూలింది. ఒకినావా ద్వీపం దగ్గర్లో ఉన్న మియాకోజిమా సమీపంలో హెలికాప్టర్ కూలినట్లు రక్షణశాఖ మంత్రి యసుకాజు హమదా స్పష్టం చేశారు. ఘటన సమయంలో హెలికాఫ్టర్‌లో 10 మంది సైనికులు ప్రయాణిస్తున్నారని చెప్పారు. టోక్యోకు నైరుతి దిశలో దాదాపు 1800 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రంలో హెలికాఫ్టర్‌ శకలాలను గుర్తించినట్లు జపాన్ రక్షణమంత్రి యసుకాజు హమదా తెలిపారు. గల్లంతయిన 10 మంది ఆర్మీ జవాన్లలో ఒకరు డివిజన్ కమాండరైన యుయిచి సకామోటో అని తెలిపారు. ప్రమాదానికి గురైన UH-60JA బ్లాక్​హాక్ హెలికాప్టర్ జపాన్‌లోని దక్షిణ దీవులలో చూస్తుండగానే అదృశ్యమైందని గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ అధిపతి యసునోరి మోరిషితా తెలిపారు. మియాకో ద్వీపంలోని సైనిక స్థావరం నుంచి బయలుదేరి గాల్లోకి ఎగిరిన పది నిమిషాలకే హెలికాప్టర్​ రాడార్‌తో సంబంధాలు కోల్పోయిందని అధికారులు తెలిపారు.

గాల్లో ఊడిన విమానం టైరు- గగనతలంలో ప్రయాణికులు టెన్షన్ టెన్షన్- ఆఖరికి!

మరోసారి రెచ్చిపోయిన హౌతీ రెబల్స్​- సరకు రవాణా నౌకపై క్షిపణి దాడులు- ముగ్గురు మృతి

Last Updated : Mar 9, 2024, 10:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.