ETV Bharat / health

ఇంట్రస్టింగ్ : మీరు నడిచే విధానమే మీ క్యారెక్టర్​ చెప్పేస్తుంది - మరి, మీరు ఏ టైపో చెక్ చేసుకోండి! - WALKING STYLE REFLECTS PERSONALITY - WALKING STYLE REFLECTS PERSONALITY

Walking Style Reflects Personality Traits : సాధారణంగా ఒకరి వ్యక్తిత్వాన్ని వారి బిహేవియర్​ను బట్టి అంచనా వేయవచ్చని చాలా మంది భావిస్తారు. నిజానికి ప్రవర్తన ద్వారానే క్యారెక్టర్​ డిసైడ్ చేస్తారు. కానీ.. ఒక వ్యక్తి నడిచే విధానం ద్వారా కూడా వారి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చట! మీకు తెలుసా?

Walking Style Reflects Personality Traits
Walking Style Reflects Personality Traits (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 12, 2024, 9:53 AM IST

Walking Style Can Reveal Your Personality : మీరు వాకింగ్ స్టైల్​ను బట్టి మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చంటున్నారు జర్మన్ సైకాలజిస్ట్ వెర్నర్ వోల్ఫ్. 1935లో నడక శైలి ద్వారా వ్యక్తిత్వం వ్యక్తీకరణపై జరిగిన ప్రారంభ అధ్యయనాలలో ఒక రీసెర్చ్ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు. దాని ఆధారంగా వెర్నర్ వోల్ఫ్ కూడా కొందరి వాకింగ్(Walking) స్టైల్​ను అబ్జర్వ్ చేసి.. ఏ వాకింగ్ స్టైల్ వారు ఎలాంటి పర్సనాలిటీ కలిగి ఉంటారో తెలియజేశారు. మరి, ఇంకెందుకు ఆలస్యం? మీ చుట్టుపక్కల వారు నడిచే విధానాన్ని పరిశీలించి, వారి క్యారెక్టర్​ డిసైడ్ చేయండి.

నెమ్మదిగా నడిచే వారి వ్యక్తిత్వ లక్షణాలు : మీ నడక నెమ్మదిగా ఉండడం, అంటే చిన్న చిన్న అడుగులు వేయడం, అలాగే మీరు నడిచేటప్పుడు మీ భుజాలు, తల నిటారుగా ఉంటే.. ఈ లక్షణాలన్నీ మీరు ప్రశాంతంగా, ఆకర్షణీయంగా, చమత్కారమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని చెబుతున్నారు సైకాలజిస్ట్ వోల్ఫ్. ఇలాంటి వాకింగ్ స్టైల్ ఉన్నవారు సామాజికంగా ఇతరులతో మంచి స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉంటారు. కానీ, ఇలాంటి వ్యక్తుల స్నేహితులుగా ఉండటం అంత ఈజీ కాదు. ఎందుకంటే.. వారు చాలా ఆలోచనాత్మకంగా ఉంటారని, నిర్ణయాలు తీసుకోవడానికి సమయం తీసుకుంటారట. అదేవిధంగా వీరు ఎప్పుడూ ఏదైనా కొత్త విషయాలను నేర్చుకోవాలనుకుంటారని చెబుతున్నారు. అలాగే కొంచెం విసుగు చెందుతారు, చేసిన తప్పులు పదే పదే పునరావృతం చేస్తే వీరికి నచ్చదు. ఇలాంటి వ్యక్తుల నమ్మకాన్ని కోల్పోయిన వారు.. తిరిగి పొందడం ఆ వ్యక్తికి అంత ఈజీ కాదని చెబుతున్నారు డాక్టర్ వోల్ఫ్.

అదే.. తల దించుకుని నెమ్మదిగా నడిచేవారు పైన విషయాలకు విరుద్ధమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారట. వీరు ఇంట్రోవర్ట్​లా, ఆత్రుతగా, బలహీనమైన మనస్సుతో, విచారంగా, భయంతో గత తప్పుల గురించి తరచుగా ఆలోచిస్తారు. సానుకూల దృక్పథాన్ని కొనసాగించడానికి కష్టపడతారు. అలాగే ఈ వ్యక్తులు ఆత్మవిశ్వాసం కోల్పోవచ్చని చెబుతున్నారు.

డైలీ వాకింగ్​ చేస్తున్నారా? ఈ టైమ్​లో చేస్తే ఎక్కువ బెనిఫిట్స్​!

వేగంగా నడిచే, రాపిడ్ వాకర్స్ వ్యక్తిత్వ లక్షణాలు : వేగంగా నడిచే వ్యక్తులు ఎక్స్​ట్రోవర్ట్​లా ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎల్లప్పుడూ రెడీగా ఉంటారు. ముఖ్యంగా మనస్సాక్షిగా ఉంటారు. అలాగే చుట్టూ ఉన్నవారితో సులభంగా కలిసిపోతారు. రోజూవారీ పనులను త్వరగా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇలాంటి నడక స్టైల్ ఉన్నవారు వీరి అభిప్రాయాన్ని తెలియజేయడానికి సిగ్గుపడరు లేదా సంకోచించరని చెబుతున్నారు సైకాలజిస్ట్ వోల్ఫ్.

అదేవిధంగా.. రాపిడ్ వాకర్స్ రిస్క్ తీసుకోవడానికి భయపడరట. తమ లక్ష్యాలను వేగంగా చేరుకోవాలని నిర్ణయించుకుంటారు. వీరు ధైర్యంగా, సూటిగా మాట్లాడే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఇలాంటి వ్యక్తులకు వేగాన్ని తోటివారు అందుకోలేరట. ఈ వ్యక్తుల విశ్వాసం, చురుకుదనం కారణంగా.. ప్రతికూల అంశాలు వీరి దరిచేరవట. 2006లో "Personality and Social Psychology Bulletin" అనే జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. వేగంగా నడిచే వ్యక్తులు ఎక్కువ ఆత్మవిశ్వాసం కలిగి ఉండి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉంటారట.

లాంగ్ స్ట్రైడ్స్(పెద్ద అడుగులు వేస్తూ వేగంగా నడిచేవారు) వ్యక్తిత్వ లక్షణాలు : ఆత్మవిశ్వాసంతో లాంగ్ స్ట్రైడ్స్ వేసే వ్యక్తులు వారి ముఖాల్లో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. మీ నడక శైలి మీ గమ్యాన్ని చేరుకోవాలనే మీ ఆసక్తిని ప్రతిబింబిస్తుంది. లాంగ్ స్ట్రైడర్స్ తరచుగా సమాజంలో గౌరవాన్ని కలిగి ఉంటారు. రోల్ మోడల్స్ అవుతారు. అభిరుచి.. మీ లక్ష్యాలను, సూత్రాలను నడిపిస్తుంది. త్వరగా కోపం వచ్చినప్పుడు, అన్యాయాన్ని గ్రహించినప్పుడు.. తమను తాము రక్షించుకోలేని వారి కోసం కూడా వీరు నిలబడతారు. అలాగే మల్టీ టాస్క్​లో మంచి ప్రావీణ్యం కలిగి ఉంటారు. చివరగా ఇలా నడిచే వారు తమ చుట్టూ ఉన్నవారి అంచనాలను అందుకోవడానికి, వారి ప్రమాణాలను అందుకోవడానికి ప్రయత్నిస్తారని చెబుతున్నారు సైకాలజిస్ట్ వెర్నర్ వోల్ఫ్.

NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.

మీరు వాకింగ్ పొద్దున చేస్తున్నారా? సాయంత్రమా? - ఎన్ని బెనిఫిట్స్ కోల్పోతున్నారో!​ - రీసెర్చ్ తేల్చిన నిజం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.