ETV Bharat / health

మహిళల్లో తరచూ వైట్ డిశ్చార్జ్​ - ప్రధాన కారణాలు ఇవే - ఇలా చేస్తే ప్రాబ్లమ్​ సాల్వ్​! - Vaginal Discharge Causes - VAGINAL DISCHARGE CAUSES

Vaginal Discharge Causes: వైట్ డిశ్చార్జ్.. ఈ సమస్య గురించి మహిళలు ఎక్కువగా బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ, దీని పట్ల నిర్లక్ష్యం వహిస్తే మరిన్ని సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. అసలు.. మహిళల్లో వయసుతో సంబంధం లేకుండా వైట్ డిశ్చార్జ్ సమస్య రావడానికి కారణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తగ్గిపోతుందో ఇప్పుడు చూద్దాం.

HOW TO STOP WHITE DISCHARGE
Vaginal Discharge Causes (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : Aug 22, 2024, 1:32 PM IST

Vaginal White Discharge Causes: వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళల్లో వైట్‌ డిశ్చార్జి సమస్య తలెత్తుతుంటుంది. సాధారణంగా మహిళల్లో అండం విడుదలయ్యే సమయంలో/నెలసరికి రెండు వారాల ముందు, కలయికలో పాల్గొన్నప్పుడు.. వైట్ డిశ్చార్జ్‌ అవడం సహజమే. అలా కాకుండా తరచుగా అవుతుంటే మాత్రం సంబంధిత వైద్యుల్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఇంతకీ, మహిళల్లో వైట్ డిశ్చార్జ్(White Discharge) ప్రాబ్లమ్ తలెత్తడానికి కారణాలేంటి? ఇది రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మహిళల్లో వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్ తల్లెత్తడానికి చాలా రకాల కారణాలు ఉంటాయంటున్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ వి. పద్మావతి. అందులో కొన్నింటిని పరిశీలిస్తే.. ముఖ్యంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏమైనా బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ ఉంటే వైట్‌ డిశ్చార్జ్‌ సమస్య తలెత్తే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంటున్నారు. అలాగే.. ఫాస్టింగ్‌ షుగర్‌ ఎక్కువున్నా కూడా ఈ సమస్య కనిపిస్తుందని చెబుతున్నారు. ప్రధానంగా ఊబకాయం ఉన్న వారికి బ్లడ్‌ షుగర్‌ కొంచెం ఎక్కువ కాబట్టి వీళ్లకి వైట్‌ డిశ్చార్జ్‌ సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందంటున్నారు.

ఇవే కాకుండా.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, కొన్ని సందర్భాల్లో పబ్లిక్‌ టాయిలెట్‌లో మూత్రవిసర్జన చేసినప్పుడు, పీరియడ్స్‌లో శుభ్రత పాటించనప్పుడు కూడా ఈ సమస్య వస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. శరీరంలో కార్బోహైడ్రేట్‌ల శాతం పెరిగినా వైట్ డిశ్చార్జ్ సమస్య తలెత్తే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు డాక్టర్ వి. పద్మావతి. కాబట్టి, వైట్ డిశ్చార్జ్ తరచుగా అవుతుంటే మాత్రం వెంటనే జాగ్రత్త పడాలంటున్నారు.

వైట్ డిశ్చార్జ్ రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి : వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలన్నా, ఒకవేళ ఇప్పుడు ఉన్నవారిలో ఈ సమస్య తగ్గాలన్నా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు గైనకాలజిస్ట్ డాక్టర్ వి. పద్మావతి. అవేంటంటే.. ఫాస్టింగ్‌ షుగర్‌ చెక్‌ చేసుకుని దాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి. ముఖ్యంగా.. చక్కెరతో తయారు చేసే స్వీట్లతోపాటు ఐస్‌క్రీమ్‌, చాక్లెట్స్‌, పండ్ల రసాలను పూర్తిగా తగ్గించుకోవాలి. అదే విధంగా మీ శరీరానికి అవసరమైన మేరకే ఆహారాన్ని తీసుకునేలా చూసుకోవాలి.

ప్రధానంగా మీ డైలీ డైట్​లో సోయా ఉత్పత్తులు, గుడ్డు(Egg), విటమిన్‌ సి, పీచు ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. వీటన్నింటితో పాటు ముఖ్యంగా లో దుస్తులను నెలకొక్కసారైనా వేడినీటిలో వేసి వాష్ చేసుకోవాలి. అలాగే వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. ద్రవ పదార్థాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇవి పాటించడం ద్వారా వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్ నుంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు.

ఇవీ చదవండి :

అలర్ట్ : పీరియడ్స్ టైమ్​లో ప్యాడ్స్ ఇలా వాడుతున్నారా? - అయితే, మీకు ఇన్ఫెక్షన్స్ గ్యారెంటీ!

పీరియడ్స్‌కు ముందు జననాంగంలో నొప్పా? కారణాలు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.