Top 9 herbs in Ayurvedic medicine : ఆయుర్వేదం ఎంతో ప్రాచీనమైంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేద వైద్యంలో పలు రకాల మూలికలను వాడుతుంటారు. అయితే, వేల కొద్ది మూలికలు ఉన్నా ఆయుర్వేదంలో తొలి 9స్థానాల్లో ఉన్న పదార్థాలు ఇవే.
పసుపు
ఆయుర్వేద వైద్యంలో పసుపు తొలి స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఆయుర్వేద వైద్యంలో "గోల్డెన్ స్పైస్"గా పసుపు ప్రసిద్ధి చెందింది. క్రియాశీల సమ్మేళనం, కర్కుమిన్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలకు పసుపు పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహకరిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తుంది.
అశ్వగంధ
ఒత్తిడిని తగ్గించడంలో, శక్తిని పెంచడంలో అశ్వగంధ మేలైన ఎంపిక. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడడంతో పాటు మెదడు పనితీరును మెరుగుపర్చుతుంది. శక్తి స్థాయిలను పెంచడం, ప్రశాంతమైన నిద్రను ప్రోత్సహించడంలో అశ్వగంధ అద్భత ఔషధంలా ఉపయోగపడుతుంది. వృద్ధాప్యంలో ఎదురయ్యే దుష్ప్రభావాలు సమర్థంగా ఎదుర్కోవడంతో పాటు శారీకర శక్తిని పెంపొందించడానికి అశ్వగంధ ఉపయోగిస్తారు.
నెయ్యి
పాల పదార్థాల్లో నెయ్యి ప్రత్యేకమైనది. ఆహార పదార్థాలకు సువాసన అందించడంతో పాటు రుచిని కలిగిస్తుంది. నెయ్యిలో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. నెయ్యి జీర్ణక్రియలో సహాయపడుతుంది. పోషకాలను బాగా గ్రహించడాన్ని ప్రోత్సహిస్తుంది. పేగుల ఆరోగ్యం దెబ్బతినకుడా కాపాడుతుంది. మెదడు పనితీరును మెరుగుపరిచే సామర్థ్యానికి కూడానెయ్యి ప్రసిద్ధి చెందింది.
సంపూర్ణ ఆరోగ్యానికి ఇదొక్కటి చాలు- అత్యంత చవకైన దివ్యౌషధం - Perfect medicine for health
ఉసిరి
ఆమ్లాలోని యాంటీఆక్సిడెంట్ రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతాయి. ఆమ్లా కాలేయ పనితీరుకు సహకరిస్తుంది. జుట్టు ఆరోగ్యానికి, సి విటమిన్ దృష్ట్యా ఉసిరికాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల గణనీయమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు.
తేనె
సహజసిద్ధంగా లభించే తేనె సహజ స్వీటెనర్‌గా, ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తుంది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. తేనె యాంటీమైక్రోబయల్ లక్షణాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇది దగ్గు జలుబు రుగ్మతల బారి నుంచి కాపాడడంలో తేనె అద్భుతమైన ఔషధం అంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
నేరేడు పండు
నేరేడు పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చాలా బాగా పనిచేస్తాయి. మధుమేహ రోగులకు ఇది ప్రకృతి ప్రసాదించిన వరం. నేరేడు పండ్లు జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నలుపు రంగు కలిగిన ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి గుండె ఆరోగ్యానికి తోడ్పడడంతో పాటు రక్తస్రావ నివారిణ లక్షణాలను కలిగి ఉంటాయి. వివిధ చర్మ వ్యాధులకు చికిత్స చేయడంలో, నోటి సంరక్షణలో నేరేడు పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి.
తులసి
మానసిక ఒత్తిడిని అధిగమించడంలో తులసికి మరేదీ సాటిలేదు. శ్వాసకోశ ఆరోగ్యానికి ఉపకరించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి. ఇది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శక్తివంతమైన హెర్బ్‌గా ఉపయోగపడుతుంది.
తిప్పతీగ
రోడ్ల పక్కన తుప్పల్లో, చెట్లపై అల్లకుపోయే తిప్పతీగను గిలోయ్ అంటారు. తిప్పతీగ రక్తాన్ని శుద్ధి చేయడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సూపర్ మెడిసిన్. దీర్ఘకాలిక జ్వరాలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఒత్తిడి, ఆందోళనను అధిగమించడంలో ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ అద్భుత మూలికను ఆయుర్వేదంలో అమృతవల్లి అని కూడా అంటారు. వివిధ వ్యాధుల చికిత్సలో ఈ అమృత వల్లి ఆకులు, కాడను ఉపయోగిస్తారు.
అల్లం
వికారం తగ్గించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి అల్లం చక్కని ఔషధం. కండరాల నొప్పి, ఇతర నొప్పులకు ఇది నివారిణి. అల్లం కూడా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జలుబు, జ్వరాల నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
సంపూర్ణ ఆరోగ్యానికి ఇదొక్కటి చాలు- అత్యంత చవకైన దివ్యౌషధం - Perfect medicine for health
ఈ మూడిట్లో మీ శరీరంలో ఏ దోషం ఉంది? - ఇది తెలియకనే సకల రోగాలు!