Tips To Remove Stains From Clothes : మనం ఎంతో ఇష్టంగా ధరించిన దుస్తులపై కొన్నిసార్లు మరకలు పడుతుంటాయి. అది టీ, ఆయిల్, పండ్ల రసాలు, కూరలు ఇలా ఏవైనా కావొచ్చు. ఇక ఈ మరకలు తొలగించాలంటే తలప్రాణం తోకకు వస్తుంది. అలా అని వాటిని పక్కకూ పెట్టలేం. దీంతో సబ్బు, సర్ఫ్, షాంపూ అంటూ రకరకాలుగా ప్రయత్నిస్తారు. అయితే ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మరక మాత్రం పోదు. కొన్నిసార్లు మరక పోవడం అటుంచితే.. రుద్ది రుద్ది దుస్తుల రంగు పోవడం, చినగడం జరుగుతుంటుంది. ఈ క్రమంలోనే ఈ టిప్స్ పాటించడం వల్ల ఈజీగా మొండి మరకల్ని తొలగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..
నూనె మరకలు : దుస్తులపై లిప్‌స్టిక్, నూనె మరకలు పడితే ఆ ప్రదేశంలో కొద్దిగా గ్లిజరిన్ రాసి ఒక అరగంట తర్వాత వాష్ చేయాలి అని నిపుణులు అంటున్నారు. ఇలా చేస్తే ఈజీగా మరకలను మాయం చేయొచ్చంటున్నారు.
నిమ్మకాయతో : మరకలున్న ప్లేస్‌లో నిమ్మకాయ ముక్క రుద్దడం వల్ల కూడా త్వరగా మరకలను తొలగించుకోవచ్చని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల దుస్తుల రంగు కూడా పాడవకుండా ఉంటుందంటున్నారు.
హైడ్రోజన్ పెరాక్సైడ్ : కొన్నిసార్లు బట్టలపై రక్తం లేదా తుప్పు మరకలు పడితే.. ఈ మరకలను తొలగించడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. మరకలున్న చోట కొద్దిగా డిటర్జెంట్ లిక్విడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి పోయాలి. తర్వాత బట్టలను ఉతికితే మరకలు తొలగిపోతాయంటున్నారు.
ఉప్పు : దుస్తులపై తుప్పు మరకలుంటే.. వాటిని ఉప్పు నీటిలో నానబెట్టాలి. తర్వాత మరకలున్న చోట రెండు టేబుల్ స్పూన్‌ల నిమ్మరసం వేసి, సబ్బుతో బాగా వాష్ చేయాలి. ఇలా చేస్తే మరకలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇంటి ఫ్లోర్‌పై జిడ్డు మరకలు వదలట్లేదా? - ఈ టిప్స్ పాటిస్తే ఇట్టే తొలగిపోతాయి!
బేకింగ్ సోడాతో : దుస్తులపై పడిన టీ మరకల్ని తొలగించుకునేందుకు చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అయితే, బేకింగ్ సోడాను ఉపయోగించి ఈ మరకలను ఈజీగా మాయం చేసుకోవచ్చంటున్నారు. అది ఎలా అంటే.. టీ మరకలు పడిన చోట చెంచా బేకింగ్ సోడా వేసి నెమ్మదిగా రుద్దాలి. కొద్దిసేపటి తర్వాత దుస్తుల్ని శుభ్రం చేస్తే సరిపోతుంది.
2011లో "జర్నల్ ఆఫ్ క్లీనింగ్ సైన్స్"లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. టీ మరకలను తొలగించడానికి బేకింగ్ సోడా సమర్థవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో లాండ్రీ టెక్నాలజీ విభాగానికి చెందిన 'డాక్టర్ మార్గరెట్ జాన్సన్' పాల్గొన్నారు. టీ మరకలను తొలగించడానికి బేకింగ్ సోడా బాగా పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
టూత్‌పేస్ట్ : బట్టల రంగు వెలిసిపోకుండా టీ మరకలు సులభంగా తొలగిపోవాలంటే మనం బ్రష్ చేసుకోవడానికి ఉపయోగించే టూత్‌పేస్ట్ ఉపయోగించవచ్చని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం మరక పడిన ప్రదేశంలో టూత్‌పేస్ట్ పూసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత శుభ్రమైన వాటర్‌తో ఆ వస్త్రాన్ని ఉతికేస్తే సరిపోతుందంటున్నారు.
NOTE : పైన తెలిపిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.
ఎంత శుభ్రం చేసినా పాత్రల్లో పసుపు మరకలు పోవడం లేదా ? ఇలా చేస్తే చిటికెలో సాల్వ్!
బాత్‌రూమ్‌లో మరకలు ఎన్నిసార్లు కడిగినా పోవట్లేదా? - ఈ టిప్స్ పాటిస్తే సరి!