ETV Bharat / health

తల స్నానం చేసిన మరుసటి రోజుకే - జుట్టు గడ్డిలా తయారవుతోందా? - Natural Remedies To Stop Hair Fall

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 14, 2024, 4:35 PM IST

Tips To Control Hair Fall : చుండ్రు సమస్య జుట్టు ఆరోగ్యాన్ని, అందాన్ని పాడుచేస్తుంది. నిత్యం తల స్నానం చేసినప్పటికీ రెండో రోజుకే జుట్టు గడ్డిలా తయారవుతుంది. మీరు కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారా? అయితే.. మీకు చక్కటి పరిష్కార మార్గాన్ని నిపుణులు సూచిస్తున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.

Control Hair Fall
Tips To Control Hair Fall (ETV Bharat)

Tips To Control Dry Skin And Dandruff : కొంతమంది నిత్యం చుండ్రు సమస్యతో బాధపడుతుంటారు. తల స్నానం చేస్తున్నా కూడా ఇబ్బంది తొలగిపోదు. దీనివల్ల తలస్నానం చేసిన మరుసటి రోజుకే జుట్టు గడ్డిలా మారుతుంది. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో తెలియక అవస్థలు పడుతుంటారు. మరి.. ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో..? నిపుణులు ఏం చెబుతున్నారో..? ఇప్పుడు చూద్దాం.

జుట్టు గడ్డిలా తయారవడానికి మాడు మీద ఎక్కువగా నూనెలు విడుదల కాకపోవడం ఒక కారణమని.. ఇది పొడి చర్మం లాంటి ఒక రకమైన సమస్యని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కాస్మటాలజిస్ట్‌ 'డాక్టర్‌ శైలజ సూరపనేని' చెబుతున్నారు. సాధారణంగా ఈ సమస్య వయసు పెరిగేకొద్దీ కనిపిస్తుందని అంటున్నారు. నలభై ఏళ్ల పైబడిన వారిలో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు.

కారణాలు ఇవే!
అతిగా తలస్నానం చేయడం, రసాయనాలతో కూడిన షాంపూలు, ఆల్కహాల్‌ ఉన్న స్టైలింగ్‌ ఉత్పత్తులు, హీట్‌ స్టైలింగ్‌ పరికరాలను వాడటం, డ్రైయ్యర్‌తో జుట్టును ఆరబెట్టడం, ఎండలో బాగా తిరగడం వంటి కారణాలతో తలపైన నూనెలు సరిగా విడుదల కావని చెబుతున్నారు. కొన్నిసార్లు ఈ సమస్య వంశ పారంపర్యంగా కూడా జుట్టు సమస్యలు వస్తాయని అంటున్నారు.

జుట్టు ఎక్కువగా రాలుతోందా ? - రోజూ ఈ జ్యూస్‌లు తాగారంటే ప్రాబ్లమ్​ సాల్వ్​!

జుట్టు ఆరోగ్యం కోసం ఇలా చేయండి!
జుట్టు గడ్డిలా మారుతున్నవారు.. కురులు ఆరోగ్యంగా ఉండటానికి వారానికి రెండు సార్లకు మించి తలస్నానం చేయకూడదని సూచిస్తున్నారు. అలాగే తలస్నానం చేసే ముందు తప్పకుండా జొజొబా, ఆలివ్, కొబ్బరినూనెలతో మర్దన చేసుకోవాలి. తర్వాత కండిషనింగ్‌ చేసుకోవాలి. అలాగే కెమికల్స్‌, ఆల్కహాల్‌ లేని హెయిర్‌ ప్రాడక్ట్స్ ఉపయోగించాలి. హెన్నా, కలరింగ్‌ ఉత్పత్తులనూ ఎక్కువగా వాడొద్దు. అలాగే వారానికోసారి హెయిర్‌ మాస్క్‌ని వేసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.

మాస్క్ ఇలా తయారు చేసుకోండి..

హెయిర్‌ మాస్క్‌ని సహజంగా తయారు చేసుకుంటే మంచిది. ఇందుకోసం ఒక కప్పులో కొద్దిగా ఆలివ్‌నూనె, తేనె కలపండి. దీనిని జుట్టుకు అప్లై చేసుకోండి. ఒక అరగంట తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టుకు కుదుళ్ల నుంచి పోషణ అందుతుంది. పీహెచ్‌ 5- 5.5 ఉన్న, సల్ఫేట్స్, పారాబెన్స్, ఫార్మాల్డిహైడ్, హెక్సా క్లోరోఫిన్‌ వంటివి లేని షాంపూలే ఉపయోగించండి. కీటోకెనజాల్, జింక్‌ పైరథాన్, సిలీనియం డై సల్ఫైడ్, టీట్రీ ఆయిల్‌ ఉన్న ఉత్పత్తులను వాడడం వల్ల చుండ్రు పోవడమే కాకుండా, కేశాలు మెరుస్తాయని డాక్టర్ చెబుతున్నారు.

ఈ ఫుడ్‌ బెస్ట్‌!
హెయిర్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అవకాడో, చేపలు, గుడ్లు, పాలు, పాలకూర, జామ, సిట్రస్‌ పండ్లు, బాదం వంటి వాటిని డైట్‌లో భాగం చేసుకోండి. వీలైతే వంటల్లో ఆలివ్‌ నూనె ఉపయోగించాలని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

ఊహాతీతం : ఒక సిగరెట్​ తాగడం పూర్తయ్యేలోపు - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

ఉదయం వాష్​ రూమ్​లో అవస్థలు పడుతున్నారా? - రాత్రివేళ ఈ వాటర్ తాగితే ఆల్​ క్లియర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.