ETV Bharat / health

గోరింటాకు ఎర్రగా పండటం లేదా? - ఈ నేచురల్​ టిప్స్​ పాటిస్తే మందారం లాంటి ఎరుపు! పైగా ఈ బెనిఫిట్స్ గ్యారెంటీ!​ - Tips For Dark Mehendi - TIPS FOR DARK MEHENDI

Dark Mehndi Tips : ఆషాఢ మాసం వచ్చిందంటే.. మహిళల చేతుల్లో గోరింట పండాల్సిందే. అయితే, కొన్నిసార్లు గోరింటాకు ఎర్రగా పండదు. దీనివల్ల చేతులు అందంగా కనిపించవు. అయితే, గోరింటాకు ఎర్రగా పండడానికి కొన్ని టిప్స్​ పాటించాలని నిపుణులు అంటున్నారు. అవేంటంటే..

Dark Mehndi
Dark Mehndi Tips (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 16, 2024, 3:13 PM IST

Tips For Dark Mehendi : చాలా మంది అమ్మాయిలు, మహిళలు ఆషాఢ మాసంలో తప్పకుండా చేతులకు గోరింటాకు పెట్టుకుంటుంటారు. నలుగురైదుగురు కలిసి గోరింటాకు తెచ్చి రుబ్బుకుని పెట్టుకుంటుంటారు. ఒకప్పుడు గోరింటాకు ఒకే రకంగా పెట్టుకునేవారు. కానీ నేటి రోజుల్లో మైదాకును నచ్చిన డిజైన్లలో పెట్టుకుంటున్నారు. ఇక మరుసటి రోజు ఎర్రగా పండిన చేతులను చూసుకుని మురిసిపోతుంటారు. అయితే కొన్నిసార్లు చేతులు ఎర్రగా పండితే.. కొన్ని సార్లు బాగా పండదు. దీంతో డీలా పడుతుంటారు. అయితే ఇకపై అలా బాధపడాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే గోరింటాకు పెట్టుకునేటప్పుడు ఈ టిప్స్​ పాటిస్తే చేతులు ఎర్రగా ముద్దమందారంలా పండుతాయని చెబుతున్నారు. ఇంతకీ ఆ టిప్స్​ ఏంటంటే..

గోరింటాకు ఎర్రగా పండటానికి టిప్స్​:

  • గోరింటాకులను రుబ్బుకునేటప్పుడు ఆ మిశ్రమంలో కొంచెం చక్కెర, రెండు లవంగాలు వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. అలాగే ఈ మిశ్రమానికి నాలుగైదు చుక్కల యూకలిప్టస్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలిపి పక్కన పెట్టాలి. ఒక అరగంట తర్వాత గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది.
  • ఆరిపోతున్న గోరింటాకుపై అప్పుడప్పుడూ బెల్లం మరిగించిన నీటిని వేయాలి. ఇలా చేస్తే చేతులు ఎర్రగా పండుతాయి.
  • గోరింటాకు ఎర్రగా పండాలంటే.. లవంగాల పొగతో ఆవిరి పట్టొచ్చు.
  • గోరింటాకు పెట్టుకునే ముందు చేతులను బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత చేతులను పొడి వస్త్రంతో తుడుచుకుని గోరింటాకు పెట్టుకోవాలి. గోరింటాకు పెట్టుకున్న 12 గంటల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే.. ఎర్రగా పడుతుంది. త్వరగా కడిగితే సరిగా పండదని గుర్తుంచుకోండి.
  • అయితే, కొంత మంది ఎండిన గోరింటాకును తీసేసి సబ్బుతో చేతులను కడుక్కుంటారు. కానీ, ఇలా చేయకూడదు. ఒక చేయిని మరొక చేయితో రుద్దుతూ ఎండిన గోరింటాకుని తీసేయాలి. ఆ తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి.
  • చేతులపైన గోరింటాకు ఆరిపోయిన తర్వాత చక్కెర నిమ్మరసం కలిపిన మిశ్రమంలో ముంచిన దూదితో చేతిపైన అద్దాలి. ఇలా చేస్తే చేతులు ఎర్రగా పండుతాయి.
  • అలాగే పెనంపై కొద్దిగా ఇంగువ వేడి చేసి, ఆ పొగను చేతులకు తగలనిచ్చినా కూడా గోరింటాకు ఎర్రగా పండుతుంది.
  • గోరింటాకు పూర్తిగా తీసేసిన తర్వాత లవంగ నూనె లేదా కొబ్బరినూనె చేతికి రాసుకోవడం వల్ల చక్కగా పండుతుంది. పైగా నల్లగా మారదు.

గోరింటాకుతో అరచేతుల్లో ఆరోగ్యం పండుతుంది!

గోరింటాకు పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు : గోరింటాకు పెట్టుకోవడం వల్ల చేతులు అందంగా కనిపించడంతో పాటు, కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

  • చర్మంపై వచ్చే కొన్ని అలర్జీలు, ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి గోరింటాకు ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.
  • మైదాకు చేతులకు పెట్టుకోవడం వల్ల.. శరీరంలో అధిక ఉష్ణోగ్రత తగ్గుతుందని అంటున్నారు. 2017లో 'Journal of Dermatology'లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. గోరింటాకు ప్యాక్‌లు చేతులను శరీరంలో అధిక వేడిని తగ్గించి.. చల్లబరచడం, చర్మం చికాకును తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని షాంఘై డెర్మటాలజీ హాస్పిటల్​లో చర్మవ్యాధి నిపుణుడు 'డాక్టర్ యాంగ్ జిన్' పాల్గొన్నారు.
  • ఏవైనా గాయాలైనప్పుడు, ఆటలమ్మ వ్యాధి సోకినప్పుడు శరీరంపై మచ్చలు ఏర్పడతాయి. అయితే, వీటిని పోగొట్టడానికి గోరింటాకు మంచి ఔషధంగా పని చేస్తుంది.
  • శరీరంలో ఏర్పడే వేడి గడ్డలను తగ్గించడానికి గోరింటాకు తోడ్పడుతుందని నిపుణులంటున్నారు.
  • తలనొప్పి, కడుపునొప్పి, కాలిన గాయాలు.. ఇలా ఏ సమస్య అయినా సరే.. ఆ ప్రదేశంలో గోరింటాకు పేస్ట్‌ను రాస్తే.. క్రమక్రమంగా నొప్పి క్షీణించి సమస్య తగ్గిపోయేదని అంటున్నారు.

ఇవి కూడా చదవండి!

ఆషాఢం వచ్చింది - మగువల చేతిల్లో గోరింటాకు పండింది - Gorintaku festival Celebration 2024

ఆనందోత్సాహాల మధ్య గోరింటాకు సంబురాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.