HOW TO DRINK WATER : ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోజంతా తగినంత నీరు తాగడం తప్పనిసరి. శరీరానికి పోషకాహారం ఎంత అవసరమో పరిశుభ్రమైన నీళ్లు కూడా అంతే ముఖ్యం. మానవ దేహంలో అత్యధిక శాతం నీరు ఉంటుంది. రోజుకు దాదాపు 4 లీటర్ల నీటిని తీసుకోవాలి. శరీరంలో 1 శాతం నీరు లోటుగా ఉన్నా.. దాహం వేస్తుంది. లోటు 5 శాతానికి పెరిగితే రక్త నాళాలు సాగడం ప్రారంభించి శరీరంలో సత్తువ తగ్గిపోతుంది. ఈ లోటు 10 శాతానికి మించినట్లయితే కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. అస్పష్టంగా కనిపించడంతో పాటు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయే అవకాశాలుంటాయి. నీటి కొరత 20 శాతానికి చేరుకుంటే మృత్యువు ముంచుకొచ్చినట్టే. అందుకే దాహం తీవ్రత పెరగకుండా చూసుకోవాల్సి అవసరం ఉంది.
వయాగ్రా వాడితే బాడీలో ఏం జరుగుతుంది?- ఎవరైనా వేసుకోవచ్చా? - viagra tablet side effects
రోజూ 2-4లీటర్ల నీరు అవసరమని వైద్యులు చెప్తున్న నేపథ్యంలో చాలా మంది లీటర్ల కొద్ది నీళ్లు తాగేస్తుంటారు. కానీ, ఆహారాన్ని నమిలి తింటున్నట్లు నీళ్లను కూడా ఓ పద్ధతిలో తాగాలి. నిలబడి తాగడం మంచిది కాదని, అప్పటికప్పుడు ఎలాంటి ప్రమాదం లేకపోయినా దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదే పనిగా నిలబడి తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
నిలబడి నీటిని తాగడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోగా, ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయే అవకాశం ఉంది. కడుపులో ఒత్తిడి పడి హెర్నియాకు దారి తీసే ప్రమాదాలున్నాయి. వ్యవస్థపై ప్రత్యక్షంగా తీవ్ర ప్రభావాన్ని చూపించడంతో పాటు మోకాళ్లు, కీళ్ల పై ఒత్తిడి పెరుగుతుంది.
నిలబడి తాగుతున్నప్పుడు ఆ నీటిని సరిగ్గా ఫిల్టర్ చేసేందుకు కిడ్నీలకు అవకాశం ఉండదు. నిలబడి నీటిని తాగడం వల్ల కిడ్నీ, బ్లాడర్లో వ్యర్థాలు పేరుకుపోయి యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్స్ కు దారితీస్తాయి. ఒక్కోసారి కిడ్నీలు పర్మినెంట్ గా డామేజ్ ప్రమాదం ఉంది.
కూర్చుని నీరు తాగితే న్యూట్రియెంట్స్ ని శరీరం అబ్జార్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నిలబడి హడావుడిగా నీళ్లు తాగడం వల్ల గౌట్ (కీళ్ల నొప్పులు) వచ్చే ప్రమాదం ఉంది.
నీరు నేరుగా అన్నవాహిక ద్వారా కడుపులోకి వెళ్లి అక్కడ ఒత్తిడి పెరిగి జీర్ణ క్రియలో సమస్యలు వస్తాయి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
బరువు తగ్గడం లేదని బాధపడుతున్నారా?- తింటూనే బరువు తగ్గొచ్చని తెలుసా! - diet plan for weight loss