Summer Hydration Tips : వేసవి కాలంలో ఓ వైపు ఎండవేడి, వడగాలులు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. మరొకవైపు చెమట చిరాకు పెడుతుంది. అయితే.. ఈ సమస్య కొంత మందిలో ఎక్కువగా ఉంటుంది. ఇలా అధికంగా చెమట రావడానికి హార్మోన్ల స్థాయుల్లో మార్పులు, అధిక బరువు, మధుమేహం, ఆందోళన, కోపం, శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలు, మెనోపాజ్.. వంటి వివిధ కారణాలుంటాయట. అయితే, చెమట వల్ల శరీరంలోని మలినాలు, వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోవడం మంచిదేనని నిపుణులంటున్నారు. కానీ, బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి కొన్ని చిట్కాలను పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
చంకల్లో చెమట తగ్గడానికి :
కొంతమందికి చంకల్లో ఎక్కువగా చెమట పట్టడంతో ఇబ్బందిగా ఉంటుంది. అయితే, ఈ సమస్యకు ఒక చిన్న చిట్కాతో చెక్ పెట్టవచ్చని నిపుణులంటున్నారు. అదేంటంటే.. కొద్దిగా కార్న్‌స్టార్చ్‌లో కాస్త బేకింగ్ సోడా వేసి సరిపడినంత ఎసెన్షియల్ ఆయిల్ కలిపి పేస్ట్‌లాగా రెడీ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను చంకల్లో అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా తరచూ చేయడం వల్ల కొద్ది రోజుల్లో చెమట సమస్య నుంచి విముక్తి పొందచ్చని నిపుణులంటున్నారు.
ఈ జ్యూస్‌లలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి!
ఎక్కువగా చెమట సమస్యతో బాధపడేవారు బాడీ డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండటానికి.. ఎన్నో ఔషధ గుణాలున్న గోధుమగడ్డి జ్యూసు, టొమాటో రసం తాగాలి. ఇందులో సి, బి6, బి12 వంటి విటమిన్లు, ఫోలికామ్లం, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ జ్యూస్‌లు మనకు వేసవిలో ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
వీటితో ఎంతో లాభం :
సమ్మర్‌లో డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే.. నీళ్లు ఎక్కువగా తాగడం తప్పనిసరి. అలాగే వాటర్‌మెలన్ కూడా తరచూగా తీసుకోవాలని డాక్టర్ శుభాంగి తమ్మళ్వార్ (న్యూట్రిషనిస్ట్) సూచిస్తున్నారు. దీనివల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఎండాకాలంలో పాలకూర, క్యాలీఫ్లవర్ వంటి కూరగాయలు తీసుకుంటే మంచిది. వీటివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
వీటికి దూరంగా ఉండండి :
- చెమట ఎక్కువగా పట్టేవారు పచ్చిమిర్చి, మసాలాలు ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.
- ఇవి శరీరంలో అధిక వేడి పుట్టించి ఎక్కువ చెమట విడుదలయ్యేలా చేస్తాయి.
- అలాగే కాఫీని తక్కువగా తీసుకోవాలి.
- ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా శరీరంలో చెమట ఎక్కువగా వచ్చేలా చేస్తాయి. కాబట్టి, స్ట్రెస్‌కు గురికాకుండా చూసుకోండి.
- ఈ టిప్స్ అన్ని పాటించినా అధిక చెమట సమస్య తగ్గట్లేదనుకుంటే ఓసారి డాక్టర్‌ని సంప్రదించండి. ఇందుకు గల కారణాలేంటో తెలుసుకొని, సరైన చికిత్స తీసుకోవడం మంచిది.
రాత్రిపూట నిద్ర పట్టట్లేదా? పడుకునే ఈ నీటితో స్నానం చేస్తే అంతా సెట్! - Warm Water Shower For Sleep