ETV Bharat / health

హెచ్చరిక : మహిళల గర్భాశయంపై మొబైల్​ ఎఫెక్ట్ - ఏం జరుగుతుందో తెలుసా? - Side Effects of Mobile Phones - SIDE EFFECTS OF MOBILE PHONES

Side Effects of Mobile Phones : నేటి రోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ స్మార్ట్​ఫోన్​లను వాడుతున్నారు. నిజానికి ఫోన్​ అతిగా వాడడం ఆరోగ్యానికి ఎంతో హానికరం! అయితే, అది అన్ని వయసుల వారిపై ఎఫెక్ట్ చూపినప్పటికీ మహిళలకు మరింత ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

Side Effects of Mobile Phones on Women Health
Side Effects of Mobile Phones (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 25, 2024, 10:52 AM IST

Side Effects of Mobile Phones on Women Health : ఈ నేటి టెక్నాలజీ యుగంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్​ఫోన్‌ను.. తమ ఆత్మీయ తోడుగా మార్చుకున్నారు! తిండీ తిప్పలు మానేసి అదే పనిగా గంటలు గంటలు మొబైల్​ఫోన్​తోనే కాలం గడుపుతున్నారు. అన్ని వయసుల వారూ ఇలా తయారయ్యారు. అయితే.. దీని ప్రభావం మహిళల్లో ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సేపు ఒకే పొజిషన్​లో కూర్చొని మొబైల్ యూజ్ చేయడం వల్ల, వారిలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇంతకీ.. మహిళలు అధికంగా ఫోన్(Mobile) వాడడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

స్మార్ట్‌ఫోన్లు బ్లూ లైట్​ రిలీజ్​ చేస్తాయి. ఇది మన సిర్కాడియన్ రిథమ్‌కు అంతరాయం కలిగించడంతో పాటు.. మెలటోనిన్ ఉత్పత్తిని అణచివేస్తుంది. ఇది నిద్రను నియంత్రించే హార్మోన్ కావడం వల్ల.. మహిళల్లో నిద్రకు అంతరాయం ఏర్పడుతుంది. ఫలితంగా నిద్రలేమి సమస్య తలెత్తుతుందట. అంతేకాదు.. ఇది కంటి సమస్యలతో పాటు అనేక అనారోగ్య సమస్యలకూ దారితీయవచ్చంటున్నారు నిపుణులు.

మహిళలు ఎక్కువగా స్మార్ట్​ఫోన్ యూజ్ చేయడం వల్ల.. గర్భాశయ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. తరచుగా ఒకే పొజిషన్​లో ఎక్కువసేపు మొబైల్​ వాడడం వల్ల గర్భాశయ ఎముకలకు సంబంధించి సమస్యలు వస్తాయని సూచిస్తున్నారు. అలాగే భుజాలు, మెడ, తల నొప్పి కలిగిస్తుందంటున్నారు. ఇది దిగువకు వ్యాపించి గర్భాశయ నొప్పికి కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు గర్భాశయ నొప్పి చాలా తీవ్రంగా మారవచ్చని.. ఆ టైమ్​లో లేవడం, కూర్చోవడం, పని చేయడం కూడా కష్టంగా మారుతుందని నిపుణులు అంటున్నారు.

అలర్ట్ : మొబైల్ పక్కనే పెట్టుకొని నిద్రిస్తున్నారా? - మీకు ఏం జరుగుతుందో తెలుసుకోండి!

ఎక్కువసేపు ఫోన్​ను యూజ్ చేస్తున్నప్పుడు బాడీ రిలాక్స్డ్ మోడ్​లోకి వెళ్తుందని.. అది దీర్ఘకాలం కంటిన్యూ అయితే సంతానలేమి సమస్యలకు దారితీయవచ్చంటున్నారు నిపుణులు. గర్భాశయ సమస్యలు ఉన్నప్పుడు మెడను కదిలించేటప్పుడు నొప్పి, చేతులలో పెయిన్స్, వెన్నముక బిగుసుకుపోవడం, తలనొప్పి, భుజం నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు. కాబట్టి మహిళలు తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మొబైల్ వాడకాన్ని తక్కువ చేయాలని సూచిస్తున్నారు నిపుణులు.

2018లో 'Journal of Affective Disorders' జర్నల్​లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వాడే మహిళలు ఒత్తిడి, ఆందోళనకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని.. ఇవి వారిలో హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో షాంఘైలోని ఫుడాన్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ Yan Zhang పాల్గొన్నారు. మహిళలు ఎక్కువగా మొబైల్ వాడడం వల్ల తలెత్తే ఒత్తిడి, ఆందోళన.. హార్మోన్ల అసమతుల్యతకు దారితీయవచ్చని ఆయన పేర్కొన్నారు. అలాగే, హార్మోన్ల అసమతుల్యత.. గర్భాశయ సమస్యలు, సంతానోత్పత్తి సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చన్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

వాష్​రూమ్​లోకి ఫోన్​ పట్టుకెళ్తున్నవా? - ఒక్కసారి ఆగు - ఈ డాక్టర్ సాబ్​ ఏం చెబుతున్నారో విను!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.