ETV Bharat / health

అలర్ట్‌ : మీ కళ్లలో ఈ లక్షణాలు ఉన్నాయా? - షుగర్ సంకేతం కావొచ్చు! - Diabetes Symptoms in telugu

Signs Of High Blood Sugar : షుగర్‌ వ్యాధితో బాధపడే వారిలో బరువు తగ్గడం, అలసట, దాహం ఎక్కువగా వేయడం వంటి వివిధ రకాల లక్షణాలు సాధారణంగానే కనిపిస్తాయి. అయితే.. కంటి నుంచి కూడా కొన్ని సంకేతాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

Signs Of High Blood Sugar
Signs Of High Blood Sugar
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 12, 2024, 11:53 AM IST

Signs Of High Blood Sugar : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, జన్యువులు వంటి వివిధ కారణాల వల్ల నేడు చాలా మంది షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. ఒక్కసారి ఒంట్లోకి షుగర్‌ వ్యాధి చేరిందంటే చాలు, దాన్ని అదుపులో ఉంచుకోవడం తప్ప వేరే మార్గం లేదు. అందుకే ఈ డయాబెటిక్‌ పేషెంట్లు ఏ ఆహారం తినాలన్నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తుంటారు. అయితే, షుగర్‌ వ్యాధి ఉన్న వారిలో చక్కెర స్థాయిలు ఎక్కువైతే అధికంగా మూత్రవిసర్జన చేయడం, జీర్ణ సమస్యలు వంటి వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని మనందరికీ తెలిసిందే. కానీ.. వీరిలో షుగర్‌ లెవెల్స్‌ పెరిగిపోతే కంటి ద్వారా కూడా తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటే ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయో మీకు తెలుసా?

రక్తనాళాలు దెబ్బతింటాయి :
శరీరంలో షుగర్ లెవెల్స్‌ పెరిగితే కంటి రెటీనాలోని రక్తనాళాలు దెబ్బతింటాయి. దీంతో కళ్లు ఉబ్బుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కంటి నుంచి ద్రవం కారుతుందని అంటున్నారు. దీనివల్ల వారు సరిగ్గా చూడలేరని, వస్తువులను గుర్తించలేరని అంటున్నారు. ఈ లక్షణాలు ఒక కంటిలో లేదా రెండు కళ్లలోనూ కనిపించవచ్చని చెబుతున్నారు. ఇది దీర్ఘకాలం కొనసాగితే కంటిలోని చిన్న రక్తనాళాలు దెబ్బతిని చూపు తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే.. షుగర్‌ వ్యాధి ఉన్న వారికి కంటిశుక్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఇంకా ఆప్టిక్ నాడి దెబ్బతినడం వల్ల వచ్చే గ్లకోమా సమస్య కూడా ఎటాక్ అవుతుందని చెబుతున్నారు.

పరిశోధన వివరాలు :
2017లో JAMA (The Journal of the American Medical Association) Ophthalmology జర్నల్‌ ప్రచురించిన నివేదిక ప్రకారం.. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్న షుగర్‌ పేషెంట్లలో కళ్లు ఉబ్బడం, కళ్లలో నుంచి నీరు కారడం వంటి లక్షణాలు కనిపించినట్లు పరిశోధకులు గుర్తించారట.

షుగర్‌ లెవెల్స్‌ తగ్గడానికి ఇలా చేయండి :

  • రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్న వారు ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలను తీసుకోవాలి. ముఖ్యంగా మెగ్నీషియం, ఫైబర్ సమృద్ధిగా ఉండే పాలకూరను తినాలి.
  • షుగర్‌ పేషెంట్‌లు వేయించిన ఆహారానికి బదులుగా, ఉడకబెట్టిన ఆహారం తినడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే ఆహారం వేయించడం వల్ల దానిలోని పోషక విలువలు తగ్గుతాయి, క్యాలరీలు పెరుగుతాయి. దీంతో షుగర్‌ పెరుగుతుంది.
  • విటమిన్‌ సి ఎక్కువగా ఉండే నారింజ పండ్లను బెర్రీస్‌, ఆపిల్స్‌ను తినండి. అలాగే జామకాయలను కూడా తినవచ్చు.
  • షుగర్‌ వ్యాధి ఉన్న వారు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఉన్న తృణధాన్యాలు తీసుకోవడం మంచిది. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఒక ఆహారం బ్లడ్‌లో చక్కెర స్థాయిలను ఎంత వేగంగా పెంచుతుందో కొలుస్తుంది.
  • అందుకే.. షుగర్ బాధితులు ఫుడ్‌లో బ్రౌన్ రైస్‌, ఓట్స్, క్వినోవా, ఎర్రపప్పు వంటి వాటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
  • మద్యం, పొగ తాగడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.

మీకు కంటి సమస్యలున్నాయా? - అది గ్లకోమానా? లేదా క్యాటరాక్టా?

రెడ్​ కలర్​ అరటి పండు - సంతానోత్పత్తి కెపాసిటీ నుంచి కంటి చూపుదాకా ఎన్నో బెనిఫిట్స్!

మీ చుట్టూ కంటి చూపు పోగొట్టే శత్రువులే! - ఈ టిప్స్ పాటించకుంటే అంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.