RAJASTHAN SPECIAL SWEET : రాజస్థాన్.. ఈ పేరు వినగానే ఇసుక ఎడారులు, అందాల భవనాలు గుర్తొస్తాయి కదూ! విభిన్న ఆహార్యం కలిగిన రాజస్థాన్ వాళ్ల వంటకాలు సైతం విశేషంగా ఆకట్టుకుంటాయి. వాటిల్లో ముఖ్యంగా 'గెహూ కా దూధియా ఖీచ్' రుచి చూస్తే ఎగిరి గంతేయాల్సిందే. స్వీట్ అంటే ఇష్టపడే వారు ఒక్కసారైనా 'గెహూ కా దూధియా ఖీచ్' పదార్థాన్ని ఆస్వాదించాల్సిందే.
జామపండు Vs డ్రాగన్ ఫ్రూట్ - విటమిన్ పోటీలో విన్నర్ ఎవరంటే! - GUAVA VS DRAGON FRUIT
పాయసం, సేమియా పాయసం, వడపప్పు పాయసం, రవ్వ కేసరి, గులాబ్ జామ్.. మరో అడుగు ముందుకేస్తే డబల్ కా మీఠా, కద్దూ కా ఖీర్, క్యారెట్ హల్వా.. ఇంట్లో చేసుకునే మనకు తెలిసిన ప్రధాన వంటకాలివే. కానీ, రాజస్థాన్ ప్రజలు గోధుమ రవ్వతో చేసే స్వీట్ మీరు ఎప్పుడైనా రుచి చూశారా? ఒక్కసారైనా రుచీ చూడాల్సిందే అంటున్నారు స్వీట్ ప్రియులు. గెహూ కా దూధియా ఖీచ్ వారి వంటకాల్లో ఎంతో ప్రత్యేకమైనది.
ఇంకెందుకు ఆలస్యం.. గెహూ కా దూదియా ఖీచ్ రుచి చూద్దాం పదండి. ఈ స్వీట్ తయారీ కూడా చాలా సులువు. ముందుగా స్వీట్ వంటకానికి కావాల్సిన పదార్థాలు సిద్ధం చేసుకుందామా?
గెహూ కా దూదియా ఖీచ్ తయారీకి ఏమేం కావాలంటే..!
- అర కప్పు గోధుమరవ్వ
- అర కప్పు చక్కెర
- 3 కప్పుల పాలు
- గుప్పెడు బాదం పలుకులు
- కాసిన్ని కిస్‌మిస్‌లు
- అర టీస్పూన్ యాలకుల పొడి
- కొద్దిగా కుంకుమపువ్వు
- చెంచా నెయ్యి
పైన చెప్పిన పదార్థాలన్నింటినీ పక్కన సిద్ధంగా ఉంచుకోవాలి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గోధుమరవ్వలో కప్పు నీళ్లు, ఇంకో కప్పు పాలు పోసి సన్న సెగ మీద ఉడికించుకోవాలి. అదే విధంగా మందపాటి గిన్నెలో మిగిలిన రెండు కప్పుల పాలు పోసి లో ఫ్లేమ్‌లో మరగబెట్టాలి. పాలలో యాలకుల పొడి, బాదం పలుకులు, కిస్‌మిస్‌లు, కుంకుమపువ్వు, నెయ్యితో పాటు కప్పు చక్కెర వేసి కలియ తిప్పాలి. తక్కువ సెగ మీద సుమారు పది నిమిషాల పాటు ఆయా పదార్థాలు కలిపిన పాలను మరిగించుకోవాలి. అందులో ఉడికించిన గోధుమరవ్వ వేసి గడ్డలు కట్టకుండా కలియ తిప్పుతుండాలి. చిక్కబడిన తర్వాత దించేసుకుంటే సరి. ఈ ‘గెహూ కా దూధియా ఖీచ్’లో నెయ్యి కాస్త వేసుకుని వేడి వేడిగా తింటుంటే అదుర్స్ అనిపిస్తుంది. ఈ పంసందైన రాజస్థానీ వంటకాన్ని మీరూ ఓసారి ట్రై చేయండి.
నిలబడి నీళ్లు తాగుతున్నారా? - మీరు డేంజర్లో ఉన్నట్టే! - HOW TO DRINK WATER
చేదుగా ఉందని దూరం పెడితే ఎలా?- ఆ కూరగాయ ఖనిజాల గని - Bitter Guard Benefits