Prevent Fungal Infections During Monsoon : వర్షాకాలంలో కురిసే వానల వల్ల వాతావరణం చల్లగా మారిపోతుంది. దీనివల్ల గాలిలో హానికారక బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అందుకే వర్షాకాలంలో.. రోగాలు చుట్టుముడతాయి. సాధారణ జలుబు, దగ్గు మొదలు.. వైరల్ ఫీవర్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇబ్బంది పెడుతుంటాయి. ఈ క్రమంలో.. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.
పరిశుభ్రత పాటించండి :
వర్షాకాలంలో తేమ వల్ల మన శరీరంపై హానికరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. కాబట్టి, రోజూ యాంటీ బ్యాక్టీరియాల్ లేదా యాంటీ ఫంగల్ సబ్బుతో స్నానం చేయండి. దీనివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండొచ్చు. అలాగే స్నానం చేసిన తర్వాత పొడి వస్త్రంతో పూర్తిగా తుడుచుకోండి. శరీరంపై తడి పూర్తిగా ఆరిన తర్వాతే దుస్తులను ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
వర్షాకాలంలో ఈ డ్రింక్స్ తాగితే - రోగనిరోధక శక్తి పెరగడం పక్కా! పైగా ఈ ప్రయోజనాలు గ్యారెంటీ!
యాంటీ ఫంగల్ పౌడర్ :
చంకలు, గజ్జల దగ్గర చెమట పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ భాగాల్లో యాంటీ ఫంగల్ పౌడర్ చల్లుకోండి. లేదా టాల్కమ్ పౌడర్‌ని కూడా ఉపయోగించవచ్చు. దీనివల్ల అలర్జీలు రాకుండా కాపాడుకోవచ్చు.
తడి బట్టల వద్దు :
ఒక్కోసారి అనుకోకుండా వర్షంలో తడుస్తుంటాం. అయితే తడి దుస్తులతో ఎక్కువసేపు ఉండకూడదు. వీలైనంత త్వరగా ఇంటికి చేరుకుని బట్టలను మార్చుకోవాలి. అలాగే వర్షాకాలంలో తడిగా ఉన్న చెప్పులు, షూస్ వేసుకోకూడదు. అలాగే పాదాలను నీటిలో ఎక్కువసేపు ఉంచకండి. దీనివల్ల కాలి వేళ్ల మధ్య ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. 2019లో 'అమెరికన్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ' జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. పాదాలను పొడిగా ఉంచడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదాన్ని 50% వరకు తగ్గించవచ్చని కనుగొన్నారు. ఈ పరిశోధనలో అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ బ్రాంచ్‌కు చెందిన డెర్మటాలజీస్ట్ 'డాక్టర్ డేవిడ్ జె. లీ' పాల్గొన్నారు.
- టాయిలెట్‌ను ఉపయోగించిన తర్వాత సబ్బు లేదా లిక్విడ్ హ్యాండ్ వాష్‌తో చేతులను కడుక్కోండి. అలాగే గోళ్లను చిన్నగా కట్ చేసుకోండి.
- టవల్స్, బట్టలు, సబ్బులు, షూస్ వంటి వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోవద్దు. మీ వస్తువులను మీరే వాడుకోండి.
- ఇలా కొన్ని చిన్న టిప్స్ పాటించడం వల్ల వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చూసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
జలుబు చేసినప్పుడు ముక్కు కారడం ఆగట్లేదా? - ఇలా చేశారంటే బిగ్ రిలీఫ్!
వర్షాకాలంలో జుట్టు బ్యాడ్ స్మెల్ వస్తోందా ? ఈ టిప్స్ పాటిస్తే ప్రాబ్లమ్ సాల్వ్!