ETV Bharat / health

అలర్ట్ : వ్యాక్స్ చేయించుకుంటున్నారా? - అయితే ఇది మీకోసమే! - pre and post waxing care tips - PRE AND POST WAXING CARE TIPS

​Pre and Post Wax Care Tips: ఆడవాళ్ల అందాన్ని దెబ్బతీయడంలో అవాంఛిత రోమాలు ఫస్ట్​ ప్లేస్​లో ఉంటాయి. ఈ క్రమంలోనే చాలా మంది వీటిని తొలగించుకోవడానికి బ్యూటీపార్లర్​కు వెళ్లి వ్యాక్స్​ చేయించుకుంటుంటారు. అయితే.. వ్యాక్స్​ చేయించుకునేముందు, చేయించుకున్న తర్వాత కొన్ని టిప్స్​ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

​Pre and Post Wax Care Tips
​Pre and Post Wax Care Tips
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 17, 2024, 10:42 AM IST

Pre and Post Wax Care Tips: చర్మంపై ఉండే అవాంఛిత రోమాలను తొలగించుకుని అందంగా కనిపించాలని ప్రతీ అమ్మాయి కోరుకుంటుంది. ఇందుకోసం పార్లర్​కు వెళ్లి వ్యాక్సింగ్ చేయించుకోవడం ఇప్పుడు అందరికీ అలవాటుగా మారింది. ఎక్కువ రోజులపాటు పలకరించకుండా ఉంటాయని నొప్పిని భరించి మరీ చేయించుకుంటారు. ఇదిలా ఉంటే చాలా మంది వ్యాక్స్​ ముందు, వ్యాక్సింగ్​ చేయించుకున్న తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం..

Pre Wax Care Tips:

వ్యాక్సింగ్​ చేయించుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • వ్యాక్స్‌కి ముందు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. లేదంటే చెమట, దుమ్ము వంటివి వాక్స్‌ని శరీరానికి సరిగ్గా అతుక్కోనివ్వవు.
  • దీని వల్ల మళ్లీ మళ్లీ వ్యాక్స్​ చేయించుకోవాల్సి రావొచ్చు. దీంతో నొప్పి అదనం. అందుకే వ్యాక్స్​ చేయించుకునే ముందు శుభ్రత కచ్చితంగా అవసరం.
  • వ్యాక్స్​ చేయించుకోవడానికి కనీసం వారం రోజుల ముందు వరకూ ట్రిమ్మింగ్‌, షేవింగ్‌ లాంటి పనులు చేయొద్దు. వెంట్రుకలు కాస్తయిన పొడవు పెరగకపోతే వ్యాక్స్‌కి ఇబ్బందవుతుంది.
  • చర్మంపై గాయాలు, అలర్జీ, దద్దుర్లు ఉంటే వ్యాక్సింగ్​ చేయించుకోవడాన్ని వాయిదా వేసుకోవడమే మేలని అంటున్నారు. అందం కోసమని వాటిని నిర్లక్ష్యం చేస్తే సమస్య మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
  • చర్మం పొడిబారినా నొప్పి, మంట పెరుగుతాయి. కాబట్టి.. తేమనందించే క్రీములు తప్పక రాయాలి. అయితే వ్యాక్స్‌ చేయించుకునే రోజు, ఆ ముందు రోజు మాత్రం ఏవీ వాడొద్దు.
  • ఇంట్లో స్వయంగా చేసుకుంటున్నా.. పరికరాలు శుభ్రంగా ఉన్నాయా అన్నది గమనించుకోవాలి. లేదంటే బ్యాక్టీరియా చేరి, ఇన్‌ఫెక్షన్లకు దారితీసే ప్రమాదం ఉంది.

సమ్మర్‌లో క్యారెట్‌ ఫేస్‌ప్యాక్స్ - ఇవి ట్రై చేశారంటే ముఖం తళతళా మెరిసిపోద్ది!

Post Wax Care Tips:

వ్యాక్స్​ చేయించుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • వ్యాక్స్‌ తరవాత క్రీమ్‌ అంతా పట్టినట్టు ఉంటుందని చాలా మంది స్నానం చేస్తారు. కానీ ఈ పని చేయవద్దని నిపుణులు అంటున్నారు. నీరు కేశాల కుదుళ్లలోకి పోయి అలర్జీలకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు.
  • అలాగే వదులుగా ఉండే దుస్తులనే వేసుకోవాలని.. లెగ్గింగ్‌, జీన్స్‌ వంటి బిగుతు దుస్తులు రాపిడి కలిగించి, చర్మం ఎర్రబారడానికీ, దద్దుర్లకూ కారణమవుతాయంటున్నారు.
  • వ్యాక్స్‌ పూర్తయ్యాక ఐస్‌ ప్యాక్‌తో ఆ ప్రాంతాన్ని రబ్​ చేయాలని చెబుతున్నారు. అప్పటికే వాపు, దద్దుర్లు వంటివి ఉంటే త్వరగా నయమవుతాయని.. అలాగే ఆ ప్రాంతాన్ని పదే పదే తాకడం, ఎండలోకి వెళ్లడం లాంటివి చేయొద్దని హెచ్చరిస్తున్నారు. వ్యాయామమూ చేయకూడదని.. అలా చేస్తే చెమటతో సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుందని అంటున్నారు.
  • వ్యాక్స్​ చేయించుకున్న ప్లేస్​లో క్రీమ్స్, పెర్‌ఫ్యూమ్స్ అప్లై చేస్తే.. వాటిల్లోని ఆల్కహాల్‌, రసాయనాలు చర్మాన్ని ఇబ్బంది పెడతాయి. తప్పనిసరి అయితే నిపుణుల సలహా మేరకు ముందు జెల్స్‌ రాయడం మేలు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

సూపర్ న్యూస్: ఐస్ వాటర్​లో ముఖం ముంచారంటే అద్భుత సౌందర్యం! - మీరూ తప్పక ట్రై చేస్తారు!

ఈ టిప్స్ పాటిస్తే చాలు - బ్యూటీ పార్లర్​కు వెళ్లకుండానే ఫేస్​ మిలమిలా మెరవడం గ్యారంటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.