Raw Bananas Diet : ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఓ అరటిపండు తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటే మనం చాలా సార్లు విన్నాం. ఇది అన్ని సీజన్లలో దొరికేది, అందరూ ఇష్టంగా తినే పండు మాత్రమే కాదు, పోషకాలు, విటమిన్లు, మినరల్లు పుష్కలంగా ఉండేది కూడా. అయితే అరటిపండ్ల లాగే అరటికాయ కూడా ఆరోగ్యానికి అంతే మేలు చేస్తుందా? ఎలాంటి వారు అరటికాయలను తింటే మంచి ప్రయెజనాలు పొందవచ్చు? అనే విషయాల గురించి ప్రముఖ క్లీనికల్ డైటీషియన్, సర్టిఫైడ్ డయాబెటీస్ ఎడ్యుకేటర్ కనికా మల్హోత్రా మాట్లాడారు. ఇంతకీ ఆమె ఏం చెబుతున్నారంటే ?
అరటిపండ్లతో పోలిస్తే అరటికాయలో పోషక విలువలు భిన్నంగా ఉంటాయి. అరటికాయల్లో చక్కెర తక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్, పొటాషియం, విటమిన్-బీ6, విటమిన్-సీలు అరటిపండు కన్నా అరటికాయల్లో అధికంగా ఉంటాయి. తినే కేలరీల పరిమాణాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉండేలా, బరువును నియంత్రణలో ఉంచుకునేలా చేస్తాయి. అరటికాయల్లో లభించే రెసిస్టెంట్ స్టార్చ్, జీర్ణక్రియను నిరోధించే ఓ రకమైన కార్బోహైడ్రేట్. ఇది శరీరానికి అవసరమైన గట్ బ్యాక్టీరియాను పోషించే ప్రీబయోటిక్‌గా పనిచేస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ష్టార్ చైన్, ఫ్యాటీ యాసిడ్స్ ఉత్పత్తిని పెంచుతుంది.
అరటికాయ ఎలాంటి వారికి మంచి ఆహారంగా పనిచేస్తుంది?
ఎన్నో పోషక విలువలు కలిగిన ఆకుపచ్చ అరటికాయతో అందరూ ఆరోగ్య ప్రయెజనాలను పొందవచ్చు. అయినప్పటికీ కనికా మల్హోత్రా అభిప్రాయం ప్రకారం కొందరికి ఇవి చాలా మేలు చేస్తాయట. ఈ నేపథ్యంలో ఎలాంటి వారు వీటిని ఎక్కువ తినాలంటే?
అథ్లెట్లు
ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, కండరాల పనితీరును మెరుగుపరిచేందుకు సహాయపడే పొటాషియం కంటెంట్ అరటికాయల్లో మెండుగా ఉంటుంది. కాబట్టి అథ్లెట్లు తమ డైట్లో తప్పక చేర్చుకోవాల్సిన ఆహార పదార్థాలో అరటికాయ ఒకటి. అరటికాయల్లో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ స్లో రిలీజ్ ఎనర్జీ సోర్స్‌ను అందిస్తుంది. వ్యాయామం చేసే సమయంలో, ఆటల్లో పాల్గొనే వేళల్లో ఎనర్జీ లెవెల్స్‌ను అదుపులో ఉంచుకునేందుకు అథ్లెట్టు వీటిని ప్రీ వర్కవుట్ స్నాక్స్‌లా తీసుకుంటే మంచిది.
మధుమేహం లేదా ప్రీడయాబెటిస్ బాధితులు
పండిన అరటిపండ్లతో పోలిస్తే అరటికాయల్లో గ్లైసిమిర్ సూచిక తక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతాయి. మధుమేహం లేదా ప్రీడయాబెటీస్‌తో బాధపడుతున్న వ్యక్తులు వీటిని తమ డైట్లో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చు.
బరువు తగ్గాలనుకునేవారు!
అరటికాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆహారం విషయంలో సంతృప్తిని కలిగించడంలో, తక్కువ కేలరీలు తీసుకునేలా చేయడంలో సహాయపడుతుంది. ఫైబర్ కంటెంట్ కారణంగా ఆకలి కోరికరలను నియంత్రిస్తుంది. కాబట్టి ఫిట్‌గా ఉండాలనుకునే వారు బరువు తగ్గాలనుకునే వారికి అరటికాయలు సూపర్ ఫుడ్ అని చెప్పచ్చు.
జీర్ణ రుగ్మతలో బాధపడుతున్నవారు!
అరటికాయల్లో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ ప్రీబెటిక్ గా పనిచేస్తుంది. ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియాను పెంపొందించి ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు అరటికాయలను ఎక్కువగా తినడం వల్ల పేగులు ఆరోగ్యంగా ఉంటాయట. జీర్ణ రుగ్మతలకు దూరంగా ఉంటారు.
ఆఫీసులో అరటిపండ్లు మగ్గబెడుతున్న ఉద్యోగులు - కారణం తెలిస్తే మీరూ అలాగే చేస్తారు!!