ETV Bharat / health

రాత్రిపూట తిమ్మిర్ల సమస్య వేధిస్తోందా? - ఇలా చేస్తే మంచిదంటున్న నిపుణులు! - Leg Cramps Prevention Tips - LEG CRAMPS PREVENTION TIPS

Leg Cramps Prevention Tips: చాలా మందిలో కాళ్లూ, చేతులూ తిమ్మిర్లు పడుతుంటాయి. ముఖ్యంగా రాత్రిపూట ఈ సమస్య కొందరిలో ఎక్కువగా ఉంటుంది. మీరూ ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారా? అయితే, ఇలా చేయడం ద్వారా ఈజీగా ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Easy Ways To Prevent Leg Cramps at Night
Leg Cramps Prevention Tips (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Sep 3, 2024, 11:57 AM IST

Updated : Sep 14, 2024, 7:27 AM IST

Easy Ways to Prevent Leg Cramps at Night: కొందరు ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చున్నా, పడుకున్నా.. తరచుగా కాళ్లు, చేతులు తిమ్మిర్లు ఎక్కుతుంటాయి. ముఖ్యంగా రాత్రిపూట కాళ్లలో తిమ్మిర్లు(Leg Cramps) వేధిస్తుంటాయి. రాత్రిళ్లు వచ్చే ఈ సమస్య నిద్రతో పాటు జీవన నాణ్యతను దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. కాబట్టి.. అసలు ఈ సమస్య ఎందుకొస్తుంది? దీనిని నుంచి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కాళ్లలో తిమ్మిర్లు రావడానికి కారణాలివే!: రాత్రిపూట కాళ్లలో తిమ్మిర్లు రావడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ వేముల శ్రీకాంత్. వాటిలో కొన్నింటిని చూస్తే..

డీహైడ్రేషన్ : బాడీ హైడ్రేటెడ్​గా ఉండాలంటే తగినంత వాటర్ తాగడం చాలా అవసరం. కానీ, అదే మీరు సరైన మోతాదులో నీరు తాగకపోతే డీహైడ్రేషన్ తలెత్తి కాళ్లలో తిమిర్లకు కారణమవుతుందంటున్నారు డాక్టర్ శ్రీకాంత్.

కండరాల అలసట : కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఎక్కువగా వ్యాయామం చేసినప్పుడు లేదా అతిగా శ్రమించినప్పుడు కండరాలు ఒత్తిడికి లోనై అలసట ఏర్పడుతుంది. ఇదీ రాత్రిపూట కాళ్లలో తిమిర్లు ఏర్పడేందుకు కారణం కావొచ్చంటున్నారు.

ఎక్కువ సేపు కూర్చోవడం : ఈరోజుల్లో ఎక్కువ మంది ఆఫీసులలో వర్క్ చేస్తుంటారు. దాంతో ఎక్కువసేపు డెస్క్​లో ఒకే చోట కూర్చొని పనిచేస్తుంటారు. అయితే, ఇలా అధిక సమయం ఒకే పొజిషన్​లో కూర్చోవడం వల్ల లెగ్ మజిల్స్​లో ఒత్తిడి ఏర్పడుతుంది. ఫలితంగా రక్తప్రసరణ తగ్గి కాళ్లలో క్రాంప్స్ రావడానికి దారితీస్తుదంటున్నారు.

వృద్ధాప్యం : వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందట. మరీ ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వారిలో కనీసం 37 శాతం మందికి రాత్రిపూట తిమ్మిర్లు వస్తాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే, మీరూ రాత్రిపూట కాళ్లలో తిమ్మిర్ల సమస్యతో బాధపడుతున్నట్లయితే.. కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా ఆ సమస్యకు ఈజీగా చెక్ పెట్టొచ్చంటున్నారు న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్.

ఇలా చేశారంటే కాళ్లలో తిమ్మిర్లు ఇట్టే మాయం!

నైట్ టైమ్ వచ్చే కాళ్ల తిమ్మిర్ల నుంచి రిలీఫ్ పొందాలంటే మరింత విశ్రాంతి తీసుకోవాలట. అలాగే.. తీవ్రమైన నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు కండరాలను సాగదీయడం, తిమ్మిరి ఎక్కిన ప్రాంతంలో చేతితో స్మూత్​గా మర్దన చేయడం, ఫోర్‌ రోలర్‌ సహాయంతో కాళ్లను నెమ్మదిగా మసాజ్ చేయడం వంటివి చేయాలంటున్నారు.

అదేవిధంగా.. పాదాన్ని వంచడం, తిమ్మిరి ఎక్కిన ప్రాంతాన్ని గోరువెచ్చని నీటితో కాపడం వంటివి చేయడం కాళ్ల తిమ్మిర్లు తగ్గడానికి సహాయపడతాయి. వీటితో పాటు మరికొన్ని టిప్స్ పాటిస్తే ఈ సమస్యను ఈజీగా తగ్గించుకోవచ్చంటున్నారు డాక్టర్ శ్రీకాంత్.

వ్యాయామం : డైలీ నిద్రకు ముందు కొన్ని తేలికపాటి ఎక్సర్​సైజ్​లు చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుందంటున్నారు వైద్యులు. అంటే.. జాగింగ్, వాకింగ్(Walking), రన్నింగ్, సైక్లింగ్ వంటివి చేయడం ద్వారా కండరాలకు మంచి విశ్రాంతి లభిస్తుంది. దాంతో కాళ్లలో నొప్పి తగ్గడమే కాకుండా తిమ్మిర్లు రాకుండా ఉంటాయంటున్నారు డాక్టర్ శ్రీకాంత్.

వాటర్ ఎక్కువగా తాగడం : సీజన్​తో సంబంధం లేకుండా బాడీని హైడ్రేటెడ్​గా ఉంచడం చాలా ముఖ్యం. ఇందుకోసం వాటర్, ఇతర ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇది కండరాలు బాగా పని చేయడడానికి.. తిమ్మిరిని నివారించడంలో సహాయపడుతుందంటున్నారు.

చెప్పులు ఛేంజ్ చేయండి : కొన్నిసార్లు మీరు వేసుకునే చెప్పులు కూడా ఈ సమస్యకు కారణం కావొచ్చట. అందుకే కాళ్లలో తిమ్మిర్లతో బాధపడేవారు ఓసారి వారు వాడే చెప్పులు ఛేంజ్ చేసి చూడాలని.. దీని వల్ల కూడా నొప్పి తీవ్రత, ప్రాబ్లమ్ క్రమంగా తగ్గే ఛాన్స్ ఉంటుందంటున్నారు డాక్టర్ శ్రీకాంత్.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవీ చదవండి :

రాత్రిపూట మీ కాళ్లు, చేతుల్లో ఇలా అనిపిస్తోందా? - మిమ్మల్ని ఆ సమస్య వేధిస్తున్నట్టే!

కండరాలు పట్టేస్తున్నాయా? ఎక్కువ దూరం నడవలేకపోతున్నారా? ఈ ఫుడ్స్​తో రిలీఫ్!

Last Updated : Sep 14, 2024, 7:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.