ETV Bharat / health

ఈ ఫుడ్స్ తీసుకుంటే - మీ రోగనిరోధక శక్తి ఓ రేంజ్​లో పెరగడం పక్కా! - Best Foods to Boost Immune system

Immunity Increase Foods : కాలం మారుతున్న కొద్దీ వివిధ రకాల ఇన్ఫెక్షన్లు మన శరీరంపై దాడి చేస్తుంటాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొవాలంటే రోగనిరోధక వ్యవస్థను దృఢంగా మార్చుకోవడం చాలా అవసరం. ఈ క్రమంలోనే ఇమ్యూనిటీ పెంచే ఆహారాలను రోజువారీ మెనూలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకోసం కొన్ని సూపర్ ఫుడ్స్ కూడా సూచిస్తున్నారు.

Immunity
Immunity Boosting Foods
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 1, 2024, 3:29 PM IST

Immunity Boosting Foods : వాతావరణ పరిస్థితులు మారుతున్న కొద్దీ మన శరీరానికి కావాల్సిన పోషక అవసరాలు మారతాయి. ఇదే సమయంలో మన రోగనిరోధక వ్యవస్థ వివిధ కారణాల వల్ల బలహీనపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే కాలానికి అనుగుణంగా సరైన పోషకాహారాన్ని శరీరానికి అందించడం చాలా కీలకం. అందులో ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. కానీ, చాలా మందికి రోగనిరోధక శక్తి(Immunity Power) పెరగాలంటే ఎటువంటి ఆహారాలు తీసుకోవాలో తెలియదు. అలాంటివారి కోసమే ఈ స్టోరీ. ఈ ఫుడ్స్​ను రోజువారి డైట్​లో చేర్చుకుంటే ఇమ్యూనిటీ పవర్ మస్త్​గా పెరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

స్ప్రౌట్స్ : వీటిని పోషకాల పవర్ హౌస్​ అని చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా పెసర మొలకలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. వీటిలో మెగ్నీషియం, ఫాస్పరస్, మాంగనీస్, విటమిన్ K వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎముకల ఆరోగ్యం, శక్తి ఉత్పత్తి, రక్తం గడ్డకట్టడం వంటి వివిధ శారీరక విధులకు చాలా ముఖ్యమైనవి. అదనంగా, మూంగ్ స్ప్రౌట్స్ రాగి, ఇనుము, జింక్ వంటి యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, ఈ మొలకలు మీ డైట్​లో చేర్చుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు.

పండ్లు, కూరగాయలు : మీ ఇమ్యూనిటీ పవర్​ను పెంచుకోవడంలో విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. కాబట్టి మీ డైట్​లో నారింజ, నిమ్మకాయ, ఉసిరికాయ, బెల్ పెప్పర్స్, ద్రాక్ష వంటి విటమిన్ సి ఉండే పండ్లు, కూరగాయలు తప్పక ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. అంతేకాకుండా వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి డ్యామేజ్ కాకుండా రోగనిరోధక వ్యవస్థను రక్షిస్తాయి.

స్ట్రాంగ్ ఇమ్యూనిటీ, బ్ల‌డ్ షుగ‌ర్ నియంత్రణ! క‌రివేపాకుతో ప్ర‌యోజ‌నాలెన్నో

పెరుగు : రోగనిరోధక శక్తిని పెంచుకోవడంలో పెరుగు కూడా చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తుందని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. పెరుగు ప్రోబయోటిక్స్​కు మంచి మూలం. ఇవి మీ గట్​లోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాకు మద్దతు ఇవ్వడంలో సహాయపడతాయి. ఫలితంగా బలమైన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఆస్ట్రియాలోని వియన్నా విశ్వవిద్యాలయ పరిశోధకుల ప్రకారం.. రోజుకు 200 గ్రాముల పెరుగు తినడం వల్ల రోగనిరోధక శక్తి బలోపేతమవుతుందని వెల్లడైంది.

వెల్లుల్లి : ఇది శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం, ఇన్ఫెక్షన్‌లను ఎదుర్కోవడం, రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇవ్వడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలకు బాధ్యత వహిస్తుంది. కాబట్టి వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

మునగ : ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే అత్యంత పోషకమైన మొక్క. ఇందులో విటమిన్ సి, బీటా కెరోటిన్, క్వెర్సెటిన్, క్లోరోజెనిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, సాధారణ జలుబు, ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో చాలా బాగా సహాయపడతాయి. అదనంగా, మునగకాయలో థయామిన్ (B1), రిబోఫ్లావిన్ (B2), నియాసిన్ (B3), విటమిన్ B12 వంటి B విటమిన్లు ఉంటాయి. ఇవి శక్తి ఉత్పత్తికి, నరాల పనితీరుకు, జీర్ణవ్యవస్థ పనితీరుకు అవసరమైనవి. కాబట్టి మునగను మీ డైట్​లో చేర్చుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పవర్​ను పెంచుకోవడమే కాదు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. 2014లో ప్రచురితమైన 'జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్' ప్రకారం.. మునగకాయ పొడి మధుమేహ వ్యాధి గ్రస్థులలో రోగనిరోధక శక్తిని పెంచుతుందని వెల్లడైంది.

ఆఫ్ట్రాల్ పల్లీ పట్టి అని తీసిపారేయకండి - ఆరోగ్యానికి ఎంత ఉపయోగమో తెలిస్తే వదిలిపెట్టరు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.