How To Indentify Autism In Children : వయసుకు తగ్గట్లు పిల్లల్లో రావాల్సిన మానసిక మార్పులు రాకపోవడాన్నే ఆటిజం అంటారు. దీన్నే మన వాడుక భాషలో మందబుద్ధి అని పిలుస్తారు. ఇది పిల్లలకు బాల్యం నుంచే వచ్చే న్యూరోలాజికల్ డిజార్డర్. ఆటిజంతో బాధపడుతున్న పిల్లలు సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఉండలేరు. ఇతరులతో కలిసి మెలిసి మెలగలేరు. గలగలా మాట్లాడనూలేరు. వేరే వాళ్లు ఏం ఆలోచిస్తున్నారో గుర్తించలేరు, అర్థం కూడా చేసుకోలేరు. ఈ కారణాలే వల్లే వాళ్లు ఎప్పుడూ ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. పిల్లలు ఇలా ఆటిజం బారిన పడటానికి కారణాలు ఇవే.
సాధారణంగా పిల్లల్లో ఆటిజం అనేది ఎక్కువ శాతం జన్యుపరమైన కారణాల వల్ల వస్తుంది.
- నెలలు నిండా కుండానే పుట్టడం
- గర్భధారణ సమయంలో పోషకాహార లోపాలు
- బిడ్డ పుట్టినప్పుడు తల్లిదండ్రుల వయస్సు
- కడుపులో ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్లు, విష రసాయనాలు, ఔషధాలు
- మెదడు ఎదుగుదలకు అవసరమయ్యే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాల విడుదల కాకపోవడం
- పిల్లలతో తల్లిదండ్రుల ప్రవర్తన, వారితో ఎక్కువ సమయాన్ని గడపకపోవడం వల్ల కూడా పిల్లలు ఆటిజం బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఆటిజం లక్షణాలు
- వయసు పెరిగినా మాటలు రాకపోవడం
- ఎవ్వరితోనూ మాట్లాడకపోవడం
- ఎవరితోనూ కలసి ఆడుకోకపోవడం
- నేరుగా చూసి మాట్లాడకపోవడం
- మానసిక పరిపక్వతా లోపం
- ఒంటరిగా మాట్లాడుకోవడం
- ఒకే పనిని పదే పదే చేస్తుండటం
- పిలిచినా పట్టించుకోకుండా ఉండటం
- దెబ్బ తగిలినా తెలుసుకోలేకపోవడం
- శబ్దాలకు పెద్దగా స్పందించకపోవడం
- చీటికీ మాటికీ ఏడవడం
- తమ ఫీలింగ్స్‌ను ఎవరితో పంచుకోకపోవడం
ఆటిజంను అరికట్టేదెలా?
ఇలాంటివన్నీ ఆటిజం లక్షణాలు. వీటిని తల్లిదండ్రులు ఈజీగా తీసుకోకుండా వీలైనంత త్వరగా గుర్తించి నయం చేసే మార్గాలను అన్వేషించాలి.
- పిల్లలకు ఆటిజం సమస్య రాకుండా ఉండాలంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. తల్లి పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి. మానసికంగా ఉల్లాసంగా గడపటంతో పాటు ఒత్తిడిని తగ్గించుకోవడం, వ్యాయామాలు చేయడం లాంటివి చేయాలి. గర్భిణిగా ఉన్నప్పుడు వేసుకోవాల్సిన టీకాలను కూడా క్రమం తప్పకుండా కచ్చితంగా వేయించుకోవాలి.
- అలాగే బిడ్డ పుట్టిన తర్వాత కూడా పోషకాలతో కూడా ఆహారాన్ని పెడుతూ ఉండాలి. నిరంతం పిల్లల ప్రవర్తన గమినిస్తూ ఉండాలి. వారి మానసిక ఎదుగుదలపై ఒక అవగాహన కలిగి ఉండాలి. వారితో ఎక్కువగా మాట్లాడుతూ, సంతోషంగా సమయాన్ని గడుపుతూ ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం వారికి ఎప్పుడూ మనుషులతో కలవడం అలవాటు చేయాలి. అల్లరిచేస్తారు, పరువు తీస్తారు అని ఫోన్ ఇచ్చి ఒకచోట కూర్చోబెట్టడం, బయట ఆడుకోనివ్వకుండా చేయటం లాంటివి ఆటిజం ప్రమాదాన్ని మరింత పెంచుతాయి.
ఆటిజం ఉంటే పిల్లలు ఏమీ చేయలేరా
ఆటిజం సమస్యకు చికిత్స దాని తీవ్రతను బట్టి ఉంటుంది. దీన్ని నయం చేసేందుకు చాలా రకాల థెరపీలు, చికిత్సలు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇది నయం కాని సమస్యగా మరచ్చు. కానీ, సాధరణంగా శరీరంలోగానీ, మెదడులోగానీ కొన్ని లోపాలు ఉన్నప్పుడు వారిలో ఏదో ఓ ప్రత్యేకమైన నైపుణ్యం కలిగి ఉంటారంటారు. అలాగే ఆటిజం ఉన్న పిల్లల్లో కూడా తప్పకుండా ఏదో ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉండే ఉంటుంది. దాన్ని గుర్తించి ఆ దిశగా బిడ్డను ఎదిగేలా చేయడం పూర్తిగా తల్లిదండ్రుల చేతుల్లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Note : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కనురెప్పలు బాగా పెరగాలా? కలబంద, కొబ్బరిపాలతో ఇలా చేస్తే చాలు! - Tips For Eyelashes Growth