How To Cook Leafy Vegetables : మనం ఆరోగ్యంగా ఉండటానికి రోజూ ఆహారంలో తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను భాగం చేసుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరలను తరచూ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు అన్నీ అందుతాయి. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఔషధంగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే, వీటిని వండుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలను పాటిస్తేనే.. ఆకుకూరల్లోని పోషకాలు పూర్తిగా బాడీకి అందుతాయని అంటున్నారు. మరి.. ఆకుకూరలను వండేటప్పుడు ఎటువంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకుకూరలు వండేటప్పుడు ఈ టిప్స్ పాటించండి :
- ఆకు కూరలు, కాయగూరల్ని వండే ముందు కాసేపు వేడి నీళ్లలో మరిగించండి. ఇలా చేయడం వల్ల అవి తొందరగా ఉడుకుతాయి. అయితే.. మరిగించిన నీటిని మళ్లీ కూరలో యాడ్ చేసుకోవాలి. దీనివల్ల పోషకాలు బయటికి పోకుండా ఉంటాయట.
- అలాగే నీళ్లకు బదులుగా వెనిగర్, నిమ్మరసం మిశ్రమంలో కూడా మరిగించుకోవచ్చు. దీనిద్వారా కూరకు మరింత రుచి, చిక్కదనం వస్తుంది.
- కొంతమంది ఆకుకూరలను వండేముందు స్టీమింగ్ పద్ధతిలో ఉడికిస్తారు. ఇలా చేయడం మంచిది. దీనివల్ల పోషకాలు కూరలోనే ఉంటాయి.
- ఆకుపచ్చటి కాయగూరల్ని వండేటప్పుడు అందులో ఉప్పు, మిరియాల పొడి, ఆలివ్ నూనె, వెనిగర్, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కారం వంటి పదార్థాలు వేయడం వల్ల ఇంకా టేస్ట్ పెరుగుతుంది. దీనివల్ల అందులోని పోషకాలు కూడా శరీరానికి అందుతాయి.
- కొంతమందికి కూర గ్రేవీగా ఉంటే ఇష్టం ఉండకపోవచ్చు. దీంతో వారు నీళ్లు పోయకుండా ఆకుకూరలను డ్రైగా వేపుతుంటారు. అయితే, ఆకుకూరలను ఇలా వండటం వల్ల పోషకాలు ఆవిరైపోతాయి. అందుకే కూరలోకి కొద్దిగా వాటర్‌ను యాడ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
- మరికొంత మంది కాయగూరల్ని గ్రిల్ చేసుకుని తింటారు. ఇలా మంటపై వేపడం వల్ల వాటిలోని పోషకాలు అన్ని తరిగిపోతాయి. ఇది ఆకుపచ్చటి కాయగూరలకు కూడా వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
- ఇలాంటి వారు కాయగూరల మిశ్రమంపై సీజనింగ్ మిశ్రమాన్ని పూసి, తక్కువ మంటపై కొద్ది సేపు కాల్చాలని సూచిస్తున్నారు.
- ఆకుపచ్చటి కాయగూరల్ని వండేటప్పుడు చిన్నగా తరగకుండా, కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల అందులోని పోషకాలు నశించిపోకుండా ఉంటాయట.
- కొంత మంది తినేటప్పుడు కూరగాయాలను వేడి చేసుకుని తింటారు. అయితే.. ఇలా ఏ పదార్థాలనైనా కూడా పదే పదే వేడి చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల అందులోని పోషకాలు నశిస్తాయి. ఇది ఆకుపచ్చ కూరగాయలకు కూడా వర్తిస్తుంది.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పచ్చి ఉల్లిపాయ తింటున్నారా - ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో ఎల్లో తినకపోతే - ఏం జరుగుతుందో తెలుసా? - EGG YELLOW BENEFITS