ETV Bharat / health

మీ స్కిన్‌టోన్‌కి సరిపోయే - లిప్‌స్టిక్​ ఎలా సెలక్ట్​ చేసుకోవాలో తెలుసా? - how to choose lipstick

How To Choose Best Lip Color : అమ్మాయిలు అందంగా కనిపించడంలో లిప్‌స్టిక్‌ పాత్ర కీలకం. అయితే.. స్కిన్​ కలర్​కు తగినట్టుగా ఏ కలర్​ లిప్​ స్టిక్​ ఎంచుకోవాలి అన్నది చాలా మందికి తెలియదు. స్కిన్‌టోన్‌కు సరిపోయే రంగును ఎంపిక చేసుకుంటేనే ముఖం ఇంకా అందంగా కనిపిస్తుంది. లేదంటే.. ఎబ్బెట్టుగా ఉండే ఛాన్స్ ఉంది. మరి.. ఏ కలర్‌ లిప్‌స్టిక్‌ సెలెక్ట్‌ చేసుకోవాలో మీకు తెలుసా?

How To Choose Best Lip Color
How To Choose Best Lip Color
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 10, 2024, 2:40 PM IST

How To Choose Best Lip Color : అమ్మాయిలు అందంగా కనిపించడానికి ఎంతో తాపత్రయపడుతుంటారు. అందానికి మరిన్ని మెరుగులు దిద్దుకోవడానికి తరచూ బ్యూటీ పార్లర్లకు కూడా వెళ్తుంటారు. రకరకాల కాస్మెటిక్స్ ఉపయోగిస్తుంటారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లిప్‌స్టిక్‌ గురించి. అమ్మాయిలు ఎంత మేకప్ వేసుకున్నా.. లిప్‌స్టిక్‌ వేసుకుంటేనే ముఖానికి అందం వస్తుంది. అయితే.. ఏ రంగుబడితే ఆ రంగు వాడితే ముఖ సౌందర్యం దెబ్బ తినొచ్చు. అందుకే.. స్కిన్‌టోన్‌ బట్టి కలర్ సెలక్ట్ చేసుకోవాలంటా నిపుణులు. మరి.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

రంగు బాగా తక్కువగా ఉంటే :
ఇలాంటి వారు అందంగా కనిపించడానికి మేకప్‌తోపాటు గోధుమరంగు, లేత గులాబీ, గోధుమ వర్ణాలు ఉండే లిప్‌స్టిక్‌లను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ మీకు రెడ్‌ కలర్‌లో ఉండే లిప్‌స్టిక్‌ వేసుకోవాలని అనిపిస్తే.. డార్క్ రెడ్‌ కాకుండా కాస్త లైట్‌ రెడ్‌ కలర్‌లో ఉండేది తీసుకుంటే మంచిదని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు.

పెళ్లి కూతురు మేకప్ - ఈ పనులు చేస్తే అంతే!

చామనఛాయకు దగ్గరగా ఉన్నవారు :
ఈ కలర్‌ స్కిన్‌టోన్‌ ఉన్నవారు.. పెదవులకు డార్క్‌ రెడ్‌, లైట్‌ డార్క్‌ పింక్‌, ముదురు కాషాయ రంగు ఉన్న లిప్‌స్టిక్‌ వేసుకుంటే అందంగా కనిపిస్తార'. కాబట్టి, మీరు చామనఛాయ రంగులో ఉంటే ఈ కలర్ లిప్‌స్టిక్‌లను కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

గోధుమ రంగులో ఉన్నవారు :
ఈ కలర్‌ స్కిన్‌టోన్‌ ఉన్న వారు మరీ డార్క్‌గా ఉండే పింక్‌ కలర్‌, రెడ్‌ కలర్స్ తీసుకోకుండా.. లైట్‌ కలర్‌లో ఉండేవాటిని ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల ఫేస్‌ మరింత అందంగా కనిపిస్తుంది.

వైట్‌ స్కిన్‌టోన్‌ :
తెల్లగా ఉండే వారు కాస్త మేకప్‌ తక్కువగా వేసుకున్నా కూడా అందంగానే కనిపిస్తారు! అయితే.. వీరు మరింత అందంగా కనిపించడానికి మంచి రంగులో ఉండే లిప్‌స్టిక్‌ అప్లై చేసుకోవాలి. కాబట్టి.. లైట్‌ పింక్‌, లైట్‌ రెడ్‌, లైట్‌ బ్రౌన్‌ కలర్‌లో ఉండే లిప్‌స్టిక్‌లను సలెక్ట్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఈ టిప్స్‌ పాటించండి:

  • పెదవులపై డెడ్ ​స్కిన్ సెల్స్ ఉండడం వల్ల లిప్​స్టిక్ ఎక్కువసేపు ఉండకపోవచ్చు. కాబట్టి, లిప్‌స్టిక్‌ పెట్టుకునే ముందు పెదాలను బాగా క్లీన్ చేయాలి.
  • దీనికోసం ముందు కొద్దిగా నూనె లిప్స్‌పై అప్లై చేసి.. మెత్తటి టూత్‌బ్రష్‌తో సున్నితంగా స్క్రబ్ చేయాలి. తర్వాత పెదాలను కడిగి లిప్​స్టిక్ అప్లై చేసుకోండి.
  • లిప్‌స్టిక్‌ వేసుకున్న తర్వాత పెదవులపై టిష్యూతో అద్దుకోవాలి. ఇలా చేయడం లిప్స్‌పై ఉన్న అదనపు లిప్‌స్టిక్‌ కాగితానికి అంటుకుంటుంది. దీంతో లిప్స్‌ ఎక్కువసేపు ఫ్రెష్‌గా కనిపిస్తాయి.
  • లిప్​స్టిక్ అప్లై చేయడానికి ముందు పెదాలకు వాజిలెన్​, లిప్ బామ్ వంటి వాటితో మాయిశ్చరైజ్ చేయండి.
  • దీనివల్ల పెదవులు పొడిబారకుండా అందంగా కనిపిస్తాయి. అలాగే లిప్‌స్టిక్‌ కూడా ఎక్కువసేపు ఉంటుంది.

మేకప్ వేసుకుంటే - క్యాన్సర్ వస్తుందా?

ఫస్ట్​టైమ్​ మేకప్​ ట్రై చేస్తున్నారా? ఈ టిప్స్​ పాటించండి - సూపర్ బ్యూటీ మీ సొంతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.