High Blood Pressure Diet : ప్రస్తుతం దాదాపు బయట దొరికే ఫుడ్ ఐటెమ్స్ మొత్తం కల్తీవే ఉంటున్నాయి. ఇటువంటి సమయంలో హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం చాలా కష్టంగా మారింది. అందులో మీకు బీపీ ఎక్కువగా ఉన్న సమయంలో మంచి జాగ్రత్తతో కూడిన డైట్ తీసుకోవడం చాలా కీలకం. ఒకవేళ అలా చేయకపోతే హైబీపీతో రోగాలు రావడం ఖాయం. అందులోనూ గుండెకి సంబంధించి తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.
సాల్ట్-హెవీ స్నాక్స్
సాయంత్రం పూట సాల్టెడ్ స్నాక్స్ ప్రమాదకరం. అదొక ఫ్లేవర్ కోసమే తీసుకున్నప్పటికీ సోడియం లెవల్స్ పెరిగి రక్తపోటుకు దారితీస్తాయి. రక్తపోటు పెరిగి శరీరాన్ని ప్రమాదంలోకి నెట్టేసే దాని కంటే వెజ్జీ స్టిక్స్ లేదా హెల్దీగా ఉంచే స్నాక్స్ తీసుకోవడం బెటర్.
డిసర్ట్‌లు
స్వీట్స్ చూడడానికి, తినడానికి చాలా టెంప్టింగ్‌గా ఉంటాయి. కానీ, వాటి వల్ల బరువు పెరిగి రక్తపోటును పెంచేస్తాయి. కోకోవా కంటెంట్ ఎక్కువగా ఉండే డార్క్ చాకొలేట్స్‌కు దూరంగా ఉంటేనే గుండెకు చక్కటి ఆరోగ్యం.
ప్రోసెస్డ్ మీట్స్
రెడీమేడ్‌గా దొరికే మీట్ వండుకునేందుకు సౌకర్యవంతమే. కానీ, అవి ఎక్కువ సోడియం, ప్రిజర్వేటివ్‌లతో ఉంటాయి. ఆ మాంసం తినడం వల్లే రక్తపోటు వస్తుందని గుర్తుంచుకోండి. వీటికి బదులుగా తాజా మాంసాన్ని తినడమే గుండెకు మంచిది.
ఫాస్ట్ ఫుడ్
క్షణాల్లో తయారయ్యే ఫాస్ట్ ఫుడ్‌లో ఎక్కువ మొత్తంలో సోడియం, అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అవి తింటే మీ రక్తంపై మీరే ప్రయోగాలు చేసినట్లు అవుతుంది. తాజా కూరగాయాలతో తయారుచేసిన ఇంటి ఆహారం తినడం వల్ల దీనికి దూరంగా ఉండొచ్చు.
ప్యాక్ చేసిన సూప్‌లు
ప్యాక్ చేసి ఉంచిన సూప్‌లు తీసుకోవడానికి కంఫర్ట్‌గా ఉన్నప్పటికీ ఎక్కువ ఉప్పుతో కూడి ఉంటాయి. వీటి వల్ల సోడియం ఎక్కువై రక్తపోటును పెంచేస్తాయి. తాజా కూరగాయాలతో చేసిన తక్కువ సోడియం ఉన్న ఆహారం తినడం వల్లనే ఆరోగ్యంగా ఉండగలం.
చీజ్
చీజ్‌లో ఎక్కువ మోతాదులో కాల్షియం దొరకడం వల్ల సాచురేటెడ్ ఫ్యాట్స్, సాల్ట్ దొరుకుతుంది. ఫలితంగా బీపీ కంట్రోల్లో ఉండదు. లో ఫ్యాట్ లేదా మొక్కల నుంచి తయారుచేసిన ఆహారం తీసుకోవడం గుండెకు మంచిది.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.