Ginger Lime Scrub Benefits : అందాన్ని పెంచేందుకు ఉపయోగపడే ఎన్నో పదార్థాలు మన వంటగదిలోనే ఉంటాయి. మనం పట్టించుకోము గానీ వంటింట్లో ఎప్పుడూ ఉండే కూరగాయలు, పండ్లతో మనకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు మార్కెట్లో దొరికే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ కన్నా ఎక్కువ అందాన్ని అందిస్తాయి. అది కూడా సహజంగా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.
మన అందాన్ని పెంచే దివ్యమైన ఔషధాలు మన వంటగదిలోనే ఉంటాయి. వాటిలో అల్లం-నిమ్మకాయల మిశ్రమంతో చేసే బ్యూటీ స్క్రబ్ ఒకటి. క్రమం తప్పకుండా వారానికి ఒకసారి మీ ముఖాన్ని ఈ అల్లం- నిమ్మకాలతో చేసిన మిశ్రమంతో రుద్దుకుంటే చాలు. మృతకణాలు తొలగిపోయి మీ చర్మం అందంగా, ఆరోగ్యకరంగా మారుతుంది. మీ చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా తయారు చేసేందుకు ఈ స్క్రబ్ మీకు బాగా సహాయపడుతుంది.
ప్రయోజనాలు
- ఈ స్క్రబ్‌లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను తగ్గించడమే కాదు, చర్మం వాపు, ఎరుపు వంటి సమస్యలను నయం చేస్తాయి.
- అల్లం-నిమ్మకాయల మిశ్రమంతో శరీరాన్ని రుద్దుకుంటున్నప్పుడు, చర్మంలో పుట్టే వేడి కారణంగా కండరాలకు ఉపశమనం కలుగుతుంది. రక్తప్రసరణ బాగా జరిగి చర్మారోగ్యం మెరుగవుతుంది.
- ఈ స్క్రబ్ మీ చర్మానికి సహజ టోనర్‌గా పనిచేస్తుంది. చర్మపు రంధ్రాలను శుభ్రపరిచి, చర్మాన్ని యవ్వనంగా, తాజాగా మారుస్తుంది.
- నిమ్మకాయలోని సహజసిద్ధమైన క్లెన్సింగ్ లక్షణాలు చర్మాన్ని శుభ్రంగా మారుస్తాయి. అలాగే ఈ స్క్రబ్‌లోని విటమిన్-సీ లేదా సిట్రిక్ యాసిడ్స్ మీ చర్మాన్ని కాంతివంతంగా, మెరిసేలా చేస్తాయి.
- ఈ స్క్రబ్‌లోని యాంటీ బాక్టీరియల్ గుణాలు పగుళ్లను తగ్గించి చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.
- బ్లాక్ హెడ్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి అల్లం-నిమ్మ మిశ్రమం చక్కటి ఔషధంలా ఉపయోగపడుతుంది. దీంట్లోని సిట్రిక్ యాసిడ్, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ చర్మాన్ని ప్రక్షాళన చేసి మచ్చలను మాయం చేస్తాయి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
- తురిమిన అల్లం
- ఒకటింపావు టీస్పూన్ కొబ్బరి నూనె
- ఒకటిన్నర టీస్పూన్ నిమ్మరసం
- ఒక టీస్పూన్ చక్కెర
తయారీ విధానం
- అల్లాన్ని చిన్న చిన్న ముక్కులుగా తురుముకుని ఒక గిన్నెలో వేసుకోవాలి.
- దీంట్లో కొబ్బరి నూనె, బ్రౌన్ షుగర్ వేసి మిక్స్ అయ్యేలా చక్కగా కలిపాలి.
ఎలా ఉపయోగించాలి
- అల్లం- నిమ్మ మిశ్రమాన్ని రాసుకోవడానికి ముందు ముఖం, చేతులు, కాళ్లు సహా, మీరు ఎక్కడ రాసుకోవాలనుకుంటే అక్కడ గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
- తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకుని చేతి వేళ్లను మాత్రమే ఉపయోగిస్తూ సున్నితంగా మర్దన చేయాలి.
- పావు గంట పాటు చర్మంపై ఈ మిశ్రమాన్ని అలాగే ఉంచి ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
అల్లం-నిమ్మ స్క్రబ్‌ను వారానికి ఒకటి లేదా రెండు సార్లు తరచుగా ఉపయోగించడం వల్ల మీ చర్మం సహజమైన కాంతిని పొంది ఆరోగ్యకరంగా మారుతుంది. ఇకెందుకు ఆలస్యం, అల్లం-నిమ్మ స్క్రబ్ తయారు చేసుకొండి - అందాన్ని పెంచుకోండి.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పనికిరానివని పడేస్తున్నారా? ఇవి బాత్రూంలో పెడితే ఎప్పుడూ సువాసనే! - room freshener with food items