Fatty Liver Disease Affected Body Organs : ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న అత్యంత సాధారణ వ్యాధుల్లో ఫ్యాటీ లివర్ సమస్య ఒకటి. ఈ వ్యాధికి ప్రధాన కారణం ఊబకాయం. నేటి వేగవంతమైన జీవితంలో ఆహారపు అలవాట్లు అన్ని అనారోగ్యానికి దారితీసేవే. హానికరమైన ఆహరాలు తినడం వల్ల శరీరంలో ఏర్పడే అసమతుల్యత అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ డిసీజ్ కారణంగా శరీరంలోని చాలా అవయవాలు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు.
ఫ్యాటీ లివర్ సమస్య రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మెటబాలిక్ డిస్ ఫంక్షన్-అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్. ఇంకోటి ఆల్కాహాల్ సంబంధిత ఫ్యాటీ లివర్ డిసీజ్. మొదటిది పెద్ద ప్రమాదకరమైన వ్యాధి కానప్పటికీ కాలేయంలో విపరీతమైన మంటను కలిగిస్తుంది. కాలేయ కణాలను దెబ్బతీస్తుంది. కాలక్రమేణా ఈ ఫ్యాటీ లివర్ సమస్య మరింత ఇబ్బంది పెడుతుంది. రెండోది ఆల్కాహాల్ సంబంధిత ఫ్యాటీ లివర్ డిసీజ్. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. సాధారణంగా ఇది మద్యం సేవించడం వల్ల వస్తుంది. కాలేయ సమస్యలున్నవారు మద్యం తాగడం వల్ల లివర్ మరింత దెబ్బతింటుంది. ఇది పూర్తి కాలేయాన్ని నాశనం చేస్తుంది. దీనికి ప్రధాన సంకేతం పొత్తి కడుపు కుడి వైపున ఎగువ భాగంలో నొప్పి, అసౌకర్యం కలుగుతాయి.
ఈ శరీర భాగాలపై ఎఫెక్ట్
పొత్తికడుపు
కాలేయ వ్యాధిలో చాలా లక్షణాలుంటాయి. వాటిలో ద్రవ నిలుపుదల ఒకటి. ఫ్యాటీ లివర్ డిసీజ్ పొత్తికడుపులో నీటిని నిలుపుకుంటుంది. కాలేయంలోని రక్తనాళాల్లో వాపు, ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి. రక్తనాళాల నుంచి వచ్చే ద్రవం పొత్తికడుపులో పేరుకుపోయి వాపు, నొప్పికి కారణమవుతాయి.
పాదాలు
ఫ్యాటీ లివర్ డిసీజ్‌తో ఇబ్బంది పడుతున్న వారిలో పాదాల వాపు ప్రధానంగా కనిపించే సమస్య. గురుత్వాకర్షణ శక్తి కారణంగా శరీరంలోని ద్రవం పాదాలలో పేరుకుపోతుంది. ఫలితంగా కాళ్ల వాపు సమస్య వస్తుంది.
కాళ్లు, చీలమండలాలు
చీలమండలాలు, కాళ్లలో వాపు కూడా కాలేయ వ్యాధి లక్షణాలలో ఒకటి. కిడ్నీలో విస్తరించిన సిరలు ఒత్తిడికి గురయి రక్త ప్రవాహానికి అడ్డుగా మారతాయి. మూత్రపిండాలు ద్రవాన్ని శుద్ధి చేసే ప్రక్రియకు ఇది అడ్డుకట్టగా మారుతుంది.
ఛాతి
ఫ్యాటీ లివర్ డిసీజ్ ఛాతి గోడల విస్తరణకు కూడా కారణమవుతుంది. ఇది హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుంది. దీని కారణంగా లైంగిక కోరికల్లో తగ్గుదల వచ్చి సంతానలేమి సమస్య ఏర్పడుతుంది.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.