Eye Care During Summer : సమ్మర్ సీజన్‌లో చాలా మంది చర్మ సంరక్షణ విషయంలో, అలాగే ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంకా బాడీని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి తరచూ వాటర్ ఎక్కువగా తీసుకుంటూనే వివిధ రకాల జ్యూస్‌లు, పండ్లను తీసుకుంటారు. కానీ, మెజార్టీ జనాలు కళ్ల విషయంలో మాత్రం అజాగ్రత్తగా ఉంటారని నిపుణులంటున్నారు. ముఖ్యంగా ఎక్కువ సేపు ఎండలో పని చేసేవారు, బైక్‌ల మీద తిరిగేవారు సన్ గ్లాసెస్ లేకుండా పని చేస్తుంటారు. ఇలా సమ్మర్‌లో కంటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కళ్లు ఎరుపెక్కడం, దురద, చికాకు, కంటి నుంచి నీరు కారడం వంటి సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. అందుకే వేసవి కాలంలో కళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- ఎండాకాలంలో బయట నుంచి ఇంటికి వచ్చినవారు చల్లటి నీళ్లతో కళ్లను కడుక్కోవడం వల్ల ఉపశమనం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల కళ్లలోని దుమ్ము, ధూళీ తొలగిపోతుందని.. కళ్ల ఎరుపు తగ్గుతుందని, కంటి చికాకు తగ్గుతందని నిపుణులంటున్నారు. 2020లో 'జర్నల్ ఆఫ్ ఆఫ్తాల్మాలజీ' జర్నల్లో ప్రచురితమైన నివేదిక ప్రకారం, వేసవిలో చల్లని నీటితో కళ్లు కడుక్కోవడం వల్ల కంటి చికాకు, ఎరుపు తగ్గిందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో న్యూయార్క్‌లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టర్. జేన్ స్మిత్ పాల్గొన్నారు. సమ్మర్లో కంటి చికాకు, కళ్లు ఎరుపెక్కడం వంటి సమస్యలతో బాధపడేవారు.. చల్లటి నీళ్లతో కడుక్కోవడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సని విషయం ఏంటంటే.. మరీ చల్లగా ఉన్నా నీటితో క్లీన్ చేసుకోకూడదని అంటున్నారు.
- కళ్లు నొప్పిగా ఉండి, ఎర్రగా మారితే ఎండలోకి వెళ్లకండని సలహా ఇస్తున్నారు. దీనివల్ల సమస్య మరింత తీవ్రమవుతుందంటున్నారు. అలాగే కంప్యూటర్ స్క్రీన్‌లు, మొబైల్, టీవీలను చూడటం తగ్గించమని సూచిస్తున్నారు.
- తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే సన్‌గ్లాసెస్ ధరించమని.. సన్‌గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల సూర్యుడి నుంచి వచ్చే uv కిరణాల నుంచి కళ్లను కాపాడుకోవచ్చంటున్నారు.
- అలాగే బాడీని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి తరచూ వాటర్, కొబ్బరినీళ్లు, ద్రవ పదార్థాలను తీసుకోమని సలహా ఇస్తున్నారు.
- కళ్లు నొప్పిగా ఉండి, చికాకుగా అనిపిస్తే కళ్లను రుద్దడం లాంటివి చేయకూడదని.. ఇలా రుద్దడం వల్ల సమస్య పెద్దగా అవుతుందే తప్ప తగ్గదంటున్నారు.
- ఈ టిప్స్ అన్ని పాటించినా కూడా కళ్లు ఎరుపెక్కడం, చికాకు సమస్య తగ్గకపోతే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కంటి వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కడుపు నొప్పి ఉన్నప్పుడు ఏం తినాలి? ఏవి అస్సలు తినకూడదు? - Upset Stomach Foods That Soothe
నెల రోజులు ఉల్లిపాయ తినకపోతే - మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా? - Onions Health Benefits