ETV Bharat / health

మీరు రాత్రి సరిగ్గా నిద్రపోవడం లేదా? - డైలీ ఈ డ్రింక్స్‌ తాగితే- డీప్‌ స్లీప్‌!! - Drinks for Better Sleep - DRINKS FOR BETTER SLEEP

Drinks for Better Sleep : మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కంటి నిండా నిద్రపోవాలి. కానీ, ప్రస్తుత కాలంలో చాలా మంది వివిధ కారణాల వల్ల నైట్‌ టైమ్‌లో సరిగ్గా నిద్రపోవడం లేదు. అయితే, నిద్రలేమి సమస్యతో బాధపడేవారు డైలీ పడుకునే ముందు కొన్ని డ్రింక్స్‌ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Drinks for Better Sleep
Drinks for Better Sleep
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 2, 2024, 11:27 AM IST

Drinks for Better Sleep : ప్రస్తుత కాలంలో చాలా మంది జనాలు పని ఒత్తిడి, అనారోగ్య సమస్యలు వంటి ఇతర కారణాల వల్ల రాత్రి సరిగ్గా నిద్రపోవడం లేదు. అయితే, మనిషికి కంటి నిండా నిద్ర లేకపోవడంతో మరుసటి రోజు నీరసంగా ఉంటుంది. దీంతో ఏ పని చేయాలని అనిపించదు. ఇలా దీర్ఘకాలికంగా నిద్రలేమి సమస్యతో బాధపడటం వల్ల భవిష్యత్తులో ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్‌ వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, నిద్రలేమి సమస్యతో బాధపడేవారు నిద్రపోవడానికి ముందు కొన్ని డ్రింక్స్‌ తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. మరి, ప్రశాంతమైన నిద్రను అందించే ఆ డ్రింక్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.

పాలల్లో పసుపు : డైలీ ఒక గ్లాసు పసుపు కలిపిన పాలను నైట్‌ టైమ్‌లో తాగడం వల్ల హాయిగా నిద్రపోవచ్చు. పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం నిద్రలేమికి కారణమయ్యే ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ పాలను తాగడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయట. చర్మంపై మొటిమలు, మచ్చలు రాకుండా కాపాడతాయి. అలాగే కళ్ల కింద డార్క్‌ సర్కిల్స్‌ రాకుండా అడ్డుకుంటాయి. ఇంకా చర్మాన్ని మెరిసేలా చేస్తుందని నిపుణులంటున్నారు.

గోరు వెచ్చని పాలు : కొంత మంది నైట్‌ టైమ్‌లో కడుపు ఉబ్బరం, అజీర్ణ సమస్యల వల్ల నిద్రపోకుండా ఉంటారు. ఇలాంటి వారు రోజూ గోరువెచ్చని పాలు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గి హాయిగా నిద్రపోవచ్చు. పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది నిద్ర పోయేలా ప్రేరేపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ ఫుడ్ ఎంత తింటే - మీ ఆయుష్షు అంత తగ్గిపోతున్నట్టే! - Ultra Processed Food Effects

బాదం పాలు : రోజూ ఆహారంలో బాదంపప్పులను తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇది అందరకీ తెలిసిందే! అయితే, రోజూ రాత్రి బాదం పాలను తాగడం వల్ల నిద్ర బాగా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు కంటినిండా నిద్రపోయేలా చేస్తాయని తెలియజేస్తున్నారు.

పరిశోధన వివరాలు : 2016లో ప్రచురించిన "జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్" అధ్యయనం ప్రకారం.. రోజూ బాదం పాలు తాగే వారు తొందరగా నిద్రపోయే అవకాశం ఉందని పరిశోధకులు కనుగొన్నారట. ఈ పరిశోధనలో దిల్లీలోని 'ఆల్ ఇండియా ఇన్ డిగ్రీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌'లోని న్యూరోసైన్స్ సెంటర్‌ ప్రొఫెసర్ డా. రాజ్ కె. షా పాల్గొన్నారు. డైలీ బాదం పాలు తాగే వారు తొందరగా నిద్రపోతారని ఆయన పేర్కొన్నారు.

నిమ్మ ఆకుల టీ : మనలో చాలా మందికి లెమన్‌ టీ తెలుసు గానీ, ఈ నిమ్మ ఆకుల టీ గురించి తెలియకపోవచ్చు. అవునండీ, నైట్‌ టైమ్‌లో నిద్రపోవడానికి ఎంతో ఇబ్బంది పడేవారు ఈ హెర్బల్ టీ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుందట.

చెర్రీ జ్యూస్‌ : చెర్రీ జ్యూస్‌లో మెలాటోనిన్‌ అనే హార్మోన్‌ ఉంటుంది. ఇది రాత్రి బాగా నిద్రపట్టేలా చేస్తుందని నిపుణులు చెబుతన్నారు. కొన్ని పరిశోధనల ప్రకారం, రోజూ చెర్రీ జ్యూస్‌ తాగిన వారు త్వరగా నిద్రపోయినట్లు పరిశోధకులు కనుగొన్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

అలర్ట్ : ఉల్లిపాయలు ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా? - Onions Side Effects

వేడి పాలు తాగాలా - చల్లార్చినవి తీసుకోవాలా? - Benefits Of Cold Milk

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.