Does Mango Increase Blood Sugar and Weight Gain : మధుమేహులు మామిడి పండ్లను తినాలా వద్దా? అనే విషయంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. కొందరు షుగర్ పెరుగుతుందని చెప్తారు. మరికొందరు పర్వాలేదు అంటారు. అయితే నిపుణులు ఏమంటున్నారంటే.. మితంగా తింటే సమస్యలు రావని అంటున్నారు. మామిడిపండ్లలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌తో పాటు సహజ చక్కెరలు ఉంటాయి. వీటితోపాటు గ్లైసెమిక్ ఇండెక్స్ 51 యూనిట్లు ఉంటుంది. డయాబెటిస్ పేషెంట్లు గ్లైసెమిక్ ఇండెక్స్ 55 యూనిట్ల కంటే ఎక్కువగా ఉండే ఆహారాలను తినకూడదని నిపుణులు సూచిస్తారు. కాబట్టి.. జాగ్రత్తలు తీసుకుంటూ మితంగా మామిడి పండ్లను తింటే షుగర్ బాధితులకూ ఏమీ కాదని చెబుతున్నారు.
2019లో జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. టైప్ 2 డయాబెటిస్ ఉన్న పురుషులు మామిడిపండ్లు తీసుకోవడం.. గ్లైసెమిక్ నియంత్రణ, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనా వుహాన్‌లోని హుబేయ్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ప్రొఫెసర్ డా. X. Yang పాల్గొన్నారు. మామిడిపండ్లు రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరచడంలో సహాయపడతాయని వారు పేర్కొన్నారు.
మీకు పసుపు రంగు పుచ్చకాయ తెలుసా? - ఇది తింటే ఏమవుతుంది? - Benefits of Yellow Watermelon
బరువు పెరుగుతారా? : మామిడిపండులో బరువును తగ్గించే గుణాలుంటాయని కొందరు అంటుంటే.. మరికొందరేమో దీన్ని తింటే బరువు పెరిగిపోతారని హెచ్చరిస్తుంటారు. అయితే.. మామిడిపండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఓ మీడియం సైజ్ మామిడిపండ్లలో 150 కేలరీలు ఉంటాయి. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉండి కడుపు నిండిన భావన కలుగుతుంది. అలాగే మామిడిపండ్లలో డైటరీ ఫైబర్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియని కంట్రోల్ చేస్తుంది. దీంతో కడుపు నిండుగా అనిపించి, ఎక్కువగా తినే అవకాశం ఉండదు. కాబట్టి.. బరువు పెరిగేందుకు అవకాశం ఉండదని చెబుతున్నారు. 2016లో "న్యూట్రిషన్ రీసెర్చ్" జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. మామిడిపండ్లు తినే వ్యక్తులు తినని వారి కంటే బరువు తగ్గే అవకాశం ఎక్కువని కనుగొన్నారు.
ఇతర ప్రయోజనాలు:
- మామిడి పండ్లలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తికి మద్దతునిస్తాయి. అలాగే ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహిస్తాయి.
- మామిడి పండ్లలో డైటరీ ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
- మామిడిలో అమైలేస్ వంటి ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి కార్బోహైడ్రేట్‌లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి. జీర్ణక్రియను సులభతరం చేస్తాయి.
- మామిడిలోని ఫైబర్ కంటెంట్ క్రమంగా పేగు కదలికలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
- మామిడి పండ్లలో విటమిన్ కె ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనది. అలాగే కాల్షియం జీవక్రియను నియంత్రించడంలోనూ సహాయపడుతుంది.
- విటమిన్ కె తగినంత మొత్తంలో తీసుకోవడం వల్ల బోలు ఎముకల వ్యాధి, ఎముక పగుళ్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.