ETV Bharat / health

ఉదయం వాష్​ రూమ్​లో అవస్థలు పడుతున్నారా? - రాత్రివేళ ఈ వాటర్ తాగితే ఆల్​ క్లియర్! - Chia Seed Benefits And Side Effects

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 10:37 AM IST

Chia Seed Benefits : ఇటీవల కాలంలో కొంతమంది పడుకునే ముందు.. చియా గింజలు నానెబెట్టిన నీళ్లను తాగుతున్నారు. మరి, ఇలా తాగడం మంచిదేనా? తాగితే శరీరంలో ఏం జరుగుతుంది? మీకు తెలుసా?

Chia Seed
Chia Seed Benefits (ETV Bharat)

Chia Seed Water Benefits And Side Effects : ప్రస్తుత కాలంలో చాలా మంది ఆరోగ్యానికి మంచిదని చియా గింజలను నీటిలో నానబెట్టుకుని తాగుతున్నారు. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే చియా గింజలను డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల హెల్దీగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, కొంత మంది రాత్రి పడుకునే చియా గింజల నీళ్లను తాగుతున్నారు. ఇలా నైట్‌ టైమ్‌లో తాగడం మంచిదేనా ? తాగితే ఏం జరుగుతుంది? అనేది ఇప్పుడు చూద్దాం.

జీర్ణక్రియకు ఎంతో మేలు : చియా సీడ్స్‌లో డైటరీ ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగపరచడానికి ఎంతో సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు చియా గింజల నీళ్లు తాగడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 2017లో "Nutrition Journal" ప్రచురితమైన అధ్యయనం ప్రకారం రెండు వారాల పాటు రాత్రి పడుకునేముందు రెండు టేబుల్ స్పూన్ల చియా విత్తనాలను నీళ్లలో కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడిందని, మలబద్ధకం సమస్య తగ్గిందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో టెక్సాస్ A&M విశ్వవిద్యాలయంలో న్యూట్రిషన్ ప్రొఫెసర్ డా. డేవిడ్ జె. బ్రౌన్ పాల్గొన్నారు. చియా విత్తనాలలోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని ఆయన పేర్కొన్నారు.

అలర్ట్​: నైట్ సరిపడా నిద్రపోయినా - పగలు మళ్లీ నిద్ర వస్తోందా? - ఈ అనారోగ్య సమస్యలే కారణమట!

హైడ్రేట్‌గా ఉంచుతుంది : చియా సీడ్స్‌ నానబెట్టిన వాటర్‌ తాగడం వల్ల బాడీని హైడ్రేట్‌గా ఉండొచ్చు. ఈ నీటిని రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల శరీరంలో హైడ్రేషన్ స్థాయిలు సమర్థవంతంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

బరువు అదుపులో : బరువు తగ్గాలనుకునే వారు రాత్రి పడుకునే ముందు చియా గింజల నీళ్లను తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇందులో ఉండే కొన్ని లక్షణాలు ఆరోగ్యకరమైన బరువు కొనసాగేలా సహాయం చేస్తాయని నిపుణులంటున్నారు.

చక్కెర స్థాయులు అదుపులో : మధుమేహం వ్యాధితో బాధపడేవారు.. రాత్రి పడుకునే ముందు చియా సీడ్‌ వాటర్‌ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. దీనివల్ల రక్తంలో షుగర్‌ స్థాయులు పెరిగిపోకుండా నియంత్రించుకోవచ్చు.

రెడ్ యాపిల్ Vs గ్రీన్ యాపిల్ - డయాబెటిస్ పేషెంట్స్​కు ఈ రెండింటిలో ఏది మంచిది!

ఎముకలు ఆరోగ్యంగా : చియా విత్తనాలలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఎన్నో పోషకాలు నిండి ఉన్నాయి. పడుకునే ముందు చియా సీడ్స్‌ నానబెట్టిన వాటర్‌ తీసుకోవడం వల్ల శరీరానికి ఈ పోషకాలు అందుతాయి. దీనివల్ల ఎముకల ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, రాత్రిపూట చియా సీడ్‌ వాటర్‌ తాగడం వల్ల కొంతమందిలో సైడ్‌ఎఫెక్ట్స్ కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

  • చియా గింజల్లో ఉండే అధిక ఫైబర్‌ వల్ల కొంతమందిలో కడుపు ఉబ్బరం, గ్యాస్‌ వంటి జీర్ణ సమస్యలు కలుగుతాయి.
  • చియా గింజలు ఎక్కువసేపు నానబెట్టకుండా.. ఆ నీటిని తాగడం వల్ల త్వరగా జీర్ణం కావు!
  • కొంతమంది నైట్‌ చియా సీడ్‌ వాటర్‌ తాగడం వల్ల వారిలో అలర్జీ, దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి.
  • అలాగే ఈ నీటిని రాత్రి తాగడం వల్ల తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావచ్చు. దీనివల్ల నిద్రకు ఆటంకం కలగవచ్చు.
  • చివరిగా చియా సీడ్ వాటర్‌ వల్ల ఎన్ని ప్రయోజనాలున్నప్పటికీ, కొందరిలో కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీరు ఒకవేళ ఈ వాటర్‌ తాగాలనుకుంటే.. మీ వ్యక్తిగత వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది!

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

జుట్టు ఎక్కువగా రాలుతోందా ? - రోజూ ఈ జ్యూస్‌లు తాగారంటే ప్రాబ్లమ్​ సాల్వ్​!

ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరగడం నుంచి బరువు తగ్గేవరకు - కివీతో ప్రయోజనాలు ఎన్నో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.