ETV Bharat / health

మహిళల్లో లోయర్ బ్యాక్​ పెయిన్​ - ఎందుకొస్తుంది? ఎలా రిలీఫ్‌ పొందాలి? - Causes Of Back Pain

Causes For Lower Back Pain in Women : చాలా మంది మహిళలు నడుంనొప్పితో బాధపడుతుంటారు. కానీ.. అది ఎందుకొచ్చంది? ఎలా ఉపశమనం పొందాలి? అన్నది మాత్రం వారికి తెలియదు. మరి.. ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Causes Of Back Pain In Women
Causes Of Back Pain In Women
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2024, 10:49 AM IST

Causes Of Back Pain in Women : నేటి ఆధునిక జీవితంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నడుము నొప్పి ఒకటి. ఈ నొప్పితో మహిళలు పడే బాధ మాటాల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. వెన్నులో అనుక్షణం సూదులతో గుచ్చినట్లుగా తీవ్రంగా ఉంటుంది. మరి.. మహిళల్లో ఈ వెన్నునొప్పి రావడానికి కారణాలు ఏంటి ? ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలి? అనే ప్రశ్నలకు నిపుణులు ఏం చెబుతున్నారన్నది తెలుసుకుందాం.

వెన్నునొప్పికి కారణాలు..

  • మనం వంగినా, కూర్చున్నా సరే.. నడుము స్ట్రెచ్‌ కావడానికి వెన్నులోని డిస్క్‌లు హెల్ప్ చేస్తాయి. అయితే.. కొంత మందిలో డిస్క్‌లు అరిగిపోవడం వల్ల, అలాగే డిస్క్‌లు పక్కకు జరిగిపోవడం వల్ల నడుము నొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
  • నడుము నొప్పి రావడానికి మరో ప్రధాన కారణం వెన్ను పూసల మధ్య ఉన్న మృదులాస్థి తగ్గిపోవడమని అంటున్నారు. కార్టిలేజ్‌ తగ్గిపోయి ఆస్టియోఫైట్స్‌ ఏర్పడటం వల్ల నడుము నొప్పి వస్తుంది.
  • అలాగే బ్యాక్‌ పెయిన్‌ రావడానికి మరో కారణం.. వెన్నెముక చివరి భాగం అరిగిపోవడమేనని నిపుణులు చెబుతున్నారు.
  • ఇవే కాకుండా.. టీబీ, క్యాన్సర్‌ వంటి జబ్బులతో బాధపడుతున్న వారు కూడా నడుము నొప్పితో బాధపడతారు.
  • మనం రోడ్డుపై బైక్‌పై ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా అనుకోని కారణాల వల్ల ప్రమాదానికి గురై గాయాలపాలైనా కూడా నడుము నొప్పి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

చంకలో ఎర్రటి దద్దుర్లు ఇబ్బందిపెడుతున్నాయా? - అయితే కారణాలు ఇవే!

నడుము నొప్పి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ?

  • నడుము నొప్పితో బాధపడేవారు వంగి చేసే పనులకు దూరంగా ఉండాలి.
  • అలాగే వీరు నొప్పి అధికంగా ఉన్నప్పుడు బెడ్‌ రెస్ట్‌ తీసుకోవడం చాలా ముఖ్యం.
  • ఇలా చేయడం వల్ల కండరాలకు కొంత విశ్రాంతి కలిగి నొప్పి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
  • ఇలాంటప్పుడు లేవడం, కూర్చోవడం మరింత ఇబ్బందిగా ఉంటే రెండు, మూడు రోజుల వరకు విశ్రాంతి తీసుకోవాలి.
  • పడుకునేటప్పుడు పిల్లలు ఎలా కాళ్లు, చేతులను ముడుచుకుని పడుకుంటారో అలా పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నొప్పి కొంత వరకు తగ్గుతుంది.
  • నడుము నొప్పి ఎక్కువగా ఉన్నవారు వేడి నీళ్లలో ఒక వస్త్రం ముక్కను ముంచి, తర్వాత నీళ్లను పిండేసి పెయిన్‌ ఉన్న చోట కాపడం పెట్టుకోవాలి.
  • ఇలా ఐస్‌ ప్యాక్‌లను కూడా ట్రై చేయొచ్చని నిపుణులంటున్నారు.
  • బ్యాక్‌ పెయిన్‌ అధికంగా ఉన్నవారు వైద్యులను సంప్రదించి, ఫిజియోథెరపీ లాంటి చికిత్సలు తీసుకోవడం వల్ల తొందరగా నొప్పి నుంచి ఉపశమం పొందవచ్చు.

నడుము నొప్పి రాకుండా ముందు జాగ్రత్తలు..

  • నడుము నొప్పి రాకుండా ఉండాలంటే.. మీరు అధిక బరువు వుంటే వెంటనే తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలి.
  • త్వరగా బరువు తగ్గేలా ఆహార అలవాట్లు, జీవనశైలిని మార్చుకోవాలి.
  • అలాగే నిత్యం వ్యాయామం చేయాలి.
  • ఇంకా కూర్చుని పని చేసేవారు వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చోవాలి.
  • ఇప్పటికే నడుం కింది భాగంలో నొప్పి ఉంటే వేడి నీటి కాపడం పెట్టుకోవాలి.
  • శరీరానికి విటమిన్‌ డి అందడానికి ఉదయాన్నే కొంత సేపు ఎండలో నిల్చోవాలి.
  • నొప్పి తీవ్రంగా ఉంటే మాత్రం.. వెంటనే వైద్యులను కలవాలి.

అధిక బరువు ఉన్న మహిళలకు పిల్లలు పుట్టరా? డాక్టర్లు ఏం చెబుతున్నారు?

ఆఫీసులో ఎక్కువ సేపు కూర్చుంటున్నారా? - హెల్దీగా ఉండటానికి ఇలా చేయండి!

మూత్రం బలవంతంగా ఆపుకుంటున్నారా? - ఏం జరుగుతుందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.