ETV Bharat / health

ఛాతీ అందంగా, ఆరోగ్యంగా ఉండేందుకు - ఈ జాగ్రత్తలు మేలంటున్న నిపుణులు! - HEALTH TIPS FOR BREAST

-జీవనశైలిలో మార్పులు, అధిక బరువు ప్రధాన కారణాలు! -ఈ టిప్స్​ పాటించాలని నిపుణుల సూచన

Breast Health Tips
Breast Health Tips (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2024, 2:50 PM IST

Breast Health Tips : అమ్మాయిల అందాన్ని పెంచడంలో ఛాతీ పాత్ర కీలకంగా ఉంటుంది. అయితే బిగుతైన దుస్తులు, తీసుకునే ఆహారం, జీవనశైలి మార్పులు.. ఇటువంటివన్నీ వాటి​ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే ఛాతీ అందాన్ని, ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు.. రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. మరి, అలా జరగకుండా ఉండాలంటే ఛాతీ ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచిస్తున్నారు. ఈ నెల "రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం" నేపథ్యంలో ఛాతీ ఆరోగ్యానికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలేంటో ఈ స్టోరీలో చూద్దాం..

తగినంత నిద్ర : రాత్రి నిద్రపోయే టైమ్​లో మన శరీరంలో హార్మోన్లన్నీ సమతుల్య స్థితిలోకి వస్తాయి. ముఖ్యంగా ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్ స్థాయులు తగ్గుతాయి. ఇది అధిక స్థాయిలో ఉంటే ఛాతీ ఆరోగ్యంపై కొంత ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. కాబట్టి డైలీ ఎనిమిది గంటల పాటు ప్రశాంతంగా నిద్ర పోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు.

ఆరోగ్యకరమైన బరువు : ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అయితే, సాధారణ బరువు కంటే.. అధిక బరువుతో బాధపడే మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని 'నేషనల్​ లైబ్రరీ ఆఫ్​ మెడిసిన్'​ వెల్లడించింది. (రీసెర్చ్ రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి). కాబట్టి, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ.. మహిళలు ఆరోగ్యకరమైన బరువుని కొనసాగించాలని నిపుణులు చెబుతున్నారు.

తగినంత ఫోలిక్ యాసిడ్ : డైలీ మనం తినే ఆహారం ద్వారా తగినంత ఫోలిక్ యాసిడ్ శరీరానికి అందకపోయినా క్యాన్సర్ ముప్పు పెరుగుతుందట. కాబట్టి, ప్రతిరోజు ఆహారంలో భాగంగా 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ అందేలా చూసుకోవాలి. ఇందుకోసం పాలకూర, నిమ్మజాతికి చెందిన పండ్లు, బీన్స్, అవకాడో.. మొదలైన వాటిని డైట్​లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

విటమిన్ 'డి' కూడా ముఖ్యమే : బ్రెస్ట్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే వాటిలో విటమిన్ డి కూడా ఒకటి. అందుకే లేలేత సూర్యకిరణాలు చర్మంపై పడేలా కొద్దిసేపు మార్నింగ్​ ఎండలో నిలబడడం మంచిది. అలాగే ఈ పోషకం అధికంగా ఉండే పదార్థాలు డైట్లో చేర్చుకోవాలి. మరీ అత్యవసరమైతే డాక్టర్ల సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్లను వాడాలని వివరిస్తున్నారు.

మసాజ్​తో మేలు : రోజువారీ ఒత్తిళ్ల నుంచి రిలీఫ్​ పొందేందుకు మసాజ్‌ చక్కగా తోడ్పడుతుంది. చేతులతో మృదువుగా రోజూ ఐదు నిమిషాల పాటు బ్రెస్ట్ మసాజ్ చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఛాతీపై మర్దన చేసుకోవడం వల్ల వాటిని తీరైన ఆకృతిలో తీర్చిదిద్దుకోవడంతో పాటు.. ఏవైనా గడ్డలు, నొప్పి.. వంటి సమస్యలు ఉన్నా వెంటనే గుర్తించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఈ జాగ్రత్తలు కూడా..

  • ఆరోగ్యంగా ఉండడానికి తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి.
  • సౌకర్యవంతంగా ఉండే బ్రా ధరించాలి.
  • బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకోవడం.. మొదలైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కూడా ఛాతీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

పీరియడ్స్​ రెగ్యులర్​గా రావడం లేదా? - ఆయుర్వేదం ప్రకారం ఈ ఫుడ్​ తీసుకుంటే మంచిదట!

అధిక కొలెస్ట్రాల్​ వెన్నలా కరగాలా? - డైలీ డైట్​లో ఈ ఆహారాలు చేర్చుకుంటే మంచిదట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.