ETV Bharat / health

పిల్లల్లో మెమరీ పవర్​ పెరగాలా? - డైలీ ఈ యోగాసనాలు వేస్తే వారికి తిరుగుండదు!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 4:00 PM IST

Updated : Mar 6, 2024, 4:35 PM IST

Yoga Asanas for Kids : పిల్లల్లో ఏకాగ్రత, మెదడు పనితీరు మెరుగుపడి, శారీరకంగా, మానసికంగా దృఢంగా మారడానికి యోగాసనాలు బెస్ట్​ ఆప్షన్​ అంటున్నారు నిపుణులు. వీటిని డైలీ వేయడం బోలెడు లాభాలున్నాయంటున్నారు. వీటిని వేయడం కూడా ఈజీనే అంటున్నారు. ఇంతకీ, పిల్లలు సులభంగా వేసే ఆ యోగాసనాలేంటో ఇప్పుడు చూద్దాం.

Yoga
Yoga Asanas for Kids

Best Yoga Poses for Kids Health : ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, అన్నింటిలోనూ చురుకుగా ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా చదువులో ఉన్నతంగా రాణించాలని ఎక్కువగా ఆశపడతారు. ఇందుకోసం లక్షలు ఖర్చు చేస్తూ మంచి పాఠశాలలో చదివిస్తుంటారు. అయితే, చాలా మంది పిల్లలు ఆందోళన, ఒత్తిడి వంటి ప్రాబ్లమ్స్​తో బాధపడుతుంటారు. కాబట్టి తల్లిదండ్రులు.. పిల్లల చదువు పైనే కాదు ఇతర విషయాలపై కూడా దృష్టి పెట్టాలని.. ముఖ్యంగా పిల్లలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడం కోసం యోగాసనాలు(Yoga) ప్రాక్టీస్ చేసేలా చూడడం మంచిదంటున్నారు. అందుకోసం కొన్ని యోగాసనాలు సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

child pose
చైల్డ్ పోజ్

చైల్డ్ పోజ్ : దీనినే బాలాసనం అని కూడా పిలుస్తారు. ఇది పిల్లలు వేయదగిన మరొక సులభమైన యోగాసనం. పిల్లల్లో ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో ఈ యోగా పోజ్ చాలా బాగా సహాయపడుతుంది. మూవ్‌మెంట్, మైండ్‌ఫుల్‌నెస్ అండ్ మెంటల్ హెల్త్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. బాలాసనం అనే యోగాసనం పిల్లల్లో మెదడు అభివృద్ధికి సహాయపడుతుందని వెల్లడైంది.

దీనిని ఎలా వేయాలంటే..

  • ముందుగా మ్యాట్‌పై మోకాళ్లను మడిచి పాదాలు పిరుదులను తాకేలా కూర్చోవాలి.
  • ముందుకు వంగి చేతులు, తలను భూమికి తాకిస్తూ గాలి పీల్చుకోవాలి.
  • ఈ స్థితిలో మీరు ఉండగలిగనంత సేపు ఉండాలి.
  • ఆ తర్వాత పైకి లేచే క్రమంలో గాలిని బయటకు వదలాలి. ఇలా కనీసం ఐదు నుంచి పదిసార్లు చేయాలి.
    Cat Cow Pose
    క్యాట్‌ కౌ పోజ్

క్యాట్‌ కౌ పోజ్ : మార్జాలాసనం-బిటిలాసనం అని కూడా పిలుస్తారు. ఇది వేయడం ద్వారా కూడా పిల్లలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఈ యోగాసనం వేయడం వల్ల మెడ, భుజాలు, వెన్ను కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. నాడులు ఉత్తేజంగా మారతాయి. చాలాసేపు కూర్చొని చదివే పిల్లలు దీన్ని ప్రయత్నిస్తే మంచి ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు.

దీనిని ఎలా వేయాలంటే..

  • మార్జాలాసనం వేయడానికి మొదట వజ్రాసనంలో కూర్చోవాలి.
  • ఆ తర్వాత శరీరాన్ని ముందుకు వంచుతూ అరచేతులు నేలకు ఆనించాలి.
  • ఈ భంగిమలో అరచేతులు భుజాలకు, మోకాళ్లు తుంటి భాగానికి సమాంతంగా ఉండేలా చూసుకోవాలి.
  • ఇప్పుడు మెల్లిగా శ్వాస వదులుతూ నడుము భాగాన్ని వీలైనంతగా పైకి తీసుకురావాలి.
  • ఆ తర్వాత తలను మెల్లిగా కిందకు దించాలి. ఇలాగే కొంతసేపు ఉండాలి.
  • ఇప్పుడు నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ తిరిగి నడుమును కిందకు వంచాలి.
    mountain pose
    తాడాసనం

మౌంటెన్ పోజ్ : దీనినే తాడాసనం అని కూడా పిలుస్తారు. ఇది పిల్లలు వేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ యోగాసనం పిల్లల్లో ఏకాగ్రతను పెంచుతుంది. అలాగే వెన్నెముకను నిటారుగా ఉంచడానికి, ఎత్తును పెంచడానికి సహాయపడుతుంది.

ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే..

  • ముందుగా పిల్లలు తమ రెండు కాళ్లను పాదాలు తగిలేలా దగ్గరకు చేర్చి నిటారుగా నిల్చోవాలి.
  • ఆ తర్వాత చేతులను పైకి చాచి ఉంచాలి.
  • ఆపై మెల్లగా కళ్లు మూసుకొని బాడీని రిలాక్స్ చేయాలి.
  • ఇలా సాధ్యమైనంత సేపు ఉండాలి. ఫలితంగా ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చంటున్నారు యోగా నిపుణులు.

ఈ యోగాసనాలతో మీ జ్ఞాపకశక్తి ఫుల్లుగా పెరిగిపోతుంది - విద్యార్థులకు సూపర్ బెనిఫిట్స్!

ట్రీ పోజ్ : దీనినే వృక్షాసనం అని కూడా అంటారు. ఇది పిల్లల ఏకాగ్రత, అంతర్గత బలాన్ని ప్రోత్సహించడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాళ్లు, చీలమండలు, పాదాల కండరాలను కూడా బలపరుస్తుంది.

ఇక ఆసనం ఎలా వేయాలంటే..

  • కాళ్ల మధ్య దూరం రెండు ఇంచులు ఉండేలా నిల్చొని కుడి పాదాన్ని, ఎడమ పాదం తొడపై పెట్టాలి.
  • బాడీ మొత్తాన్ని నిటారుగా ఉంచాలి. ఇక గాలిని వదులుతూ రెండు చేతులను పైకి లేపి నమస్కార ముద్రలో ఉంచాలి.
  • ఆపై కొన్ని సెకన్ల పాటు ఇలా ఉంటూ నార్మల్​గా గాలిని పీల్చుకోవాలి.
  • ఆ తర్వాత నెమ్మదిగా గాలిని వదులుతూ చేతులను కిందకు దించాలి.
  • ఇలాగే ఎడమ పాదాన్ని, కుడి పాదం తొడపై ఉంచే పోజ్ చేయాలి.
    Yoga Asanas
    అధో ముఖ స్వనాసనం

అధో ముఖ స్వానాసనం : డైలీ పిల్లలు ఈ యోగాసనం వేయడం ద్వారా కూడా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. రివర్స్ V షేప్​లో ఈ పోజ్ ఉంటుంది. ఇది మొత్తం శరీరాన్ని ఫిట్​గా ఉంచడంలో సహాయపడుతుంది. మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. దృష్టి, ఏకాగ్రతను ప్రోత్సహిస్తుంది. వెన్నెముకలో ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఈ యోగాసనం ఎక్కువ సమయం కూర్చొని గడిపే పిల్లలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు నిపుణులు.

దీన్ని ఎలా వేయాలంటే..

  • ఈ అధో ముఖ స్వనాసనం వేయడానికి ముందుగా నేలపై బోర్లా పడుకోవాలి.
  • ఇప్పుడు రెండు అరచేతులను, పాదాల వేళ్లను భూమికి గట్టిగా నొక్కి పట్టాలి.
  • బాడీ మెుత్తం వెయిట్‌ను అరచేతులు, పాదాల వేళ్ల మీద మోపి నిదానంగా శరీరంలో ఒక్కో భాగాన్ని పైకి లేపుతూ V ఆకారంలోకి శరీరాన్ని తీసుకురావాలి.
  • ఈ ఆసనం చేస్తున్నప్పుడు చేతులు భుజాలు వెడల్పుగా ఉండాలి.
  • ఈ భంగిమలో ఉన్నప్పుడు లోతుగా శ్వాస తీసుకోవాలి.
  • 30సెకన్ల పాటు ఈ భంగిమలో ఉన్న తర్వాత తిరిగి సాధారణ స్థితికి శరీరాన్ని మెల్లగా తీసుకురావాలి.

వాకింగ్‌, యోగా- వీటిలో బరువు తగ్గడానికి ఏది బెస్ట్‌ ఆప్షన్ ? నిపుణుల మాటేంటి!

Last Updated : Mar 6, 2024, 4:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.