ETV Bharat / health

మీ నెయిల్స్ తరచూ విరుగుతున్నాయా? - ఇలా చేశారంటే ఆ ప్రాబ్లమ్ రాదు! - Nails Breakage Prevent Tips

Nails Breakage Prevent Tips : మన శారీరక సౌందర్యాన్ని పెంచడంలో గోళ్లు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందుకే.. గోళ్లను పొడవుగా పెంచుకొని వాటికి రకరకాల రంగులు వేస్తుంటారు. అయితే.. కొందరికి గోళ్లు పెంచాలని కోరికగా ఉన్నప్పటికీ.. అవి కాస్త పొడవు పెరగ్గానే విరిగిపోతుంటాయి. మీరూ ఈ సమస్య ఫేస్ చేస్తుంటే.. ఈ టిప్స్​ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Nails
Nail Care Tips
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 7, 2024, 12:10 PM IST

Best Tips for Prevent Nails Breakage : మీరు తరచూ నెయిల్స్ విరిగిపోయే సమస్యతో బాధపడుతున్నారా? అయితే.. కొన్ని టిప్స్ ఫాలో అయ్యారంటే మీ గోళ్లు(Nails) విరిగే సమస్య తగ్గడమే కాకుండా.. పొడవైన, ఆరోగ్యమైన గోళ్లను సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఇంతకీ.. ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సరైన పోషకాహారం : గోళ్లను ఆరోగ్యంగా, విరగకుండా ఉంచడంలో మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా బయోటిన్ ఎక్కువగా ఉండే ఉడికించిన గుడ్లు, క్యాలీఫ్లవర్‌, అవకాడో వంటి పదార్థాలు అధికంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలంటున్నారు. ఫలితంగా గోళ్లు దృఢంగా, ఆరోగ్యంగా పెరుగుతాయని చెబుతున్నారు. అలాగే విటమిన్ A, C, E, కాల్షియం, ఐరన్, ప్రొటీన్లు అధికంగా లభించే ఆహార పదార్థాలనూ రోజూ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

తగినంత వాటర్ : నెయిల్స్ కాస్త పెరగ్గానే పొడిబారి పెళుసుగా మారి విరిగిపోకుండా ఉండాలంటే.. హైడ్రేట్​గా ఉండటం అవసరమంటున్నారు నిపుణులు. ఇందుకోసం రోజూ తగినంత నీరు తాగాలని సూచిస్తున్నారు. అదనంగా.. మాయిశ్చరైజింగ్ హ్యాండ్ క్రీమ్ లేదా క్యూటికల్ ఆయిల్‌ క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల.. అది గోళ్లు, చుట్టుపక్కల చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుందట. ఇది గోళ్లు విరిగిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు.

సంరక్షణ చర్యలు : పనులు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ముఖ్యంగా ఇంటి పనులు చేసేప్పుడు గ్లౌజులు ధరిస్తే.. నెయిల్స్ మీద ప్రత్యక్షంగా ప్రభావం పడదు. డిటర్జెంట్స్ ఉపయోగించే పనిచేసిన వెంటనే.. అది గోళ్లలో ఇరుక్కోకుండా వెంటనే నీటితో శుభ్రం చేసుకోవాలంటున్నారు. అలాగే డబ్బా మూతలు తీసేందుకు నెయిల్స్ వాడొద్దని సూచిస్తున్నారు.

గోళ్లను శుభ్రంగా ఉంచుకోవడం : అందంగా గోళ్లు పెంచుకోవాలనుకుంటే అవి శుభ్రంగా ఉండేలా కూడా జాగ్రత్తపడాలి. లేదంటే.. గోళ్లపై ఉండే మురికి వల్ల బ్యాక్టీరియా చేరి గోళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. అందుకే.. ఎప్పటికప్పుడు నెయిల్స్​ను శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు. గోళ్ల కింద మురికిని తొలగించడానికి సున్నితమైన నెయిల్ బ్రష్‌ను ఉపయోగించాలని సూచిస్తున్నారు.

గోళ్లు అందంగా లేవా? - ఈ బెస్ట్ టిప్స్ మీకోసమే!

వీటికి దూరంగా ఉండాలి : గోళ్లు విరిగిపోకుండా పెరగాలంటే.. నెయిల్‌పాలిష్ రిమూవర్ల వాడకాన్ని తగ్గించేయాలంటున్నారు నిపుణులు. నెలకి ఒకటి రెండు సార్లకు మించి ఉపయోగించొద్దని సూచిస్తున్నారు. వాటిలో ఉండే అధిక గాఢత రసాయనాలు గోళ్ల ఆరోగ్యాన్ని సులభంగా దెబ్బతీస్తాయట. ముఖ్యంగా వాటిల్లో ఉండే ఎసిటోన్ గోళ్లకు మంచిది కాదట. వీలైతే ఎసిటోన్ రహిత రిమూవర్లను ఎంచుకోవడం మంచిది అంటున్నారు.

2019లో "Journal of the American Academy of Dermatology" అనే జర్నల్​లో ప్రచురితమైన పరిశోధన వివరాల ప్రకారం.. నెయిల్ పాలిష్ రిమూవర్‌ను వారానికి రెండుసార్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఉపయోగించే మహిళలకు గోళ్లు విరిగిపోయే అవకాశం 63% ఎక్కువ అని కనుగొన్నారట. ఈ పరిశోధనలో పాల్గొన్న అమెరికాలోని ప్రముఖ డెర్మటాలజిస్టు డాక్టర్ జాన్ డో.. నెయిల్ పాలిష్ రిమూవర్‌ను ఎక్కువగా ఉపయోగించే మహిళలల్లో గోళ్లు పలుచగా మారి తరచుగా విరిగిపోతాయని పేర్కొన్నారు.

అలవాటు మానుకోవాలి : కొంతమందికి నెయిల్స్ కొరికే అలవాటుంటుంది. దీనివల్ల గోళ్లపై క్రిములు చేరి, వాటి పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి గోళ్లను అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఈ అలవాటును వెంటనే మానుకోవాలని సూచిస్తున్నారు. ఇవి పాటిస్తే.. గోళ్లను హెల్తీగా పెంచుకోవచ్చని సూచిస్తున్నారు.

మీ గోళ్లు ఇలా మారితే చాలా డేంజర్.. ఆ వ్యాధులు వచ్చే ప్రమాదం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.