ETV Bharat / health

హెల్దీ, గ్లోయింగ్ స్కిన్ కావాలా? - నిపుణులు చెబుతున్న డైట్ ఇదే!

-చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే ఆహారాలు -ఈ పద్ధతిలో తింటే చర్మానికే కాకుండా పూర్తి ఆరోగ్యానికీ మేలు

author img

By ETV Bharat Health Team

Published : 4 hours ago

Best Foods for Glowing Skinq
Best Foods for Glowing Skin (ETV Bharat)

Best Foods for Glowing Skin: చర్మం అందంగా మెరుస్తూ ప్రకాశవంతంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఇందుకోసమే మార్కెట్​లో దొరికే అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. దీంతో కొన్ని సార్లు సైడ్​ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అయితే బ్యూటీ ప్రొడక్ట్స్​ అవసరం లేకుండా.. ఈ ఆహారాలను మీ డైలీ డైట్​లో చేర్చుకుంటే చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకుని మంచి గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చంటున్నారు పోషకాహార నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కుటుంబ వారసత్వంగా చర్మ సౌందర్యం ఆధార పడుతుందని ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ శ్రీలత చెబుతున్నారు. దీంతో పాటు మనం తీసుకునే జాగ్రత్తల వల్ల కూడా చర్మ సౌందర్యం మెరుగు పడుతుందని వివరిస్తున్నారు. ముఖ్యంగా మనం బ్యాలెన్స్​డ్ డైట్ తీసుకోవాలని.. ఇందులో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవాలని.. ఫలితంగా చర్మం మెరుగు పడుతుందని సూచిస్తున్నారు. ప్రోటీన్లలో ఎక్కువగా ఉండే అమైనో యాసిడ్స్.. చర్మానికి అవసరమైన కొల్లాజెన్​ను ఉత్పత్తి చేస్తాయని పేర్కొన్నారు. ఇది ముడతలు రాకుండా, చర్మం పొడిబారకుండా ఉండేలా సాయపడుతుందని అంటున్నారు. పాలు, పెరుగు, గింజలు, చేపలు, గుడ్లు, చికెన్ లాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల చర్మ ముడతలు రాకుండా ఉంటుందని తెలిపారు. ఇంకా విటమిన్ ఏ, విటమిన్ ఈ, జింక్, సెలీనియం లాంటి మినరల్స్ కూడా చర్మ సౌందర్యాన్ని మెరుగపరుస్తాయని వివరిస్తున్నారు.

విటమిన్ ఏ చర్మ సౌందర్యానికి సహాయ పడుతుంది. ఇంకా దీనికి బయట నుంచి వచ్చే బ్యాక్టీరియాతో పోరాడే శక్తి ఎక్కువగా ఉంటుంది. పాలు, ఆకుకూరలు, పసుపు, ముదురు పసుపు రంగులో ఉండే కూరగాయలు, ఆకుకూరలు, పళ్లలో విటమిన్​ ఏ అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకునేలా చూసుకోవాలి. చేపల్లో కూడా ఇది సమృద్ధిగా ఉంటుంది. అందుకే వారానికి రెండు సార్లు చేపలు తీసుకునేలా ప్రయత్నించాలి. ఇంకా విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్​గా పనిచేస్తుంది. చర్మం ప్రకాశవంతంగా మారడానికి విటమిన్ ఈ ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా కొంత మంది వేసుకునే క్యాప్సుల్స్ కూడా సాయపడతాయి. మనం తీసుకునే ఆహారంలో జింక్ ఎక్కువగా లభించదు. గింజలు, పొద్దు తిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజల్లో ఎక్కువగా లభిస్తుంది. సెలినీయం ఎక్కువగా చేపలు, కొన్ని రకాల నూనె గింజల్లో లభిస్తుంది. గుప్పెడు గింజలు వారంలో తినడం లేదా నూనె తక్కువగా తీసుకోవడం వల్ల విటమిన్ ఏ, విటమిన్ ఈ, జింక్, సెలీనియం లభిస్తాయి.

--డాక్టర్ శ్రీలత, పోషకాహార నిపుణులు

ఇవన్నీ తీసుకోవడం వల్ల చర్మంలో అనేక మార్పులు కనిపిస్తాయని వివరిస్తున్నారు. చర్మ సౌందర్యానికి బ్యాలెన్స్​డ్ డైట్ చాలా కీలక పాత్ర పోషిస్తుందని ఆమె చెబుతున్నారు. మంచి పోషకాహారం తీసుకుంటూనే.. బయట దొరికే జంక్​ ఫుడ్స్ తగ్గించడం వలన చర్మానికే కాకుండా పూర్తి ఆరోగ్యానికీ మేలు జరుగుతుందని చెబుతున్నారు.

NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

కాంతివంతమైన ఫేస్ కోసం 'కాఫీ స్క్రబ్'- ఇలా చేస్తే మీ ముఖం మెరిసిపోవడం ఖాయం!

మీ చర్మం ఇలా తయారవుతోందా? - ఈ చిన్న మార్పుతో మృదువుగా మెరుస్తుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.