Benefits Of Sleeping With Partner Hug : దంపతుల మధ్య ప్రేమ బంధం మరింతగా బలపడడంలో.. మాటలు, చేతలు మాత్రమే కాదు.. స్పర్శ కూడా అత్యద్భుతమైన ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే.. అవకాశం ఉన్న ప్రతిసారీ వారిని కౌగిలించుకోవాలని సూచిస్తున్నారు. అయితే.. నిద్రపోయే సమయంలో వారిపై చేయి వేసి పడుకోవడం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు పరిశోధకులు! అవేంటో ఇప్పుడు చూద్దాం.
నిద్ర ఎక్కువగా పడుతుంది :
రాత్రి పడుకునేటప్పుడు చాలా మంది భార్యభర్తలు కలిసి పడుకుంటారు. అయితే.. ఈ సమయంలో భాగస్వామిని హగ్ చేసుకుని పడుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే.. ఎక్కువసేపు నాణ్యమైన నిద్రపోవచ్చని అంటున్నారు. హగ్ చేసుకుని పడుకోవడం వల్ల మన బాడీలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుందని.. ఇది సుఖంగా నిద్రపోయేలా చేస్తుందని చెబుతున్నారు.
అమెరికాలోని 'ఒహియో స్టేట్ యూనివర్సిటీ' భాగస్వామిని కౌగిలించుకుని పడుకోవడంపై ఒక పరిశోధన నిర్వహించింది. ఈ పరిశోధన పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీ జర్నల్‌లో 2003లో ప్రచురితమైంది. ఈ అధ్యయనంలో పరిశోధకులు కొన్ని జంటలను ఒక వారం పాటు రాత్రి భాగస్వామిని కౌగిలించుకుని పడుకోమని మరికొన్ని జంటలను ఒంటరిగా పడుకోవాలని సూచించారు.
ఈ అధ్యయనంలో.. భాగస్వామిని కౌగిలించుకుని పడుకున్న వారు తక్కువ ఒత్తిడిని అనుభవించారని, అలాగే ఎక్కువ నిద్రపోయినట్లు వారు గుర్తించారు. ఈ పరిశోధనలో ఒహియో స్టేట్ యూనివర్సిటీలో మానసిక శాస్త్ర ప్రొఫెసర్ 'డాక్టర్ టీ. క్రిస్టీన్ లీ' పాల్గొన్నారు. భాగస్వామిని కౌగిలించుకుని పడుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని, నిద్ర ఎక్కువగా పడుతుందని ఆయన పేర్కొన్నారు.
చురుగ్గా ఉంటారు..
రాత్రి భాగస్వామిని హగ్ చేసుకుని పడుకోవడం వల్ల కడుపులో మంట తగ్గుతుందట. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చు. భాగస్వామితో కలిసి నిద్రపోవడం వల్ల మరుసటి రోజు ఉదయం చురుకుగా ఉంటారని నిపుణులంటున్నారు.
బంధం బలపడుతుంది..
భాగస్వామిని హగ్ చేసుకుని పడుకోవడం వల్ల వారి మధ్య బంధం మరింత బలపడుతుంది. కలిసి నిద్రపోవడం వల్ల వారి మధ్య మనస్పర్థలు తొలగిపోయి.. ఒకరిపై మరొకరికి ప్రేమ పెరుగుతుందని నిపుణులంటున్నారు. అలాగే పార్ట్‌నర్‌తో కలిసి పడుకోవడం వల్ల ఎలాంటి భయమూ లేకుండా.. అతి తక్కువ సమయంలోనే నిద్రలోకి జారుకుంటారని చెబుతున్నారు. ఏదేమైనా.. పార్ట్‌నర్‌తో కలిసి నిద్రపోవడం వల్ల సుఖనిద్రను ఆస్వాదించగలమని, ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
వర్షాకాలంలో ఈ ఫ్రూట్స్ తింటే - ఇన్ఫెక్షన్లకు గుడ్‌బై చెప్పొచ్చు! - Fruits to Fight With Infections